ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఎమ్‌జి మోటార్స్ నుండి భారత మార్కెట్‌కు రానున్న నాల్గవ ఉత్పత్తి ఎమ్‌జి గ్లోస్టర్‌కు సంబంధించి కంపెనీ తాజాగా ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో గ్లోస్టర్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కంపెనీ వెల్లడించింది. ఇందులో గ్లోస్టర్ ఎస్‌యూవీని వివిధ రకాల రోడ్లపై పరీక్షించారు.

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఆన్-డిమాండ్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా రాక్, శాండ్, మడ్, స్నో వంటి వివిధ రకాల డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో డ్రైవర్ స్నో మోడ్ మినహా మిగిలిన అన్ని డ్రైవ్ మోడ్స్‌ను ఉపయోగించడాన్ని మనం గమనించవచ్చు. వాటర్ క్రాసింగ్‌లో కూడా దీని సామర్థ్యాన్ని ఈ వీడియోలో చూపించారు.

ఈ టీజర్ వీడియోలో గ్లోస్టర్ ఎస్‌యూవీ ముందు వీల్ ఆర్చెస్ వెనుక ఉంచిన బ్రిట్ డైనమిక్స్ బ్యాడ్జిని కూడా హైలైట్ చేశారు. బ్రిట్ డైనమిక్ అనేది ఎమ్‌జి బ్రాండ్ యొక్క ప్రత్యేకమైన ప్రమాణాల సమూహం, ఇది వాహనం యొక్క బ్రిటిష్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది వాహనం యొక్క వివిధ అంశాలను నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తుంది. అవి: పెర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్, డిజైన్ మరియు సేఫ్టీ.

MOST READ:కేద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 250 కోట్ల విలువైన కొత్త విమానం.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా ?

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

బ్రిట్ డైనమిక్ బ్యాడ్జ్ ఉన్న వాహనాలు టర్బోచార్జ్డ్ ఇంజన్లను కలిగి ఉంటాయి మరియు ఇందులో రెండు చివర్లలో స్టెబిలైజర్ బార్స్ ఉండి అత్యుత్తమ హ్యాండ్లింగ్‌ను అందిస్తాయి. ఈబిడితో కూడిన ఏబిఎస్, కర్వ్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో బాడీని ఏరోడైనమిక్‌గా ఉంచడానికి కూడా బ్రిట్ డైనమిక్ సహకరిస్తుంది.

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఎమ్‌జి మోటార్స్ ఇటీవలే గ్లోస్టర్‌కు సంబంధించి ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది, ఇందులో గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ డ్రైవర్-అసిస్టెడ్ లెవల్ 1 అటానమస్ సిస్టమ్‌ను హైలైట్ చేసింది. ఈ టీజర్ వీడియోలో, డ్రైవర్ చాలా తక్కువ ప్రయత్నంతో ఆటో పార్క్ అసిస్ట్‌ను ఉపయోగించి పెద్ద గ్లోస్టర్ ఎస్‌యూవీని విజయవంతంగా పార్క్ చేయటాన్ని చూడొచ్చు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:గ్రేట్.. పిల్లాడిని రక్షించడానికి ఈ బైక్ రైడర్ ఏం చేసాడో చూడండి

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

గ్లోస్టర్ ఎస్‌యూవీలో బ్రాండ్ యొక్క అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడిఏఎస్)ను కలిగి ఉంటుంది. ఇందులో పార్కింగ్ అసిస్ట్, ఆటో బ్రేకింగ్, కొల్లైజన్ అవైడెన్స్ సిస్టమ్ వంటి యాక్టివ్ మరియు ప్యాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్‌తో లభ్యం కావచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 215 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ జెడ్ఎఫ్ నుంచి గ్రహించిన 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:గుడ్ న్యూస్: టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడళ్లపై ధర తగ్గింపు - ఫుల్ డీటేల్స్

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

అంతర్జాతీయ మార్కెట్లలో ఎమ్‌జి మోటార్స్ విక్రయిస్తున్న సింగిల్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా కంపెనీ భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, దేశీయ విపణిలో కొత్త ఎమ్‌జి గ్లోస్టర్ ధరలు రూ.40 లక్షల నుండి రూ.45 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఈ ఎస్‌యూవీలో క్రోమ్‌తో ఫినిష్ చేయబడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి హెడ్‌లైట్లు, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, కారులోకి సులువుగా ప్రవేశించేందుకు మరియు బటకు వచ్చేందుకు అనువుగా ఏర్పాటు చేసిన సైడ్‌స్టెప్, రూఫ్ రైల్స్ మరియు బూట్ లిడ్‌పై బోల్డ్‌గా అంటించిన ‘గ్లోస్టర్' బ్యాడ్జ్‌లు ఉంటాయి.

MOST READ:బెంగళూరులో టెస్లా రీసర్చ్ సెంటర్ ప్రారంభించనుందా.. అయితే ఇది చూడండి

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మరియు బ్రాండ్ యొక్క సరికొత్త ‘ఐస్‌మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

అంతేకాకుండా, పానరోమిక్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్‌తో కూడిన 360 డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి మరియు లేన్ చేంజింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది.

ఈ కొత్త చైనీస్ ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను చూశారా?

ఎమ్‌జి గ్లోస్టర్ ఆఫ్-రోడ్ సామర్థ్యంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ త్రీ-రో సీటింగ్ కలిగిన ఫుల్-సైజ్ ఎస్‌యూవీ. దీనిని కేవలం లగ్జరీ డ్రైవ్ కోసం మాత్రమే కాకుండా, అసాధ్యమైన ఆఫ్-రోడ్ ప్రాంతాల్లో కూడా నడిపేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఈ వీడియోలో గ్లోస్టర్ డ్రైవింగ్ మోడ్స్ మరియు ఆఫ్-రోడ్ సామర్థ్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి నాటికి ఎమ్‌జి మోటార్స్ తమ గ్లోస్టర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
MG Motors India has released yet another video of the upcoming Gloster SUV in India. This time around the teaser video showcases the off-road capabilities of the Gloster premium SUV. The large SUV has been driven on various rough terrains in the video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X