Just In
- 15 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 23 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
Don't Miss
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ ధరతో హారియర్ బ్లాక్ ఎడిషన్ ను లాంచ్ చేసిన టాటా మోటార్స్
భారత మార్కెట్లో టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ప్రారంభం జరిగింది. టాటా మోటార్స్ వారి బాగా పాపులర్ అయిన హారియర్ ఎస్యువి లైనప్ కు కొత్త స్పోర్టివ్ మరియు బోల్డ్ లుక్ తో ' డార్క్ ఎడిషన్ ' వేరియంట్ ను ప్రవేశపెట్టింది. మరి ఈ డార్క్ ఎడిషన్ లో ఉన్న కొత్త ఫీచర్లు మరియు ఇంజన్, ధర వివరాలను వివరంగా ఇవాల్టి కథనంలో..

టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఎస్యువి క్రమంలోనే టాప్-స్పెక్ ఎక్స్ జడ్ వేరియంట్ పై ఆధారపడి ఉంది. దీనికి కొత్త గా ఫీచర్స్, కాస్మెటిక్ అప్ గ్రేడ్స్ వస్తాయి. ఇందులో ' అట్లాస్ బ్లాక్ ' అనే కొత్త బ్రాండ్ కలర్ ను పొందుపరిచారు.

కొత్త రంగు కాకుండా, కొత్త మోడల్లో స్పోర్ట్స్ 17-అంగుళాల బ్లాక్ స్టోన్ అల్లాయ్ వీల్స్ మరియు రెండు చివర్ల బ్లాక్డ్-అవుట్ స్లుఫ్ ప్లేట్ లను కలిగి ఉంటుంది. కొత్త హారియర్ డార్క్ ఎడిషన్ లో ఇంటీరియర్స్ కు కూడా అప్ డేట్స్ ను చేయడం జరిగింది.

ఇందులో బ్లాక్డ్-అవుట్ క్యాబిన్ తో పాటు బేంకెక్ కలికో లెదర్ సీట్, కాంట్రాస్ట్ గ్రే స్టిచింగ్ మరియు బ్లాక్ స్టోన్ గ్రే డాష్ బోర్డుతో ఉంటుంది. ఇది కూడా ఒక కొత్త గన్ మెటల్ గ్రే క్రోమ్ ప్యాక్ తో వస్తుంది, ఇది బ్లాక్ కలర్ లో ఇంటీరియర్స్ కు అందాన్ని జోడిస్తుంది.

టాప్-స్పెక్ ఎక్స్ జెడ్ వేరియంట్ ఆధారంగా ఉండటం వలన, టాటా హారియర్ డార్క్ ఎడిషన్ లో కొత్త ఫీచర్స్ మరియు ఎక్విప్ మెంట్ తో వస్తుంది. ఇందులో 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, 7 అంగుళాల కలర్ మిడ్, క్లైమేట్ కంట్రోల్ మరియు 9-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ కలదు.

భద్రత ఫీచర్స్ పరంగా చూస్తే టాటా హారియర్ బ్లాక్ ఎడిషన్ లో ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ తో కూడిన సిక్స్-ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ తో వస్తుంది.

అలాగే హిల్ స్టార్ట్ అసిస్ట్, సీట్-బెల్ట్ రిమైండర్స్, హై-స్పీడ్ వార్నింగ్, మరియు హిల్-జనరేషన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే యాంత్రికంగా చూస్తే టాటా హారియర్ డార్క్ ఎడిషన్ లో ఎటువంటి మార్పు ఉండదు.
Most Read: ఆనంద్ మహీంద్రా లైఫ్ లో ఉన్న ఎస్‌యూవీ కార్లు ఇవే

ఇందులో అదే బిఎస్-4, 2.0-లీటర్ ' క్రయోటెక్ ' డీజిల్ ఇంజన్, ఫియట్ నుండి తీసుకొన్నారు. ఇందులోని డీజల్ ఇంజన్ 143బిహెచ్పి మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇందులో ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.
Most Read: బిఎస్-6 మరియు బిఎస్-4 కార్ల మధ్య తేడా ఏంటి?

కొత్త ' అట్లాస్ బ్లాక్ ' కలర్ తో పాటు, టాటా హారియర్ ఐదు సింగిల్ టోన్ మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ లలో కూడా అందుబాటులో ఉంది. వాటిలో సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లలో క్యాలిస్టో కాపర్, థర్మిసో గోల్డ్, ఏరియల్ సిల్వర్, టెలిస్కోప్ గ్రే మరియు ఓర్కస్ వైట్ ఉన్నాయి.
Most Read: బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

అదే విధంగా, డ్యూయల్ టోన్ ఆప్షన్ ల్లో క్యాలిస్టో కాపర్/బ్లాక్ మరియు ఓర్కస్ వైట్/బ్లాక్ లు కూడా ఉన్నాయి. కొత్త టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ధర రూ. 16.76 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా) గా ఉంది. టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఇప్పటికే ఉన్న ఎస్యువి యొక్క స్పోర్టివ్ రూపాన్ని అందిస్తుంది.

టాటా మోటార్స్ ఎక్కువ మంది వినియోగదారులను ఈ ఎస్యువి వైపు, ఆకర్షించేందుకు బ్లాక్ ఎడిషన్ ప్రారంభించబడింది. టాటా హారియర్ డార్క్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో ఉన్న కియా సెల్టోస్, ఎంజి హెక్టర్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికీ గట్టి పోటీని ఇవ్వనుంది.