Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిస్కౌంట్ల జాతర ముగిసింది, వచ్చే ఏడాది నుండి ఇక బాదుడే..
అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్ల ధరలను వచ్చే ఏడాది నుండి పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలను తగ్గించుకునేందుకు జనవరి 1 నుంచి తమ వాహనాల ధరలను 3 శాతం మేర పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.

ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో ఫిగో హ్యాచ్‌బ్యాక్, ఆస్పైర్ సెడాన్, ఫ్రీస్టైల్ క్రాసోవర్, ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎండీవల్ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ మరియు మస్టాంగ్ స్పోర్ట్స్ కార్లను విక్రయిస్తోంది. మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల 1-3 శాతం వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

వచ్చే నెల నుంచి కంపెనీ అందిచే వివిధ రకాల మోడళ్ల ధరలు రూ.5,000 నుంచి రూ.35,000 వరకు పెరుగుతాయని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ వినయ్ రైనా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఉత్పాదక వ్యయం కారణంగా వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని ఆయన అన్నారు.
MOST READ:మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

అయితే, ప్రస్తుత సంవత్సరంలో (2020 లో) జరిగిన బుకింగ్స్‌కి మాత్రం ధరల పెరుగుదల నుండి మినహాయింపు లభిస్తుందని, 2021లో రాబోయే కొత్త బుకింగ్స్‌కు మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయని రైనా వివరించారు.
దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఇటీవలే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసినదే. జనవరి 2021వ తేదీ నుండి తమ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని మారుతి సుజుకి పేర్కొంది. అయితే, ఎంత మేర ధరలు పెంచుతామనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఫోర్డ్ ఇండియా విషయానికి వస్తే, గడచిన నవంబర్ 2020 నెలలో కంపెనీ 3,991 యూనిట్లను విక్రయించింది, అంతకుముందు సంవత్సరం ఇదే సమయంతో (నవంబర్ 2019తో) పోలిస్తే ఇవి 26 శాతం తక్కువగా ఉన్నాయి. కాగా, గడచిన అక్టోబర్ 2020 నెలలో కంపెనీ 7,084 యూనిట్లను విక్రయిస్తుంది, ఈ అమ్మకాలతో పోలిస్తే నవంబర్ 2020 అమ్మకాలు 44 శాతం క్షీణించాయి.
MOST READ:ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచ్ ; దీని ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు

గత నెలలో కంపెనీ తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ధరను పెంచడం వలన కూడా అమ్మకాలు స్వల్పంగా ప్రభావితమయ్యాయని చెప్పొచ్చు. భారత మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు, కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు ఫోర్డ్ ఇండియా అనేక కసరత్తులు చేస్తోంది.

ఇందులో భాగంగానే, ఫోర్డ్ ఇండియా తమ కార్లపై 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల పొడిగించిన వారంటీని ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా, అన్ని ఫోర్డ్ కార్లు 2 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల స్టాండర్డ్ వారంటీతో (ఏది ముందుగా ముగిస్తే అది) లభిస్తాయి.
ఫోర్డ్ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రాంలో భాగంగా 'ఫోర్డ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్' సర్వీస్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ఒకవేళ కస్టమర్ తన కారును విక్రయించాలని నిర్ణయించుకుంటే, దానిపై ఉన్న ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా కొత్త కస్టమర్‌కు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ఇక ఫోర్డ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త పికప్ ట్రక్కును పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఫోర్డ్ నుండి అత్యంత ప్రాచుర్యం పొందిన 'రేంజర్ రాప్టర్' పిక్-అప్ ట్రక్‌ను భారతదేశంలో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.