నెక్సాన్ ఆటోమేటిక్ బుకింగ్స్ ప్రారంభించిన టాటా మోటార్స్

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఆటోమేటిక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. నెక్సాన్ ఏఎమ్‌టి మీద దేశవ్యాప్తంగా ఉన్న

By Anil

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2018లో నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఆటోమేటిక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. నెక్సాన్ ఏఎమ్‌టి ఈ ఏడాది మలిసగం నాటికి ఉండాల్సింది. అయితే, అనుకున్న సమయానికి ముందే విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో నెక్సాన్ ఏఎమ్‌టి మీద దేశవ్యాప్తంగా ఉన్న టాటా విక్రయ కేంద్రాల్లో బుకింగ్స్ ఆహ్వానిస్తోంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి వేరియంట్ మరికొన్ని రోజుల్లో విక్రయాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో విడుదలవనుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గల నెక్సాన్ ఎస్‌యూవీని కోరుకునే వారు దేశవ్యాప్తంగా ఉన్న ఏదేని టాటా అధీకృత డీలర్ వద్ద రూ. 11,000 లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి రాకతో విపణిలో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆటోమేటిక్ మరియు మహీంద్రా టియువి300 ఆటోమేటిక్ మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది. మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే.. నెక్సాన్ ఏఎమ్‌టి పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో రావడం.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా నెక్సాన్ ఆటోమేటిక్ మిడ్ వేరియంట్ "ఎక్స్‌టిఎ" మరియు టాప్ ఎండ్ వేరియంట్ "ఎక్స్‌జడ్ఎ "లో పెట్రోల్ మరియు డీజల్ రెండు వెర్షన్‌లలో లభించనుంది. నూతన ట్రాన్స్‌మిషన్‌తో పాటు సరికొత్త ఎట్నా ఆరేంజ్ ఎక్ట్సీరియర్ పెయింట్ మరియు ఇది వరకు లభించే అన్ని రంగుల్లో నెక్సాన్ ఏఎమ్‌టి లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

సరికొత్త ట్రాన్స్‌మిషన్ జోడింపు మరియు నూతన ఎక్ట్సీరియర్ పెయింట్ పరిచయం మినహాయిస్తే నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సాంకేతికంగా ఇది రెగ్యులర్ నెక్సాన్‌లోని ఇంజన్‌లతోనే వస్తోంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

సాంకేతికంగా, టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉన్న 1.2-లీటర్ కెపాసిటి గల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

అదే విధంగా నెక్సాన్‌లోని 1.5-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ వేరియంట్లలో సిటీ, ఇకో మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

మైలేజ్ పరంగా నెక్సాన్ మ్యాన్యువల్ మరియు నెక్సాన్ ఆటోమేటిక్ వేరియంట్ల మధ్య ఓ మోస్తారు వ్యత్యాసం ఉండవచ్చు. నెక్సాన్ ఏఎమ్‌టిలో క్రీప్ ఫంక్షన్ కూడా రానుంది. ఇది, విపరీతమైన రద్దీతో కూడిన రహదారుల్లో ప్రతిసారీ యాక్సిలరేట్ చేయకుండా దానంతటం అదే మెల్లగా వాహనాన్ని ముందుకు పోనిస్తుంది.

టాటా నెక్సాన్ ఆటోమేటిక్

టాటా నెక్సాన్ ఏఎమ్‌టి ధరల వివరాలు అధికారికంగా విడుదల చేసే రోజున టాటా ప్రతినిధులు వెల్లడించనున్నారు. అయితే, నెక్సాన్ ఏఎమ్‌టి ధరలు రెగ్యులర్ వెర్షన్ కంటే రూ. 50,000 ల వరకు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పో 2018లో టాటా ఆవిష్కరించిన కొత్త కార్ల ఫోటోలు క్రింది గ్యాలరీలో...

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon AMT bookings open
Story first published: Thursday, February 22, 2018, 10:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X