న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

హ్యుందాయ్ మోటార్స్ త్వరలో కొత్త (2020) వెర్నా ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌ భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ వెలుపల మరియు లోపలి భాగాలలో రిఫ్రెష్ చేసిన కొత్త డిజైన్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో ప్రారంభించటానికి ముందు, టీమ్-బిహెచ్‌పి వెర్నా ఫేస్ లిఫ్ట్ ధరలను వెల్లడించే ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ ప్రకారం కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 9.30 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) తో అందించనుంది.

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

కొత్త వెర్నా ఫేస్ లిఫ్ట్ సెడాన్ మూడు వేరియంట్లలో విడుదలవుంటుంది. అవి ఎస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ). ఈ మూడు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందించబడతాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ యూనిట్లు ఉన్నాయి.

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

1.5-లీటర్ యూనిట్లతో పాటు, టాప్-స్పెక్ ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లో ప్రత్యేకంగా అందించే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుంది. ఈ టాప్-స్పెక్ టర్బో-పెట్రోల్ వెర్నా ధర రూ. 13.99 లక్షలు. ఈ మూడు ఇంజన్లు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 115 బిహెచ్‌పి శక్తీ వద్ద 114 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 1.5 లీటర్ డీజిల్ యూనిట్ 115 బిహెచ్‌పి వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటికి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి జత చేయబడి ఉంటాయి.

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

వెర్నా ఎస్ఎక్స్ (ఓ) లో ఉండే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ 120 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఏడు-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది.

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

కొత్త 2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లోని ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టైల్లైట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, టర్న్ ఇండికేటర్స్‌తో ఓఆర్‌విఎంలు, 4-అంగుళాల టిఎఫ్‌టి మిడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్, పాడిల్ షిఫ్టర్లు వంటివి ఇందులో ఉంటాయి. అంతే కాకుండా హ్యుందాయ్ యొక్క బ్లూలింక్ కనెక్టివిటీ ఫంక్షనాలిటీలను కూడా కలిగి ఉంటుంది.

MOST READ:లాక్ డౌన్ ఉల్లంఘించిన కర్ణాటక ఎమ్మెల్యే, ఎవరో తెలుసా.. !

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు వంటి భద్రతా లక్షణాలు కూడా ఉంటాయి.

MOST READ:ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !

కొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. హ్యుందాయ్ వెర్నా ఇండియన్ మార్కెట్లో స్కోడా రాపిడ్, వోక్స్వ్యాగన్ వెంటో మరియు హోండా సిటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Source: Team BHP

Most Read Articles

English summary
New (2020) Hyundai Verna Facelift Prices Leaked: Here Are All The Details. Read in Telugu.
Story first published: Monday, March 30, 2020, 13:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X