జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్లో ఈ నెలలో మరో కొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆడి అందిస్తున్న పాపులర్ 'ఆడి ఆర్ఎస్7' స్పోర్ట్‌బ్యాక్‌ను జూలై 16వ తేదీన దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆడి డీలర్లు ఇప్పటి ఈ కొత్త కారు కోసం రూ.10 లక్షల అడ్వాన్స్‌తో బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు.

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఆడి అందిస్తున్న ఏ7 మోడల్‌కు హై పెర్ఫార్మెన్స్ వేరియంటే ఈ కొత్త ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్. ఈ కారులో స్పోర్టీగా మరియు అగ్రెసివ్‌గా కనిపించే బంపర్స్, ఓవెల్ ఆకారంలో డ్యూయెల్ ఎగ్జాస్ట్‌లు ఉంటాయి. ముందువైపు చారలుగా ఉండే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ వెనుక వైపు కలిసిపోయినట్లుగా ఉండే టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఆడి ఆర్ఎస్7 కారులోని ఓవరాల్ సిల్హౌట్, బానెట్, ఫ్రంట్ డోర్స్, బూట్ లిప్ ఫీచర్లను స్టాండర్డ్ ఆడి ఏఎస్ మోడళ్ల మాదిరిగానే అనిపిస్తుంది. అయితే ఆడి ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ మాత్రం మరింత వెడల్పుగా ఉంటుంది, ఇందులో పెద్ద ఎయిర్ డ్యామ్‌లు మరియు బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో కూడిన హనీకోంబ్ గ్రిల్, ముందు వైపు బ్లాక్ ఆడి బ్యాడ్జ్ వంటి మార్పులు ఉంటాయి.

MOST READ: టైర్లు తయారు చేసే కంపెనీ కోవిడ్-19 మాస్క్ తయారు చేస్తే..?

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఈ స్పోర్టీ లుకింగ్ కారు నాలుగు డోర్లు కలిగిన కూప్ స్టయిల్‌లో ఉంటుంది. ఇందులో పిల్లర్‌లెస్ డోర్లు ఉంటాయి. ఇంకా ఇందులో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ మరియు అల్కాంటారా అప్‌హోలెస్ట్రీతో ఇంటీరియర్స్ ఉన్నాయి.

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఆడి ఆర్‌ఎస్ 7 స్పోర్ట్స్ కారులో అత్యంత శక్తివంతమైన 4.0 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 48వి మైల్డ్-హైబ్రిడ్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ఈ రెండు ఇంజన్లు (పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్) కలిసి మొత్తంగా 600 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 800 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయటంలో ఈ గేర్‌బాక్స్ సహకరిస్తుంది.

MOST READ: త్వరలో అందుబాటులోకి రానున్న ఎగిరే కార్లు, చూసారా !

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

భారత మార్కెట్లో విడుదలైతే ఆడి ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ కారు ధర రూ.1.75 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉండొచ్చని అంచనా.

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఇక ఆడి సంబంధించిన ఇతర వార్తను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే తన 2021 ఆడి క్యూ5 మోడల్‌ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది వచ్చే ఏడాదిలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ప్రస్తుత తరం ఆడి క్యూ5 మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త మరింత స్టయిలిష్‌గా, ప్రీమియంగా కనిపిస్తుంది.

MOST READ: సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 ఆడి క్యూ5 కారులో సరికొత్త హెడ్‌ల్యాంప్స్ డిజైన్, రివైజ్ చేసిన డిఆర్‌ఎల్‌లు, 10.1 ఇంచ్‌ల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అసిస్టెన్స్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఇందులోని కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గూగుల్ ఎర్త్ నుండి గ్రహించిన మెరుగైన మరియు అధిక-రిజల్యూషన్ చిత్రాలతో కూడిన శాటిలైట్ నావిగేషన్ (శాట్-నావ్)ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ: టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు, ఎలా ఉన్నాయో చూసారా ?

జులై 16న మార్కెట్లో రానున్న ఆడి ఆర్ఎస్7 - ఫీచర్లు, వివరాలు

ఆడి ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్ ఇండియన్ ఎంట్రీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అద్భుతమైన పనితీరును కనబరిచే ఈ హై-పెర్ఫార్మెన్స్ ఆడి ఆర్ఎస్7 కారుకు భారత మార్కెట్లో మంచి గిరాకీ అంతంత మాత్రంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ మోడల్ ప్రైస్ బ్రాకెట్ (ధరల శ్రేణి) కారణంగా దేశవ్యాప్తంగా ఈ మోడల్‌ను కొనుగోలు చేసే వారు చాలా పరిమిత సంఖ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి ఇక్కడి మార్కెట్లోకి దిగుమతి చేసుకోవటం కూడా ఈ కారు అధిక ధరకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
German luxury car manufacturer, Audi AG has announced that its Audi RS7 Sportback will be launched on 16 July. The brand's dealers have started accepting bookings for the vehicle for an amount of Rs 10 lakh. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X