విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

రెనాల్ట్ తన ప్రసిద్ధ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కొత్త నియోటెక్ అనే ప్రత్యేక ఎడిషన్‌లో కాస్మెటిక్ మార్పులు చేయలేదు. క్విడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ గురించి సమాచారం లాంచ్ అవ్వడానికి ముందే ఇప్పుడు లీక్ అయ్యింది.

విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

కార్ వాలే క్విడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌లో కొన్ని మార్పులను వెల్లడించింది. డ్యూయల్ టోన్ కలర్‌తో స్పెషల్ ఎడిషన్ మోడల్ ఫోటోలు బయటపడ్డాయి. నియోటెక్ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో విడుదల చేయవచ్చు. ఇతర బాహ్య మార్పులలో క్లాడింగ్‌పై నియోటెక్ బ్యాడ్జింగ్‌తో కూడిన గ్రాఫైట్ గ్రిల్ మరియు సి-పిల్లర్ పై బ్లూ ఎక్సెంట్స్, బ్లాక్ అవుట్ పిల్లర్ మరియు క్రోమ్ ఇన్సర్ట్‌లు ఉన్నాయి.

విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పెషల్ ఎడిషన్ ఇంటీరియర్‌లో కొన్ని సూక్ష్మమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇందులో స్టీరింగ్ వీల్, ట్రిమ్ సరౌండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సీట్ అప్హోల్స్టరీ ఉన్నాయి. బ్లూ అసెంట్ చుట్టూ క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్ల గేర్ సెలెక్టర్ ఉంది. లీక్ అయిన నివేదిక ప్రకారం క్విడ్ నియోటెక్ మూడు వేరియంట్లలో విడుదల కానుంది.

MOST READ:బస్సుకి దారి ఇవ్వని బైకర్‌కి భారీ జరిమానా.. ఎంతో తెలుసా?

విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

ఈ సంవత్సరం పండుగ సీజన్లో క్విడ్ నియోటెక్ స్పెషల్ ఎడిషన్ విడుదల అవుతుందని భావిస్తున్నాము. ఇందులో కాస్మొటిక్ మార్పులు తప్ప సాంకేతిక అంశాలలో మార్పులు ఉండవు.

విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

క్విడ్ హ్యాచ్‌బ్యాక్ రెండు ఇంజన్ ఎంపికలతో రానుంది. ఈ కారులో 0.8-లీటర్ యూనిట్ మరియు పెద్ద 1.0-లీటర్ యూనిట్ ఉంటుంది. ఇది 53.5 బిహెచ్‌పి శక్తిని మరియు 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఇదే

విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

అదే 1.0-లీటర్ యూనిట్ 67 బిహెచ్‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికతో అందించబడుతుంది. రెనాల్ట్ తన ప్రముఖ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను భారతీయ మార్కెట్లో తన వినియోగదారుల కోసం విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

విడుదలకి ముందే లీక్ అయిన రెనాల్ట్ క్విడ్ నియోటెక్ వేరియంట్ డీటైల్స్.. చూసారా !

క్విడ్ నియోటెక్ స్పెషల్ ఎడిషన్ డ్యూయల్ టోన్ కలర్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పండుగ సీజన్లో మంచి అమ్మకాలను కొనసాగించడానికి కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేయనుంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

MOST READ:సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన కొత్త కార్లు.. ఇవే

Most Read Articles

English summary
Renault Kwid Neotech Variant Details Leaked. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X