పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్ ఇండియా, భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసిన తమ ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీ ధరలను భారీగా పెంచింది. గడచిన అక్టోబర్ నెలలో ఎమ్‌జి మోటార్స్ తమ గ్లోస్టర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో రూ.28.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) పరిచయ ప్రారంభ ధరతో విడుదల చేశారు.

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఎమ్‌జి మోటార్స్ రెండు రోజుల క్రితమే మొదటి బ్యాచ్ గ్లోస్టర్ ఎస్‌యూవీలు పూర్తిగా అమ్ముడుపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు తాజాగా ఈ ఎస్‌యూవీ పరిచయ ధర కూడా ముగిసిందని, ఇకపై కొత్తగా పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ.20,000 నుండి రూ.1 లక్ష మేర పెరిగాయి.

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఎమ్‌జి మోటార్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన గ్లోస్టర్ ఎస్‌యూవీ, భారత మార్కెట్లో అతికొద్ది సమయంలోనే భారీ విజయాన్ని సాధించింది. ఈ మోడల్ కోసం ఇప్ప,టికే భారత్‌లో 2000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. మార్కెట్లో విడుదలైన కేవలం ఒక్క నెలలోనే గ్లోస్టర్ ఎస్‌యూవీ మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయిందంటేనే ఈ మోడల్‌కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

MOST READ:అక్టోబర్ సేల్స్ రిపోర్ట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్స్.. చూసారా ?

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఎమ్‌జి గ్లోస్టర్‌ను మార్కెట్లో సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ అనే నాలుగు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. వేరియంట్‌ను బట్టి ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీని రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తోంది. ఇందులో మధ్య-వరుసలో రెండు కెప్టెన్ సీట్లు లేదా ఒక బెంచ్ సీట్ ఆప్షన్‌తో మొత్తం సిక్స్ లేదా సెవన్ సీట్స్ కాన్ఫిగరేషన్‌లతో లభిస్తుంది.

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ధరల పెరుగుదల తరువాత, బేస్ వేరియంట్ గ్లోస్టర్ ధర ఇప్పుడు రూ.29.98 లక్షలు పెరిగింది. అంటే గ్లోస్టర్ సూపర్ బేస్ వేరియంట్ ధరను కంపెనీ లక్ష రూపాయల మేర పెంచింది. అలాగే, మిడ్ వేరియంట్ అయిన గ్లోస్టర్ షార్ప్ ధర రూ.50,000 పెరిగి రూ.31.48 లక్షలకు చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

మిడ్ వేరియంట్ అయిన గ్లోస్టర్ షార్ప్ రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులోని సిక్స్ సీటర్ ధర రూ.34.28 లక్షలుగా ఉంటే, సెవన్ సీటర్ ధర రూ.33.98 లక్షలుగా ఉంది. అంటే, రెండు వేరియంట్లపై సుమారు రూ.30,000 మేర ధర పెరిగింది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఇకపోతే, టాప్ ఎండ్ వేరియంట్ గ్లోస్టర్ శావీ ధర రూ.20,000 మేర పెరిగి రూ.35.58 లక్షలకు చేరుకుంది. ఇది కేవలం సిక్స్ సీట్ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే లభిస్తుంది. ధరల పెంపుకు ముందు దీని పరిచయ ధర రూ.35.38 లక్షలుగా ఉండేది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో సింగిల్ టర్బో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పి శక్తిని మరియు 375 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఆప్షన్ సూపర్ మరియు స్మార్ట్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో (షార్ప్, శావీ) ట్విటన్ టర్బో డీజిల్ ఇంజన్ లభిస్తుంది.

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఇందులోని 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 216 బిహెచ్‌పి శక్తిని మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు జెడ్ఎఫ్ నుండి గ్రహించిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

MOST READ:మీకు తెలుసా.. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ ఫైనల్ రిపోర్ట్.. వచ్చేసింది

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురాస్ జి4 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అయితే, పైన పేర్కొన్న మోడళ్లలో అందుబాటులో లేని హై-ఎండ్ డ్రైవర్-అసిస్టెడ్ లెవల్ 1 అటానమస్ సిస్టమ్‌తో గ్లోస్టర్ లభిస్తుంది. దీని సాయంతో డ్రైవర్ చాలా తక్కువ ప్రయత్నంతో కారును ఆటోమేటిక్‌గా పార్క్ చేయవచ్చు.

పరిచయ ధర ముగిసింది; లక్ష రూపాయల మేర పెరిగిన గ్లోస్టర్ ధరలు

ఎమ్‌జి గ్లోస్టర్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఈ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురాస్ జి4 వంటి మోడళ్లతో పోటీగా నిలుస్తుంది. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో ఇప్పటికే అనేక పాపులర్ బ్రాండ్లు ఉన్నప్పటికీ, లేటెస్ట్‌గా వచ్చిన గ్లోస్టర్ దాని అద్భుతమైన ఫీచర్లు మరియు సరసమైన ధర కారణంగా ఈ పోటీలో ముందంజలో కొనసాగుతోంది.

Most Read Articles

English summary
MG Motor India has increased the pricing of the Gloster premium-SUV in the Indian market. The price hike range from Rs 20,000 to Rs 1 lakh depending on the variant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X