Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి ప్రారంభం, ఫ్యాక్టరీ నుండి మొదటి కారు బయటకి..
నిస్సాన్ ఇండియా ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. భారత్ మరియు గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని నిస్సాన్ రచించుకున్న కొత్త వ్యూహం నుండి పుట్టుకొచ్చిందే ఈ మాగ్నైట్ ఎస్‌యూవీ.

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ తమిళనాడులో ఉన్న ఓరగడమ్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ‘మేక్-ఇన్-ఇండియా, మేక్-ఫర్-ది వరల్డ్' అనే బ్రాండ్ ఫిలాసఫీని అనుసరించనుంది.

భారత మార్కెట్లో విడుదలైన తర్వాత కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఈ విభాగంలో నిస్సాన్ బ్రాండ్‌కు మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ అవుతుంది. ఇది ఈ విభాగంలోని కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న రెనో కిగర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్సి 43 కూపే లాంచ్ : ధర & ఇతర వివరాలు

నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడంతో పాటుగా కంపెనీ దీనికి సంబంధించిన వేరియంట్లు, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను కూడా కంపెనీ వెల్లడి చేసింది. అంతేకాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో అందించబోయే అన్ని ఇతర ఫీచర్లు, వివరాలను కూడా నిస్సాన్ ఇండియా తెలియజేసింది.

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి (ప్రీమియం) అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ నాలుగు వేరియంట్లు కూడా వివిధ రకాల ఫీచర్లు మరియు పరికరాలతో లభ్యం కానున్నాయి. నిస్సాన్ మాగ్నైట్‌లో లభించే కొన్ని ప్రధాన ఫీచర్లలో ఎల్‌ఈడీ బై-ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ గురించి చెప్పుకోవచ్చు.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

అంతేకాకుండా, ఇందులో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 7-ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతోగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, స్కిడ్ ప్లేట్లు, ఫంక్షనల్ రూఫ్ ట్రాక్స్ మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ టాప్-ఎండ్ వేరింట్లను (ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం) కంపెనీ ‘టెక్ ప్యాక్'తో అందించనుంది. ఇందులో పడల్ ల్యాంప్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, జెబిఎల్ సౌండ్ సిస్టమ్ మరియు యాంబియంట్ మూడ్ లైటింగ్ వంటి అదనపు ఫీచర్లు లభ్యం కానున్నాయి.
MOST READ:యమహా అభిమానులకు గుడ్‌న్యూస్: అమేజాన్ సైట్లో అఫీషియల్ యాక్ససరీస్

ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. ఇందులో అన్ని నాలుగు వేరియంట్లు 1.0-లీటర్ బి4డి న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తాయి. అయితే, టాప్-ఎండ్ ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి (ప్రీమియం) వేరియంట్లలో మాత్రం 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ కూడా లభిస్తుంది.
1.0L B4D Petrol MT | MT XE |
MT XL | |
MT XV | |
MT XV with Tech Pack | |
MT XV Premium | |
MT XV Premium with Tech Pack | |
1.0L HRA0 Petrol MT | Turbo MT XL |
Turbo MT XV | |
Turbo MT XV with Tech Pack | |
Turbo MT XV Premium | |
Turbo MT XV Premium with Tech Pack | |
Turbo MT XV Premium (O) | |
Turbo MT XV Premium (O) with Tech Pack | |
1.0L HRA0 Petrol CVT | Turbo X-Tronic CVT XL |
Turbo X-Tronic CVT XV | |
Turbo X-Tronic CVT XV with Tech Pack | |
Turbo X-Tronic CVT XV Premium | |
Turbo X-Tronic CVT XV Premium with Tech Pack | |
Turbo X-Tronic CVT XV Premium (O) | |
Turbo X-Tronic CVT XV Premium (O) with Tech Pack |

మాగ్నైట్‌లోని 1.0-లీటర్ బి4డి న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. కాగా, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మాత్రం 5-స్పీడ్ మాన్యువల్ లేదా నిస్సాన్ యొక్క ఎక్స్-ట్రానిక్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగా, ఆర్‌ఎన్‌ఐఐపిఎల్ ఎండి మరియు సిఇఒ బిజు బాలేంద్రన్ మాట్లాడుతూ "ఆర్‌ఎన్‌ఐఐపిఎల్ వద్ద సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తిని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పెద్ద, ధైర్యమైన, అందమైన మరియు కారిస్మాటిక్ ఎస్‌యూవీని ఎగుమతి చేసే అవకాశాలను కూడా మేము అన్వేషిస్తున్నాము. ఇది మాకు ఒక భారీ మైలురాయి మరియు ఈ ఉత్పత్తిని పరిచయం చేసినందకు గర్విస్తున్నాము. ఇది భారతదేశం నుండి ప్రేరణ పొంది, జపాన్‌లో రూపొందించబడిందని" అన్నారు.

ఇదే విషయంపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ "సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తిని ప్రారంభించడం మనందరికీ గర్వకారణం. మాగ్నైట్ ఫస్ట్-ఇన్-క్లాస్ మరియు బెస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో రూపుదిద్దుకుంది మరియు ఇది ప్రతి భారతీయ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడినది."

"సుసంపన్నమైన అనుభవాలను అందించడానికి నిస్సాన్ యొక్క నిరంతర ఆవిష్కరణ తత్వానికి అనుగుణంగా, నిస్సాన్ యొక్క ప్రఖ్యాత సాంకేతికతలు ప్రతి గ్రేడ్‌లోనూ అందించబడతాయి. ఇందులో ఎక్స్-ట్రానిక్ సివిటి, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ మానిటర్ మరియు నిస్సాన్ కనెక్ట్ మొదలైనవి ఉన్నాయి." అని ఆయన చెప్పారు.

నిస్సాన్ మాగ్నైట్ ఉత్పత్తి ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో నిస్సాన్ మాగ్నైట్ కూడా ఒకటి. ప్రస్తుతం భారత్‌లో ఒకేఒక మోడల్‌తో (నిస్సాన్ కిక్స్) నత్తనడక సాగిస్తున్న నిస్సాన్ ఇండియాను అమ్మకాల పరంగా పరుగులు పెట్టించేందుకు ఈ మోడల్ సహకరిస్తుందని అంచనా. మాగ్నైట్ ఉత్పత్తి ప్రారంభం కావటాన్ని చూస్తుంటే, త్వరలోనే ఇది కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.