భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

నిస్సాన్ ఇండియా డిసెంబర్ 2వ తేదీన మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్' వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు భారీగా పెరిగింది. కేవలం రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిచయ ప్రారంభ ధరతో కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సరసమైన ధర, స్టైలిష్ డిజైన్ మరియు ఆకర్షణీయమైన ఫీచర్ల కారణంగా ఇది మార్కెట్లో అంచనాలకు మించి అమ్ముడవుతోంది.

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే 20,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. భారత కస్టమర్ల నుండి ఈ మోడల్‌కు అనూహ్యమైన స్పందన లభించడంతో ఇప్పుడు దీని వెయిటింగ్ పీరియడ్ 32 వారాల (8 నెలల) వరకూ ఉంటోంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ మరియు కలర్ ఆప్షన్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతూ ఉంటుంది.

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి, ఎక్స్‌వి ప్రీమియం, ఎక్స్‌వి ప్రీమియం (ఆప్షనల్) అనే ఐదు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో అత్యంత పాపులర్ అయిన వేరియింట్లో బేస్ వేరియంట్ 'ఎక్స్ఈ' ఒకటి, ఇప్పుడు దీని వెయిటింగ్ పీరియడ్ 32 వారాలుగా ఉంది. ఇందులోని ఎక్స్ఎల్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ 24 వారాలుగా ఉంది.

MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

ఇకపోతే, టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో లభించే ఎక్స్‌వి వేరియంట్‌కు 24 - 26 వారాల మధ్య వెయిటింగ్ పీరియడ్ ఉండగా, టర్బో ఎక్స్‌వి ప్రీమియం మరియు టర్బో ఎక్స్‌వి ప్రీమియం (ఓ) వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్స్ 22 నుంచి 28 వారాల మధ్యలో ఉంది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో నిస్సాన్ మాగ్నైట్ కోసం వేరియంట్ వారీగా వెయిటింగ్ పీరియడ్‌ను ప్రదర్శించే పై పట్టికను గమనించండి.

మూలం: వినయ్ సింగ్

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

పైన పేర్కొన్న స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్‌తో పాటుగా నిస్సాన్ మాగ్నైట్‌లో ఫ్లేర్ గార్నెట్ రెడ్ కలర్ పెయింట్ స్కీమ్‌ను ఎంచుకునే కస్టమర్లు అదనంగా మరో నాలుగు వారాలు (1 నెల) వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

ప్రస్తుతం నిస్సాన్ మాగ్నైట్ రూ.4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రైస్ ట్యాగ్‌తో భారత మార్కెట్లోనే అత్యంత సరసమైన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. జనవరి 2021 ప్రారంభం కంపెనీ ఈ మోడల్ ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు తర్వాత దీని ప్రారంభ ధర రూ.5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 1.0 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. న్యూచరల్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్లోనే 16 ఇంచ్ వీల్, స్కిడ్ ప్లేట్, ఫంక్షన్ రూఫ్ రైల్, 3.5 ఇంచ్ ఎల్‌సిడి క్లస్టర్, ఆల్ పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అందుకే, ఈ వేరియంట్ అత్యంత పాపులర్ వేరియంట్‌గా కొనసాగుతోంది. టాప్-ఎండ్ వేరియంట్లలో 16-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు ఫాగ్ లాంప్స్ మొదలైనవి లభిస్తాయి.

భారీగా పెరిగిన 'మాగ్నైట్' వెయింటిగ్ పీరియడ్; వేరియంట్ వారీగా ఎంతంటే..?

ఇంటీరియర్స్‌లో 8 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి. ఇది ఈ విభాగంలో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:గుడ్‌న్యూస్: అన్ని వాహన డాక్యుమెంట్లు మార్చ్ 31, 2021 వరకూ పొడగింపు!

Most Read Articles

English summary
Nissan Magnite Waiting Period Increased To Eight Months, Variant-Wise Waiting Time Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X