Just In
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : అనవసరమైన పనులకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు...!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Movies
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశంలోని 10 కొత్త నగరాల్లో విడుదల కానున్న ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్
చైనాకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ, ఎమ్‌జి మోటార్స్ భారత మార్కెట్లో తమ "ఎమ్‌జి జెడ్‌ఎస్" ఎలక్ట్రిక్ కారును దేశవ్యాప్తంగా 10 కొత్త నగరాల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎమ్‌జి మోటార్స్ తమ సోషల్ మీడియా ఛానెళ్లలో ఓ టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఈవి ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని భారత్‌లోని 10 కొత్త నగరాల్లో విడుదల చేయనున్నారు. ఇందులో కోల్‌కతా, లక్నో, లుధియానా, కోయంబత్తూర్, డెహ్రాడూన్, నాగ్‌పూర్, ఆగ్రా, ఔరంగాబాద్, ఇండోర్, మరియు విశాఖపట్నం నగరాలు ఉన్నాయి.

దేశంలో ఎమ్‌జి జెడ్‌ఎస్ ఈవి మోడల్ యొక్క దశల వారీ విస్తరణ ప్రణాళికలో భాగంగా, కంపెనీ పైన పేర్కొన్న పది నగరాలను ఎంచుకుంది. ఈ నగరాల్లో ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఈవీల కొనుగోలుదారుల కోసం అవసరమైన చార్జింగ్ మౌళిక సదుపాయాలను కూడా అందించాలని కంపనీ లక్ష్యంగా పెట్టుకుంది.
MOST READ:దుమ్మురేపుతున్న ఫార్చ్యూనర్ లెజెండరీ ఎస్‌యూవీ ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ వీడియో

ఎమ్‌జి మోటార్స్ ప్రారంభంలో భాగంగా ఈ ఎస్‌యూవీని ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో మాత్రమే విక్రయిస్తోంది. రెండవ దశ విస్తరణ ప్రణాళికలో కొత్తగా పూణే, సూరత్, కొచ్చిన్, చండీగఢ్, జైపూర్ మరియు చెన్నై నగరాలను చేర్చింది.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీని ఈ ఏడాది జనవరిలో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తోంది. భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ వేరియంట్ (ఎక్సైట్) ధర రూ.20.88 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ (ఎక్స్‌క్లూజివ్) ధర రూ.23.58 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.
MOST READ:ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

పైన పేర్కొన్న నగరాల్లోని కస్టమర్‌లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ డీలర్‌షిప్‌లలో కానీ లేదా ఆన్‌లైన్‌లో ‘మై ఎమ్‌జి యాప్'ను ఉపయోగించి కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ మీ ఇంటి వద్ద నుండే జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ తయారీ ప్రక్రియను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీలో 3-ఫేజ్ పర్మినెంట్ మాగ్నెట్ 44.5 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్‌పి పవర్‌ను మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జీపై గరిష్టంగా 340 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
MOST READ:ఏథర్ 450 ఎక్స్ కలెక్టర్ ఎడిషన్.. డెలివరీ పొందే అదృష్టవంతులు ఎవరు?

హోమ్ ఛార్జర్ ద్వారా అయితే, జెడ్‌ఎస్ ఈవిని 80 శాతం వరకూ ఛార్జ్ చేయటానికి 6 నుండి 7 గంటల సమయం పడుతుంది. మధ్య రేట్ చేయబడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, ఈ ఎస్‌యూవీని కేవలం 50 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. జిఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో త్రీ-లెవల్ బ్రేకింగ్ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంది, ఇది బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీలను ఛార్జ్ చేస్తుంది, ఫలితంగా డ్రైవింగ్ రేంజ్ పెరుగుతుంది.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్స్‌ను గమనిస్తే, ఇందులో స్టార్-రైడర్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, హీటెడ్ రియర్ వ్యూ మిర్రర్స్, రూఫ్ ట్రాక్స్, ఎల్‌ఈడి టెయిల్ లాంప్స్ మొదలైనవి ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క ‘ఐ-స్మార్ట్' కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.
MOST READ:దేవెగౌడకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన లగ్జరీ కార్, ఇదే.. చూసారా ?

ఇందులోని ఇతర ఫీచర్లలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2.5 పిఎమ్ ఎయిర్-ఫిల్టర్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు స్మార్ట్‌ఫోన్ ద్వారా లేదా ఏఐ సహాయంతో మీ కారును కంట్రోల్ చేయటానికి 60కి పైగా కమాండ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్-ఎస్‌యూవీ ఫెర్రిస్ వైట్, కోపెన్‌హాగన్ బ్లూ మరియు కరెంట్ రెడ్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

ఎమ్‌జి జెడ్‌ఎస్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విస్తరణ ప్రణాళికపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎమ్‌జి మోటార్ ఇండియా దేశంలో మరిన్ని కొత్త నగరాల్లో తమ జిఎస్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని చూస్తోంది. ఇది భారతదేశంలో బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుంది. అదనంగా, ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ రేటును కూడా పెంచుతుంది, దీని ఫలితంగా దేశంలో కాలుష్య స్థాయిలు తగ్గే అవకాశం కూడా ఉంది.