ప్యాసింజర్ కార్ల పరిశ్రమను శాసించే ప్రణాళిక వెల్లడించిన టాటా

Written By:
Recommended Video - Watch Now!
Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

దేశీయ వాహన పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విభాగం అతి ముఖ్యమైనది. ఈ విభాగంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా దిగ్గజాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గత రెండేళ్లలో మంచి ఫలితాలు సాధించిన టాటా మోటార్స్ మొదటి మూడింటిలో స్థానం సంపాదించడానికి సరికొత్త ప్రణాళికలను సిద్దం చేసింది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

టాటా మోటార్స్ దాదాపు ప్యాసింజర్ మార్కెట్ నుండి నిష్క్రమించే తరుణంలో చివరి ప్రయత్నంగా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా విభిన్న ఉత్పత్తులను 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించి, ఆ తరువాత రెండేళ్లలో సందర్భానుసారంగా విడుదల చేసి భారీ విజయాన్నిఅందుకుంది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

టాటా మోటార్స్ తాజా డిజైన్ లాంగ్వేజ్ ఇంపాక్ట్ ఫిలాసఫీ ద్వారా రూపొందించిన టాటా టియాగో, టాటా హెక్సా, టాటా నెక్సాన్ మరియు టాటా టిగోర్ కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

సరిగ్గా రెండు సంవత్సరాల అనంతరం, ఇప్పుడు ఫిబ్రవరి 2018లో భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన వేదిక ప్రారంభం కానుంది. ఈ వేదిక మీద టాటా మోటార్స్ రానున్న రెండేళ్ల కోసం కావాల్సిన ఎన్నో కొత్త మోడళ్లను కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

కాలం మారుతున్న నేపథ్యంలో, కొనుగోలుదారుల అభిరుచులు కూడా మారుతున్నాయి. కాబట్టి, డిజైన్‌కు పెద్ద పీట వేస్తూ తమ అన్ని కొత్త మోడళ్లను టాటా వారి సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్‌ క్రింద అభివృద్ది చేస్తోంది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

భవిష్యత్తులో ప్రతి ఇండియన్ కస్టమర్‌ను ఆకట్టుకునేలా ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే సరికొత్త ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను డెవలప్ చేస్తోంది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

టాటా మోటార్స్ తమ ఇంపాక్ట్ డిజైన్ 2.0 గురించి తాజాగా ఓ టీజర్ లాంచ్ చేసింది. ఇందులో ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రవేశపెట్టే వాహన సముదాయం, మరియు వాటి డిజైన్ అంశాలను వెల్లడించే ఫోటోలను రివీల్ చేసింది. ఇందులో ప్యాసింజర్ కార్లను ఆకర్షణీయమైన, స్టైలిష్ లుక్‌లో తీర్చిదిద్దింది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్లను అందివ్వడం మీద దృష్టిపెడుతోంది. ఇక మీదట వచ్చే దాదాపు అన్ని కార్లలో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, హెడ్ ల్యాంప్స్ మరియు ఇండియన్ రోడ్ల అత్యుత్తమ పనితీరు కోసం పెద్ద పరిమాణంలో ఉన్న చక్రాలను అందివ్వనుంది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

టాటా మోటార్స్‌కు ఇంపాక్ట్ డిజైన్ అతి పెద్ద హిట్ తెచ్చి పెట్టింది. దీని క్రింద తీసుకొచ్చిన నెక్సాన్, హెక్సా, టియాగో మరియు టిగోర్ అన్ని కార్లలో కూడా అత్యాధునిక ప్రీమియమ్ ఇంటీరియర్ ఉంది. టాటా విక్రయించే మునుపటి కార్లతో పోల్చుకుంటే గణనీయంగా మార్పులు జరిగాయి.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

కాబట్టి, ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా వచ్చే కార్లలో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా ఇంకా ఎన్నో మార్పులు చేటు చేసుకోనున్నాయి. ఈ సరికొత్త డిజైన్ ఫిలాసఫీలో వస్తున్న తొలి మోడల్ ఎక్స్451 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా క్యూ501 కోడ్ పేరుతో సరికొత్త ఎస్‌యూవీని సిద్దం చేస్తోంది. దీనిని ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా అధునాతన సొబగులతో ఖరీదైన

ఎస్‌యూవీగా ప్రవేశపెట్టనుంది. ఈ ఎస్‌యూవీకి ఇప్పటికే పలుమార్లు అత్యంత రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహించింది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

ఈ రెండు కొత్త ప్యాసింజర్ వెహికల్స్‌తో పాటు,టాటా మోటార్స్ నూతన శ్రేణి వాణిజ్య వాహనాలను కూడా ఆవిష్కరిస్తోంది. టాటా విడుదల చేసిన టీజర్ ఫోటోలో లైట్ కమర్షియల్ వెహికల్ మరియు మీడియం కమర్షియల్ వెహికల్స్‌ను ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించనుంది.

 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో టాటా మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ గత రెండేళ్ల కాలంలో విడుదల చేసిన హెక్సా, నెక్సాన్, టియాగో మరియు టిగోర్ కార్లతో ప్యాసింజర్ కార్ల విపణిలో మంచి వాటాను సొంతం చేసుకుంది. ఈ ఆటో ఎక్స్‌పో ద్వారా మరికొన్ని కొత్త మోడళ్లతో ఈ వాటాను మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే టాటా మోటార్స్ భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీల జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఖచ్చితంగా చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి

టాటా మోటార్స్‌కు డ్రైవ్‌స్పార్క్ తెలుగు నుండి ఆల్ ది బెస్ట్...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Tata Motors Impact Design 2.0 — More Details Revealed

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark