ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

ఆటో ఎక్స్‌పో 2020 లో ఎంజి మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరించారు. ఎంజి మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లెవల్ -3 ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సాధించిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోడల్. ఇది 2017 వ సంవత్సరంలో షాంఘై మోటార్ షోలో ప్రదర్శించింది. మార్వెల్ ఎక్స్ అనేది వింజన్- ఇ కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్.

ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

ఎంజి మార్వెల్ ఎక్స్ రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఒకటి రియర్-వీల్ డ్రైవ్, రెండు ఆల్-వీల్ డ్రైవ్. ఈ రెండు వేరియంట్లు కూడా 52.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇవి రెండూ ఎలక్ట్రిక్ మోటారులతో జతచేయబడతాయి. ఇది 184 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

ఎంజి మార్వెల్ ఎక్స్ ఒకే చార్జిపై దాదాపు 400 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఇది స్టాండర్డ్ ఎసి ఛార్జర్ ద్వారా పూర్తి ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జ్ ద్వారా కేవలం 40 నిముషాల్లో 80% వరకు ఛార్జ్ చేసుకోగలుగుతుంది.

ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

ఎంజి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ & ఎండి రాజీవ్ చాబా మాటాడుతూ భవిష్యత్ కోసం మేము అత్యాధునిక ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాము. ఇవి వినియోదారులకు అనుకూలంగా కూడా ఉంటాయి అని తెలిపారు.

ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే హెక్టర్ మరియు జెడ్ఎస్ ఇవి రెండూ కూడా విజయవంతంగా ప్రవేశపెట్టిన తరువాత ఇప్పుడు ఎంజి మార్వెల్ ఎక్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది.

ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

ఎంజి మార్వెల్ ఎక్స్ లో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్, అరౌండ్ క్రోమ్ ఆక్సెంట్ వంటివి ఇందులో ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో మరో కొత్త కార్ ని ఆవిష్కరించిన ఎంజి మోటార్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం ఎంజి కంపెనీకి భారత మార్కెట్లో మార్వెల్ ఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని ప్రవేశపెట్టే ఆలోచన లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే జెడ్ఎస్ ఇవి ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటి వరకు కూడా మంచి పనితీరుని కనపరుస్తోంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: MG Marvel X EV Unveiled - MG’s First Model To Achieve Level-3 Intelligent Driving. Read in Telugu.
Story first published: Wednesday, February 5, 2020, 16:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X