భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

భారతదేశపు ప్రముఖ టైర్ తయారీ సంస్థ, సియట్ రోడ్-సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) వ్యాపారంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. దేశంలో కొత్త బ్రేక్‌డౌన్ సహాయ కార్యక్రమాన్ని అందించడానికి 'రెడీఅసిస్ట్'తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సియట్ పేర్కొంది.

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

ఈ కొత్త సర్వీస్ 24/7 అందుబాటులో ఉంటుందని, ప్రస్తుత పరిస్థుతుల్లో ఈ సర్వీస్‌ను కస్టమర్ ఇంటి వద్దకు కూడా విస్తరించబడిందని కంపెనీ తెలిపింది. ఈ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ద్వారా కస్టమర్లు తమ వాహనాల కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా వివిధ రకాల సేవలను పొందవచ్చు. సియట్ అందించే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు ప్రస్తుతానికి బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో మాత్రమే లభిస్తున్నాయి. త్వరలోనే ఈ సేవలను భారతదేశంలోని 20 నగరాలకు విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

పంక్చర్ మరమ్మతు కోసం కొత్త బ్రేక్‌డౌన్ సహాయ కార్యక్రమం 200 రూపాయల నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. ఈ సేవను కస్చమర్ ఇంటి వద్దనే పొందవచ్చని మరియు అదనపు భద్రత కోసం వాహనం యొక్క అన్ని కీ టచ్ పాయింట్లను ఉచితంగా శానిటైజేషన్ కూడా చేస్తామని సియట్ వివరించింది.

MOST READ: కారులో భార్య ఉంగరం పోయింది.. భర్త దాన్ని ఎలా కనిపెట్టించాడో తెలుసా ?

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద అందించే సేవల్లో బ్యాటరీ జంప్‌స్టార్ట్, కీ అన్‌లాక్ అసిస్టెన్స్, మైనర్ ఆన్ స్పాట్ రిపేర్, ఎమర్జెన్సీ ఫ్యూయల్ డెలివరీ, టోయింగ్ సర్వీస్ మొదలైనవి ఉన్నాయి. ఈ సేవలను కొనుగోలు చేసిన కస్టమర్లు 24/7 హాట్‌లైన్ నంబర్ 9740828080 కు కాల్ చేయడం ద్వారా వీటిని పొందవచ్చు.

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

రెడీఅసిస్ట్ విషయానికి వస్తే, బెంగళూరుకి చెందిన ఈ కంపెనీ కార్లు మరియు ద్విచక్ర వాహనాల కోసం రోడ్ సైడ్ అసిస్టెన్స్ సేవలను అందిస్తుంది. బెంగళూరుతో పాటు, ప్రస్తుతం ముంబై, మైసూర్, గుర్గావ్, హైదరాబాద్ వంటి వివిధ నగరాల్లో కూడా రెడీఅసిస్ట్ తమ సేవలను అందిస్తోంది.

MOST READ: కొత్త మహీంద్రా థార్ నడిపిన పృథ్వీరాజ్.. కారు గురించి అతను ఏమి చెప్పాడో తెలుసా ?

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

తాజాగా, సియట్ టైర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా రెడీఅసిస్ట్ ఇప్పుడు త్వరలో దేశవ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా తమ సేవలను విస్తరించనుంది. ఈ కంపెనీ కోసం ఇప్పటికే 500 మందికి పైగా శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

రెడీఅసిస్ట్‌తో ఒప్పందం గురించి సియట్ టైర్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అర్నాబ్ బెనర్జీ మాట్లాడుతూ, "మా కస్టమర్ల ప్రయాణాన్ని సులభతరం మరియు సురక్షితంగా చేయాలనే మా లక్ష్యానికి దగ్గరగా ఉండి, మేము మా వ్యాపార నమూనాను మరింత సుసంపన్నం చేసాము. మా ఈ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌తో మా వినియోగదారులకు అవసరమైన చోట, ఎప్పుడు కావాలంటే అప్పుడు మా సేవలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని" అన్నారు.

MOST READ: కొడుకు కార్లు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి, ఎందుకో తెలుసా ?

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

"కార్లు మరియు బైక్‌ల కోసం ప్రపంచ స్థాయి రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అందించే మా ప్రయత్నంలో భాగంగా, రెడీఅసిస్ట్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఈ రెండు కస్టమర్-కేంద్రీకృత బ్రాండ్ల యూనియన్ అక్కడికక్కడే కస్టమర్ సమస్యలను పరిష్కరించడంలో అగ్రస్థానంలో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాన"ని అన్నారు.

భారత్‌లో సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్; రూ.200 ల నుంచి సేవలు ప్రారంభం

సియట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ముఖ్యమైన సేవలలో ఒకటి, వెహికల్ బ్రేక్‌డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల నుండి సురక్షితంగా బయటపడటానికి ఇది మీకు సహాయపడుతుంది. అయితే, సియట్ ప్రవేశపెట్టిన కొత్త 24 బై 7 మరియు డోర్‌స్టెప్ సర్వీస్ సపోర్ట్‌తో మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.

Most Read Articles

English summary
India's leading tyre manufacturer, CEAT forays into (RSA) Road-Side Assistance business. The company has partnered with ReadyAssist to provide a new breakdown assistance program in the country. Read in Telugu.
Story first published: Saturday, August 22, 2020, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X