సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి మరో సరికొత్త కారును తీసుకొచ్చింది. మారుతి ఎస్-ప్రెస్సో అనే మినీ(మైక్రో) ఎస్‌యూవీని విపణిలోకి రిలీజ్ చేశారు. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లోకి స్మాల్ ఎస్‌యూవీగా తీసుకొచ్చిన మారుతి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 3.69 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు నిర్ణయించారు.

సరికొత్త డిజైన్ శైలితో, అద్భుతమైన ఫీచర్లు మరియు అత్యంత సరసమైన ధరతో విడుదలైన మారుతి ఎస్-ప్రెస్సో గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి...

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీ మొత్తం తొమ్మిది విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, Std (O), LXi, LXi (O), VXi, VXi (O), VXi+, VXi AGS, VXi (O) AGS మరియు VXi+ AGS. అన్ని వేరియంట్లు ఒకే ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతున్నాయి.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీలో సాంకేతికంగా 998సీసీ కెపాసిటీ గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్-ప్రెస్సో టాప్ ఎండ్ వేరియంట్లలో మారుతి వారి ఏజీఎస్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ కూడా లభ్యమవుతోంది.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టో కె10 కారులో కూడా ఇదే ఇంజన్ కలదు. కానీ మారుతి తమ ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీలో మాత్రమే బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే అదే ఇంజన్‌ను అందించింది.

వేరియంట్లు ధరలు
STD Rs 3,69,000
LXI Rs 4,05,000
VXI Rs 4,24,500
VXI+ Rs 4,48,000
VXI AGS Rs 4,67,500
VXI+ AGS Rs 4,91,000
సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

డిజైన్ విషయానికి వస్తే, 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేడుకలో మారుతి సుజుకి ఆవిష్కరించిన ఫ్యూచర్-ఎస్ కాన్సెప్ట్ ఆధారంగా మారుతి ఎస్-ప్రెస్సో కారును రూపొందించారు. ఎస్‌యూవీ తరహా లుక్, కండలు తిరిగిన ఎక్ట్సీరియర్ డిజైన్ మరియు అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ దీని సొంతం.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీ ఫ్రంట్ డిజైన్‌లో ఓ చిన్న సైజు ఎస్‌యూవీ ఫీల్ కలిగించే క్రోమ్ డిజైన్ ఎలిమెంట్లు ఉన్న స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్, దీనికి ఇరువైపులా చతుర్భుజాకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ యూనిట్ ఉంది. విశాలమైన ఎయిర్ ఇంటేకర్ మరియు బంపర్‌లో ఆకర్షణీయంగా ఇమిడిపోయిన పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి మైక్రో ఎస్‌యూవీ సైడ్ డిజైన్‌లో 13-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లో ఆప్షనల్‌గా 14-ఇంచ్ వీల్స్ కూడా లభిస్తున్నాయి. రియర్ డిజన్ విషయానికి వస్తే C-ఆకారంలో ఉన్న టెయిల్ లైట్లు మరియు బంపర్‌కు ఇరువైపులా రిఫ్లక్టర్లు వచ్చాయి.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్ మీకు ఎన్నో ఫీచర్లతో స్వాగతం పలుకుతుంది. డ్యాష్‌బోర్డు మధ్యలో వచ్చినటువంటి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్ యూనిట్ అన్నింటికంటే ప్రత్యేకం. సుజుకి వారి అత్యాధునిక స్మార్ట్ ప్లే స్డూడియో సిస్టమ్ అనే అతి పెద్ద టచ్ స్క్రీన్ డిస్ల్పే కలదు. దీని పైన మరియు కిందివైపుల ఆకర్షణీయమైన బార్డర్ లైటింగ్ కూడా వచ్చింది.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

సెంట్రల్ డ్యాష్‌బోర్డుతో పాటు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్‌‌లో బ్లాక్ కలర్ ఫినిషింగ్ కలదు. ఎన్నో రకాల కప్ హోల్డర్లు మరియు విభిన్న స్టోరేజీ స్పేస్‌లు ఉన్నాయి. రేడియో మరియు ఏసీ కంట్రోల్స్ గల స్టీరింగ్ వీల్ కలదు.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌‍‌యూవీ మీద దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీ కూడా ఆరంభమైనట్లు సమాచారం. కస్టమర్లు రూ. 11,000 లు చెల్లించి ఏదైనా మారుతి సుజుకి అరేనా షోరూముల్లో మారుతి ఎస్-ప్రెస్సో కారును బుక్ చేసుకోవచ్చు.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న డాట్సన్ రెడి-గో మరియు అతి త్వరలో విడుదల కానున్న రెనో క్విడ్ (ఆక్టోబర్ 1న విడుదల) ఫేస్‍‌లిఫ్ట్ కార్లకు సరాసరి పోటీనివ్వనుంది.

సంచలనం రేపిన మారుతి: విపణిలోకి మారుతి మైక్రో ఎస్‌యూవీ విడుదల

మారుతి సుజుకి సంస్థ ఇటీవల కాలంలో భారీ నష్టాలను చవిచూస్తోంది. సుమారుగా 30 శాతానికి పైగా సేల్స్ పడిపోయాయి. మారుతి ఎస్-ప్రెస్సో విడుదలతో సేల్స్ పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఎస్‌యూవీ స్టైల్లో అతి తక్కువ ధర మరియు ధరకు తగ్గ ఫీచర్లతో వచ్చిన మారుతి ఎస్-ప్రెస్సో ఈ పండుగ సీజన్‌లో కంపెనీకి మంచి సేల్స్ సాధించిపెడుతుందనే చెప్పాలి.

Most Read Articles

English summary
Maruti Suzuki S-Presso Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X