జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

చైనాకి చెందిన కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్స్, గడచిన జులై నెలలో తమ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా వచ్చిన ఈ కొత్త హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని కంపెనీ అప్పట్లో కేవలం 6-సీటర్ ఆప్షన్‌తోనే విడుదల చేసింది.

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

ఆ సమయంలో కంపెనీ హెక్టర్ ప్లస్‌లో ఓ కొత్త 7-సీటర్ వేరియంట్‌ను కూడా త్వరలోనే మార్కెట్లో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకూ ఎమ్‌జి మోటార్స్ తమ 7-సీటర్ వెర్షన్ హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని ఇంకా మార్కెట్లో విడుదల చేయలేదు.

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

కాగా, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ ఇప్పుడు తమ కొత్త 7-సీటర్ హెక్టర్ ప్లస్‌ను వచ్చే జనవరి నెలలో మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉండి, ముందు వరుసలో ఇద్దరు మధ్య వరుసలో ఇద్దరు మరియు చివరి వరుసలో ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు (2+2+2) కూర్చునే అవకాశం ఉంది.

MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

అయితే, ఏడు సీట్ల వేరియంట్లో స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీలో గమనించినట్లుగా వెనుక వరుసలో కనిపించే బెంచ్ సీట్‌ను హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ మద్య వరుసలో అమర్చున్నారు. ఫలితంగా ముందు సీటులో ఇద్దరు, మధ్య సీటులో ముగ్గురు మరియు వెనుక సీటులో ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు కూర్చునే సౌలభ్యం ఉంటుంది.

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

ఇటీవల ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ వెర్షన్ చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఆ చిత్రాల ప్రకారం, 7-సీటర్ హెక్టర్ ప్లస్‌లో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచడం వలన, అధనపు లగేజ్ స్పేస్ కోసం ఎస్‌యూవీ పైకప్పు-పైభాగంలో ఓ సన్నటి లగేజ్ ర్యాక్‌ను అమర్చినట్లు తెలుస్తోంది.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

అయితే, ఈ లగేజ్ ర్యాక్‌ను 7-సీటర్ హెక్టర్ ప్లస్‌లో స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తారా లేక కస్టమర్లు ఆప్షనల్‌గా కొనుగోలు చేయాలా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో సీటింగ్ కాన్ఫిగరేషన్ మరియు లగేజ్ ర్యాక్ మినహా వేరే ఏ ఇతర మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

ప్రస్తుతం దేశీయ విపణిలో ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని రూ.13.48 లక్షల నుండి రూ.18.53 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా) మధ్య విక్రయిస్తున్నారు. ఎమ్‌జి హెక్టర్ ప్లస్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని నాలుగు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు రివైజ్డ్ ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇందులోని అల్లాయ్ వీల్ డిజైన్ కూడా హెక్టర్ ఎస్‌యూవీ కన్నా భిన్నంగా ఉంటుంది.

ఇంటీరియర్స్‌ని గమనిస్తే, కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్ మధ్యలో అమర్చిన ఐ-స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన 10.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు కొత్త ‘చిట్-చాట్' ఫంక్షనాలిటీతో లభిస్తుంది.

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు వైఫై కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఇందులోని ఇతర ఫీచర్లలో పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వద్ద పెద్ద ఎమ్ఐడి డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:వరదనీటిలో చేపలా ఈదుతున్న లంబోర్ఘిని సూపర్ కార్ [వీడియో]

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందించబడుతుంది. అవి: 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ యూనిట్. ఇందులోని టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే డీజిల్ ఇంజన్ 170 బిహెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పెట్రోల్ ఇంజన్‌లో ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ కూడా అందుబాటులో ఉంది.

జనవరిలో రానున్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 7సీటర్ వేరియంట్; వివరాలు

భారత్ వంటి మార్కెట్లలో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఎమ్‌జి మోటార్స్ తీసుకురానున్న కొత్త 7-సీటర్ హెక్టర్ ప్లస్ వేరియంట్, మధ్య వరుసలో బెంచ్ సీట్ కారణంగా మెరుగైన ప్రాక్టికాలిటీని ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
MG Motors Is Planning To Launch Seven Seater Hector Plus SUV In January 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X