కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో జిపి

ఇప్పుడు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న మహమ్మారి కరోనా వైరస్. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలను సైతం కోల్పోయారు. రోజు రోజుకి ఈ కరోనా వైరస్ భారిన పడుతున్న వ్యక్తులు చాలామందే ఉన్నారు.

కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో రేసింగ్

కరోనా వైరస్ వల్ల ప్రజలు మాత్రమే కాదు అటు ఆటో మొబైల్ కంపెనీలు కూడా చాలా వరకు నష్టాల పాలయ్యాయి. కొన్ని ఆటో షో లు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు 2020 మొనాకో ఎఫ్ 1 రేసింగ్ కూడా వాయిదా పడింది.

కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో రేసింగ్

సాధారణంగా మొనాకో ఎఫ్ 1 రేస్ 1955 నుంచి జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల 2020 ఎడిషన్ పూర్తిగా నిలిపివేయబడింది. దాదాపు ఈ రేసింగ్ 66 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఈ రేసింగ్ నిలిపివేయబడింది.

కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో రేసింగ్

ఈ ఎఫ్ రేసింగ్ లో దేశవిదేశాలకు చెందిన దిగ్గజ రేసర్లు ఇందులో పాల్గొంటున్నారు. అంతే కాకుండా చాల దేశాలకు చెందిన ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో కరోనా విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంది.

కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో రేసింగ్

డచ్ మరియు స్పానిష్ జిపిలతో పాటు ఈ రేసింగ్ వాయిదా పడినట్లు సిరీస్ మొదట్లో ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటలకు, రేసు నిర్వాహకులు - ఆటోమొబైల్ క్లబ్ డి మొనాకో ఈవెంట్ మొత్తాన్ని నిలిపివేసినట్లు ధృవీకరించింది. కానీ దీనిని తరువాత రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఏది ఏమైనా ఎట్టకేలకు కరోనా వల్ల ఈ రేసింగ్ నిలిచిపోయింది.

కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో రేసింగ్

దీనికి సంబంధించి ఏసిఓ చేసిన ఒక ప్రకటన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఎఫ్ 1 రేసింగ్ లో ప్రపంచ దేశాలకు చెందిన చాలా మంది చాంపియన్స్ ఇందులో పాల్గొనే అవకాశం వుంది. కాబట్టి ఇక్కడ పాల్గొనే వాళ్ళ మరియు ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రేసింగ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా ఎఫెక్ట్ : 66 సంవత్సరాలలో మొదటి సారి రద్దు చేయబడిన మొనాకో రేసింగ్

ఫార్ములా 1 నిర్వాహకులు ప్రస్తుతం సవరించిన 2020 క్యాలెండర్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ రేసింగ్ జూన్ 7 న అజర్‌బైజాన్ జిపిలో ఈ సీజన్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఈ మార్పులన్నీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంపై కూడా ప్రభావం చూపాయి. వాస్తవానికి వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న ఈ కొత్త సాంకేతిక నిబంధనలు ఇప్పుడు జట్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి 2022 కు ఆలస్యం చేయబడ్డాయి.

Most Read Articles

English summary
F1: Monaco GP cancelled for the first time in 66 years. Read in Telugu.
Story first published: Saturday, March 21, 2020, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X