మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్లోకి "ఎస్-ప్రెస్సో" అనే పేరుతో ఓ చిన్న కారును విడుదల చేయనున్నట్లు సమాచారం. మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్న తరువాత ఉత్పత్తి మైక్రో ఎస్‌యూవీ అనే విషయం ఇప్పటికే ఖరారైంది. గత ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శనలో మారుతి సుజుకి తొలిసారిగా ఆవిష్కరించిన మారుతి సుజుకి ఫ్యూచర్ ఎస్-కాన్సెప్ట్ మోడల్‌ను ఎస్-ప్రెస్సో పేరుతో స్మాల్ ఎస్‌యూవీగా వచ్చే దీపావళి నాటికి పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది.

మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

మారుతి ఎస్‌-ప్రెస్సో కారు ప్రస్తుతం ఉన్న ఆల్టో స్థానాన్ని భర్తీ చేయదు, కానీ బడ్జెట్ ధరలో ఖరీదైన మోడల్‌ను తలపించేలా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ మార్కెట్ మీద దృష్టిపెడుతున్నట్లు మారుతి సుజుకి ప్రతినిధులు పేర్కొన్నారు. అంటే ఇది విడదులైనా కూడా ఆల్టో మోడల్ యథావిధిగా అమ్మకాల్లో ఉంటుంది.

మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో స్మాల్ ఎస్‌యూవీ కారులో సాంకేతికంగా కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించే అవకాశం ఉంది. బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

యువ కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు మారుతి ఎస్-ప్రెస్సో మోడల్‌ను ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇందులో సెగ్మెంట్లోనే బెస్ట్‌గా నిలిచే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇటీవల విడుదలైన వ్యాగన్‌ఆర్ కారులో పరిచయమైన స్మార్ట్ ప్లే ఆడియో యూనిట్ మరియు డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్ల బడ్జెట్ తరహాలో ఎస్‌యూవీ కార్లను కోరుకునే కస్టమర్లకు మారుతి ఎస్-ప్రెస్సో అత్యుత్తమ ఛాయిస్ అని చెప్పవచ్చు. హ్యాచ్‌బ్యాక్ కారుకు వెచ్చించే ధరలోనే ఓ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీ కలను ఈ కారు ద్వారా తీర్చుకోవచ్చు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మోడల్ ధరను రూ. 4.5 లక్షల నుండి రూ. 5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించే అవకాశం ఉంది.

మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

మారుతి సుజుకి వితారా బ్రిజా తర్వాత పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ది చేసిన రెండవ మోడల్ ఈ సరికొత్త స్మాల్ ఎస్‌యూవీ. ఇండియాలో ఉన్న మారుతి సుజుకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం ఈ ఎస్-ప్రెస్సో మోడల్‌ను పూర్తి స్థాయి దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ది చేశారు. ఇందులో బాలెనో తరహా కండలు తిరిగిన శరీరాకృతి, పెద్ద పరిమాణంలో ఉన్న హ్యాలోజియన్ హెడ్ ల్యాంప్ యూనిట్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

మైక్రో ఎస్‌యూవీతో మరో సంచలనానికి తెరదించిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాఫీ రుచుల్లో ఎస్‌ప్రెస్సో ఒకటి, మారుతి ఎస్-కాన్సెప్ట్ మోడల్‌ ప్రొడక్షన్ వెర్షన్‌కు ఎస్-ప్రెస్సో పేరును ఎవరు ఖరారో చేశారు, ఈ పేరును ఎలా నిర్ణయించారో ఎలాంటి సమాచారం లేదు. కానీ అద్భుతమైన కాఫీ రుచిని అందించే ఎస్‌ప్రెస్సో తరహాలో మారుతి ఎస్-ప్రెస్సో కారు మారుతి సుజుకి సంస్థకు భారీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో స్మాల్ ఎస్‌యూవీ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి!

Source: Overdrive

Most Read Articles

English summary
Maruti Suzuki's next launch in the entry-level segment will be a small SUV named the Maruti Suzuki S-Presso. This Micro SUV is expected to be the production version of the Maruti Suzuki Future-S concept that debuted at the last Auto Expo. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X