Just In
Don't Miss
- News
ఢిల్లీ ఘర్షణ: 86 మంది పోలీసులకు గాయాలు, చిక్కుకున్న 300 మంది కళాకారులు..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్‌షిప్‌కు చేరుకున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ.. డెలివరీస్ ఎప్పుడో తెలుసా !
ఎంజీ మోటార్ ఇండియా తన పుల్ సైజు ఎస్‌యూవీ ఎంజి గ్లోస్టర్‌ను వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కారు యొక్క ఫీచర్స్ మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్ల గురించి కంపెనీ ఇప్పటివరకు చాలా సమాచారాన్ని అందించింది. దీనితో పాటు ఈ కారులోని కొన్ని యాక్ససరీస్ కూడా ఎంజీ మోటార్ వెల్లడించింది.

కానీ కంపెనీ కొత్త ఎంజి గ్లోస్టర్‌ను ప్రారంభించటానికి ముందే డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది. ఇటీవల ఈ పుల్ సైజు ఎస్‌యూవీని డీలర్‌షిప్‌లో గుర్తించారు. జన్తే కాకుండా దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఎంజి మోటార్స్ కంపెనీ ఇప్పటికే ఈ కారు యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

ఈ కారును సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా సంస్థ యొక్క ఏదైనా డీలర్‌షిప్ నుండి రూ. 1 లక్ష ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఎంజి గ్లోస్టర్‌ను సూపర్, షార్ప్, స్మార్ట్, సావి అనే నాలుగు వేరియంట్లలో ఎంజీ మోటార్ ఈ ఎస్‌యూవీని విడుదల చేయబోతోంది.
MOST READ:పోలీసులతో గొడవపడిన జొమాటో డెలివరీ గర్ల్, తర్వాత ఏం జరిగిందంటే ?

అదే రోజున యాక్ససరీస్ కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ యాక్ససరీస్ లో బాడీ సైడ్ మోల్డింగ్, హుడ్ స్కూప్ (హుడ్ వెనుక భాగంలో ఉంచిన ఫాక్స్ వెంట్ డిజైన్) ఫ్రంట్ మరియు రియర్ బంపర్ కార్నర్ ప్రొటక్షన్ ఉన్నాయి.

ఇది కాకుండా, డోర్ విజర్, ఫ్యూయల్ లిడ్ క్రోమ్ గార్నిష్, బోల్ట్ కవర్‌తో క్రోమ్ డోర్ హ్యాండిల్, క్రోమ్ గార్నిష్ (హెడ్‌ల్యాంప్, ఓఆర్‌విఎం, నంబర్ ప్లేట్, టెయిల్‌గేట్, రియర్ రిఫ్లెక్టర్ మరియు టెయిల్ లాంప్), సైడ్ రాక్ రైల్ గార్నిష్ (సైడ్ స్టెప్స్ కోసం అదనపు క్రోమ్-ఫినిషింగ్ బార్) వంటివి ఈ యాక్ససరీస్ చేర్చబడ్డాయి.
MOST READ:స్కోడా సూపర్బ్ స్పోర్ట్ లైన్ సెడాన్ రోడ్ టెస్ట్ రివ్యూ.. ఇప్పుడు మీ కోసం

ఒకే ఇంజిన్ ఆప్షన్, 2.0 లీటర్, ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో గ్లోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు ఎంజి మోటార్ ప్రకటించింది. ఈ డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ రెండు వేర్వేరు ట్యూన్లలో అందించబోతోంది. ట్విన్ టర్బో ట్యూన్స్‌లో, దాని ఇంజన్ 215 బిహెచ్‌పి శక్తిని మరియు 480 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సింగిల్ టర్బో ట్యూన్‌లో దాని ఇంజన్ 160 బిహెచ్‌పి శక్తిని మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. 4 వీల్ డ్రైవ్‌లో ట్విన్ టర్బో, 2 వీల్ డ్రైవ్‌లో సింగిల్ టర్బో అందించబడతాయి. రెండు ఇంజన్లకు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.
Source: CarDekho
MOST READ:2020 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రివ్యూ : పెర్ఫామెన్స్, ఫీచర్స్ & ఇతర వివరాలు