అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ కారు గురించి తెలియని వారంటూ ఉండరు, ఎంజీ హెక్టార్ విడుదలైన కొత్తలో భారతదేశపు తొలి ఇంటర్నెట్ కార్ అంటూ ఎంజీ మోటార్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. విడుదలైనప్పటి నుండి అత్యుత్తమ సేల్స్ సాధిస్తున్న ఎంజీ హెక్టార్ తొలిసారిగా సేల్స్ పడిపోయాయి.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

మీరు చదివింది నిజమే.. ఎంజీ మోటార్ విడుదల చేసిన నవంబర్ 2019 సేల్స్ రిపోర్టులో ఈ విషయం బయటపడింది. గత నెలలో 3239 యూనిట్ల హెక్టార్ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. సుమారుగా 300 కార్లు తక్కువగా అమ్ముడైనట్లు తెలిసింది.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

అక్టోబర్ 2019 నెలలో 3,536 హెక్టార్ ఎస్‌యూవీలను విక్రయించిన ఎంజీ మోటార్, సెప్టెంబర్ 2019లో 297 యూనిట్లను తక్కువగా విక్రయించింది. ఏదేమైనా ఇండియన్ మార్కెట్లోకి ప్రతి నెలా ఇలాంటి తేడా సహజమే.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

ఎంజీ హెక్టార్ ఎంజీ మోటార్ ఇండియా యొక్క మొట్టమొదటి మోడల్. జూన్ 2019లో ఇది మార్కెట్లోకి విడుదలయ్యింది. కొత్తలో ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభించింది. అప్పట్లో వెయిటింగ్ పీరియడ్ సుమారుగా మూడు నుండి నాలుగు నెలలుగా ఉండేది.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ డైరక్టర్ రాకేష్ మాట్లాడుతూ, "ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ ఎంతో మంది ఇండియన్ కస్టమర్ల హృదయాలను దోచుకుంది. దేశవ్యాప్తంగా ఊహించని ఆదరణ లభిస్తోంది, కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు ఇండియాలో సేల్స్ నెట్‌వర్క్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాము. ఎంజీ మోటార్ రెండవ ప్రొడక్ట్‌గా MG ZS EV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని డిసెంబర్ 5, 2019 న ఇండియాలో ఆవిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు."

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. ఎంజీ హెక్టార్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 12.18 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.16.88 లక్షల శ్రేణిలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తోంది.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

ఎంజీ హెక్టార్ భారతదేశపు తొలి ఇంటర్నెట్ కారు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు,10.4-ఇంచుల పరిమాణంలో నిలువుగా ఏర్పాటు చేసిన టచ్‌స్క్రీన్-ఇన్ఫటైన్‌మెంట్ డిస్ల్పే, ఆపిల్-కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో పాటు ఎన్నో కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

ఎంజీ హెక్టార్ సాంకేతికంగా రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి, 1.5-లీటర్ టుర్భో-పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజల్. రెండు ఇంజన్‌లను 6-స్పీడ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, పెట్రోల్ వేరియంట్లను ఆప్షనల్‌గా డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

అనుకున్నదే జరిగింది... ఒక్కసారిగా పడిపోయిన ఎంజీ హెక్టార్ సేల్స్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

చైనీస్ కంపెనీ సొంతం చేసుకున్న బ్రిటీష్ బ్రాండ్ ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టన తొలి మోడల్ ఎంజీ హెక్టార్. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వచ్చిన ఇది విపణిలో ఉన్న కియా సెల్టోస్, టాటా హ్యారీయర్, జీప్ కంపాస్ మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. ఎంజీ మోటార్ ఇండియా eZS అనే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది. డిసెంబర్ 5, 2019 న అఫీషియల్‌గా ఆవిష్కరించనుంది.

Most Read Articles

English summary
MG Hector Sales In India For November: Registers A Decline In Monthly Sales For The First Time. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X