Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్విడ్, డస్టర్, క్యాప్తర్ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన రెనో
రెనో ఇండియా సెప్టెంబర్ నెలకుగాను పలు రకాల ఆఫర్లు మరియు భారీ డిస్కౌంట్లను ప్రటించింది. దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సేల్స్ పెంచుకునేందుకు రెనో ఇండియా లైనప్‌లో ఉన్న క్విడ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్, డస్టర్ ఎస్‌యూవీ మరియు క్యాపర్ క్రాసోవర్ కార్ల మీద ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారు.

రెనో క్విడ్
రెనో క్విడ్ స్మాల్ కారు ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఇండియాలో కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది. క్విడ్ హ్యాచ్‌బ్యాక్ మీద రూ. 20,000 ల క్యాష్ బ్యాక్ ప్రటించారు. మరియు అదనంగా 2 వేల రూపాయల కార్పోరేట్ బోనస్ అందిస్తున్నారు.

800సీసీ ఇంజన్ వెర్షన్ 4 వేరియంట్లు మరియు 1.0-లీటర్ ఇంజన్ వెర్షన్ 4 విభిన్న వేరియంట్లలో లభిస్తున్నాయి. రెనో క్విడ్ ప్రారంభ ధర రూ. 2.76 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

రెనో డస్టర్
రెనో డస్టర్ ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. డస్టర్ ఆటోమేటిక్ వేరియంట్ మీద ఏకంగా రూ. 1.5 లక్షల క్యాష్ బ్యాక్ మరియు రూ. 5 వేల కార్పోరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.

ఫేస్‌లిఫ్ట్ కంటే మునుపటి వెర్షన్ డస్టర్ మ్యాన్యువల్ వేరియంట్ మీద రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 ఎక్స్‌చ్చేంజ్ బోనస్ అదే విధంగా రూ. 5 వేల కార్పోరేట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. డస్టర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మీద కొన్ని షోరూముల్లో రూ. 10 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 5 వేల కార్పోరేట్ బోనస్ లభిస్తోంది.

రెనో డస్టర్ మూడు పెట్రోల్ మరియు ఆరు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. అన్ని పెట్రోల్ వేరియంట్లలో 105బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల 1.5-లీటర్ పెట్రోల్ యూనిట్ అదే విధంగా ఆర్ఎక్స్ఇ మరియు ఆర్ఎక్స్ఎస్ వేరియంట్లలో 84బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు.

ఆర్ఎక్స్‌జడ్ మరియు ఆర్ఎక్స్ఎస్ యొక్క మరో రెండు ఇతర వేరియంట్లలో 1.5-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 108బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లను మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. రెనో డస్టర్ ధరల శ్రేణి రూ. 8 లక్షల నుండి రూ. 12.5 లక్షల మధ్య ఉంది.

రెనో క్యాప్చర్
రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీని దేశీయంగానే ఎక్కువగా డెవలప్ చేశారు. కానీ ఆశించిన మేర సక్సెస్ సాధించలేకపోయింది. రెనో క్యాప్చర్ మీద గరిష్టంగా రూ. 1.5 లక్షల క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 5 వేల కార్పోరేట్ బోనస్ లభిస్తోంది.

రెనో క్యాప్చర్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మొత్తం నాలుగు విభిన్న వేరియంట్లలో ఎంచుకోవచ్చు. రెనో క్యాప్చర్ ధరల శ్రేణి రూ. 9.50 లక్షల నుండి రూ. 13 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.