ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి కియా సోనెట్ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తమ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో తయారైన మొట్టమొదటి రెడ్ కలర్ కియా సోనెట్ కారును కంపెనీ బయటకు విడుదల చేసింది.

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కియా మోటార్స్‌కు ఇది రెండవ ‘మేడ్-ఇన్-ఇండియా' మోడల్. భారత్‌లో తయారు చేసిన కియా సోనెట్ కారును సుమారు 70 దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 18, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది.

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కొత్త సోనెట్ ఎస్‌యూవీ కోసం ఆగస్టు 20న బుకింగ్స్‌ను ప్రారంభించారు. ఈ మోడల్ కోసం మొదటి 24 గంటల్లో 6,500 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు రూ.25,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి ఈ కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో కానీ లేదా షోరూమ్‌లలో కానీ బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

MOST READ:షారుఖ్ ఖాన్ బిఎండబ్ల్యు స్కోడా ఆక్టేవియా కంటే చీప్ , ఎంతో తెలుసా

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కియా సోనెట్‌ను రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనున్నారు. ఇందులో మొదటగా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

ఇకపోతే టాప్-ఎండ్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 119 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభ్యం కానుంది.

MOST READ:హవ్వ.. 23 కోట్ల రూపాయలకు అమ్ముడైన 54 ఏళ్ల పాత ఫెరారీ కారు

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది ఒకే క్యూబిక్ సామర్థ్యంతో రెండు విభిన్న ట్యూనింగ్‌లలో లభ్యం కానుంది. ముందుగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేస్ట్-గేట్ టర్బో (డబ్ల్యుజిటి) ఇది 99 బిహెచ్‍‌పి శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

ఇకపోతే, రెండవ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో లభిస్తుంది.

MOST READ:ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కియా సోనెట్‌లోని అన్ని వేరియంట్‌లు మరియు వెర్షన్లు అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటాయి. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో కొన్ని కీలక ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

ఇంకా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ ఇలా మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లతో కియా సోనెట్ లభ్యం కానుంది.

MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కియా సోనెట్‌లోని 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది.

ఇదే మొట్టమొదటి కియా సోనెట్; ఇండియా నుండి 70 దేశాలకు..

కియా ప్లాంట్ నుండి మొట్టమొదటి సోనెట్ కారు విడుదలపై డ్రైవ్‌ప్పార్క్ అభిప్రాయం.

కియా సోనెట్ భారత మార్కెట్లో అత్యంత పోటీ కలిగిన సబ్-4 మీటర్ల కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. కియా మోటార్స్‌కు ఇది ఎంట్రీ లెవల్ మోడల్ అవుతుంది. భారత మార్కెట్లో దీని ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Kia Motors India have begun production of the Sonet compact-SUV at its manufacturing facility in India. The company has announced that it has rolled out the first example of the Sonet from the production line at its facility in Anantapur, Andhra Pradesh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X