Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్‌యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపణిలోకి కొత్త రెనో క్విడ్: ధర, ఫీచర్లు & మైలేజ్
ప్రముఖ ప్యాసింజర్ కార్ల కంపెనీ రెనో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారును లాంచ్ చేసింది. కొత్త రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 2.83 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా నిర్ణయించారు. ఈ కొత్త రెనో క్విడ్ కారు మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన మారుతి ఎస్-ప్రెస్సో కారుకు గట్టి పోటీనిస్తుంది.

సరికొత్త రెనో క్విడ్ ఇప్పుడు 8 విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, Std 0.8L, RXE 0.8L, RXL 0.8L, RXT 0.8L, RXT 1.0L, Climber 1.0L MT, RXT Easy-R 1.0L and Climber Easy-R 1.0L. కస్టమర్లు ఇప్పుడు సరికొత్త క్విడ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆన్‌లైన్లో లేదా రెనో డీలర్ వద్ద కనీసం రూ. 5000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

వేరియంట్లు | ధరలు |
STD 0.8L | Rs 2.83 Lakh |
RXE 0.8L | Rs 3.53 Lakh |
RXL 0.8L | Rs 3.83 Lakh |
RXT 0.8L | Rs 4.13 Lakh |
RXT 1.0L | Rs 4.33 Lakh |
RXT 1.0L EASY-R | Rs 4.63 Lakh |
CLIMBER MT | Rs 4.54 Lakh |
CLIMBER EASY-R | Rs 4.84 Lakh |

రెనో తమ కొత్త క్విడ్ కారులో ఎన్నో మార్పులు చేర్పులతో పాటు మరెన్నో కొత్త ఫీచర్లు అందించింది. ఎక్ట్సీరియర్ విషయానికి వస్తే డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్, మెయిన్ హెడ్‌ల్యాంప్ పై భాగంలో పలుచటి ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

సరికొత్త రెనో క్విడ్ కారులో అత్యాధునిక ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కు రెండు చివరలా ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. గ్రిల్‌కు క్రిందివైపునున్న బంపర్ మధ్యలో విశాలమైన ఎయిర్ ఇంటేకర్ మరియు బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల ఫాక్స్ స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి. కారుకు చుట్టుపక్కలా ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కొత్త క్విడ్ కారుకు ఎస్‌యూవీ స్టైలింగ్ తీసుకొచ్చాయి.

సైడ్ డిజైన్‌లో సరికొత్త స్టైల్ వీల్స్, బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల రూఫ్ రెయిల్స్, లైట్ కలర్ సైడ్ మిర్రర్స్, C-ఆకారంలో ఉన్న ఎల్ఈడీ లైట్లు మరియు కొత్త డిజైన్ చేయబడిన రియర్ బంపర్ క్విడ్ కారు రూపాన్ని పూర్తిగా మార్చేశాయి.

సరికొత్త రెనో క్విడ్ ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్తదనాన్ని ఇట్టే కనిపెట్టవచ్చు. ముందుగా, 8.0-ఇంచుల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను కూడా సపోర్ట్ చేస్తుంది. సరికొత్త క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో అధునాతన డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, రెనో ట్రైబర్ నుండి సేకరించిన స్టీరింగ్ వీల్ మరియు ఆరేంజ్ కలర్ స్టైలింగ్ ఎలిమెంట్స్ గల బ్లాక్ కలర్ సీట్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

ఇంజన్ విషయానికి రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ కారు రెండు విభిన్న ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి 800సీసీ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‍లు, ఇవి వరుసగా 55బిహెచ్‍పి-72ఎన్ఎమ్ మరియు 68బిహెచ్‌పి పవర్ - 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. రెంటు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ అదనంగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తోంది.

సరికొత్త రెనో క్విడ్ కారు ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి జన్‌స్కార్ బ్లూ, ఫైరీ రెడ్, ఐస్ కూల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, ఔట్‌బ్యాక్ బ్రాంజ్ మరియు ఎలక్ట్రిక్ బ్లూ.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రెనో ఇండియా సంస్థ ఎట్టకేలకు తమ మోస్ట్ పాపులర్ మోడల్ క్విడ్ కారును ఎట్టకేలకు ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. చిన్న కార్ల మార్కెట్లో పోటీ పెరిగిన నేపథ్యంలో అప్‌డేటెడ్ వెర్షన్ క్విడ్‌ను సరికొత్త రిలీజ్ చేసింది. ఇది మార్కెట్లో ఉన్న మారుతి ఎస్-ప్రెస్సో, డాట్సన్ రెడి-గో మరియు మారుతి సుజుకి ఆల్టో మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.