ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ ఇండియా, ఈ నెల (డిసెంబర్ 2020) భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మోడల్ నిస్సాన్ మాగ్నైట్ ఈ సెగ్మెంట్లోనే తక్కువ ధరకి లభిస్తున్న ఏకైక కాంపాక్ట్ ఎస్‌యూవీ. నిస్సాన్ ఈ కారును కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ విడుదల చేసింది.

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చు కూడా ఈ సెగ్మెంట్లోని ఇతర మోడళ్లతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దేశీయ విపణిలో నిస్సాన్ మాగ్నైట్ దాని అగ్రెసివ్ ధర మరియు ఫీచర్ల కారణంగా అతికొద్ది సమయంలోనే పెద్ద పెద్ద విజయాన్ని సాధించింది.

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్‌కు అయ్యే ఖర్చు ప్రతి కిలోమీటరు కేవలం 29 పైసలు (మొదటి 50,000 కిలోమీటర్ల వరకు) మాత్రమేనని నిస్సాన్ ఇండియా తెలిపింది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర పోటీదారులతో పోల్చితే, నిస్సాన్ మాగ్నైట్ అతి తక్కువ నిర్వహణ వ్యయం (మెయింటినెన్స్ కాస్ట్)ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.

MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

కొత్త నిస్సాన్ మాగ్నైట్ స్టాండర్డ్ 2-సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది. ఎక్స్‌టెండెడ్ వారంటీ ద్వారా దీనిని 5 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్లకు పెంచుకోవచ్చు. నిస్సాన్ ఇండియా తమ వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉన్న తమ సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా అందిస్తున్న అనేక రకాల సర్వీసులకు కంపెనీ లేబర్ ఫ్రీ సేవలను అందిస్తోంది.

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

నిస్సాన్ కాంపాక్ట్-ఎస్‌యూవీ కోసం కంపెనీ ఓ ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను 'నిస్సాన్ మాగ్నైట్ కేర్' అని పిలుస్తారు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు అదనంగా 22 శాతం పొదుపును పొందవచ్చు. ఈ ప్లాన్ సిల్వర్ మరియు గోల్డ్ అనే రెండు ఆప్షనల్ ప్యాకేజీలలో అందుబాటులో ఉంది.

MOST READ:జనవరి 1 నుండి పెరగనున్న రెనో కార్ల ధరలు; డిసెంబర్ ఆఫర్లు

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

ఇందులో 'గోల్డ్ ప్యాకేజ్' మరింత సమగ్రమైన సేవలను అందిస్తుండగా, 'సిల్వర్ ప్యాకేజ్' బేసిక్ మెయింటినెన్స్ సేవలను అందిస్తుంది. ఈ మెయింటినెన్స్ ప్యాకేజీలు ఎస్‌యూవీతో అనుసంధానమై ఉంటాయి, కాబట్టి వాహన యాజమాన్యంలో మార్పు వస్తే ఇవి కూడా బదిలీ చేయబడతాయి.

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ మాగ్నైట్ మార్కెట్లో విడుదలైన కేవలం 15 రోజుల్లోనే 15,000 యూనిట్లకు పైగా బుకింగ్స్‌ను మరియు 1.50 లక్షలకు పైగా విచారణలను (ఎంక్వైరీలను) అందుకున్నట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది.

MOST READ:మైండ్‌తో కంట్రోల్ చేయగల నిస్సాన్ కాన్సెప్ట్ కార్ ; పూర్తి వివరాలు

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రారంభించటానికి ముందు, నిస్సాన్ ఇండియా, భారతదేశం అంతటా 50 కొత్త టచ్‌పాయింట్‌లను జోడించి సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఇందులో దేశవ్యాప్తంగా 30 సర్వీస్ సెంటర్లు మరియు 20 సేల్స్ డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. కాగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డిసెంబర్ 31, 2020వ తేదీ వరకూ రూ.4.99 లక్షల పరిచయ ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఆ తర్వాత దీని ప్రారంభ ధరను రూ.5.54 లక్షలకు పెంచనున్నారు. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:గురుగ్రామ్‌లో 55 శాతం తగ్గిన ట్రాఫిక్ ఫైన్స్.. దీనికి కారణం ఇదే

ఇతర కార్ల కన్నా నిస్సాన్ మాగ్నైట్ మెయింటినెన్స్ ఖర్చే తక్కువ!

ఈ విషయంపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కస్టమర్-సెంట్రిక్ బ్రాండ్ అయిన నిస్సాన్ తమ వినియోగదారులకు ఆన్‌లైన్ సర్వీస్ బుకింగ్, ఆన్‌లైన్ సర్వీస్ కాలిక్యులేటర్ వంటి మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తూ, ఎప్పటికప్పుడు వారి అవసరాలను అర్థం చేసుకుంటోంది అన్నారు. సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ 20కి పైగా బెస్ట్-ఇన్-క్లాస్ మరియు ఫస్ట్-ఇన్-క్లాస్ ఫీచర్లతో, నిస్సాన్ ప్రామిస్‌తో కూడిన అతి తక్కువ నిర్వహణ వ్యయంతో లభిస్తుందని చెప్పారు.

Most Read Articles

English summary
Nissan India Claims Magnite Maintenance Costs Will Be The Lowest-In-Segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X