Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెనో కార్లపై రూ.70,000 డిస్కౌంట్స్; ఏయే మోడల్‌పై ఎంతో తెలుసా?
ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో భారత మార్కెట్లో దీపావళి పండుగ కోసం ఇప్పటి నుండే సిద్ధమవుతోంది. ప్రస్తుత పండుగ సీజన్‌లో తమ బ్రాండ్ అమ్మకాలను పెంచుకునేందుకు 'రెనో ఇండియా' అందిస్తున్న మూడు మోడళ్ల (క్విడ్, ట్రైబర్, డస్టర్)పై ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ మూడు మోడళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, వివిధ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్‌లు మరియు అనేక ఇతర ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఈ అక్టోబర్ నెలలో గరిష్టంగా రూ.70,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పాటుగా పలు రకాల ఫైనాన్స్ ఆప్షన్లు కూడా కంపెనీ అందిస్తోంది.

రెనో అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ క్విడ్‌పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.40,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ రూ.40,000 ప్రయోజనాలతో పాటుగా, కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా, రెనో క్విడ్‌పై రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను అలాగే రైతులు, గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్‌లకు ప్రత్యేక బోనస్‌గా అదనంగా రూ.5,000 రాయితీలను అందిస్తున్నారు.
MOST READ:పరుగులు పెడుతున్న మహీంద్రా థార్ బుకింగ్స్.. ఇప్పటికే దీని బుకింగ్స్ ఎంతంటే ?

రెనో అందిస్తున్న బడ్జెట్-ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎమ్‌పివి రెనో ట్రైబర్‌పై కంపెనీ ఏకంగా రూ.30,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రెనో ట్రైబర్‌పై రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. క్విడ్ మాదిరిగానే, ట్రైబర్ ఎమ్‌పివిపై కూడా రైతులు, సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సభ్యుల కోసం ప్రత్యేక గ్రామీణ ప్రయోజనాలుగా రూ.9,000 మరియు రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తుంది.

రెనో అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్‌పై కంపెనీ అత్యధిక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో 1.5 లీటర్ వేరియంట్‌పై రూ.70,000 వరకు ప్రయోజనాలను అందిస్తుండగా, కొత్త డస్టర్ 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ.30,000 ప్రయోజనాలను అందిస్తోంది. రెనో డస్టర్ 1.5-లీటర్ ఇంజన్ మోడళ్లపై రూ.30,000 కార్పోరేట్ డిస్కౌంట్‌తో పాటు, రూ.20,000 లాయల్టీ బోనస్ మరియు రూ.25,000 క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి.
MOST READ:మాజీ ముఖ్యమంత్రిని ఫిదా చేసిన మహీంద్రా థార్.. ఇంతకీ ఎవరా CM తెలుసా?

రెనో డస్టర్‌పై రైతులకు ప్రత్యేక ప్రయోజనాలుగా రూ.15,000 తగ్గింపును అందిస్తున్నారు. ఇకపోతే, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమయ్యే రెనో డస్టర్‌పై కంపెనీ ఈజీ కేర్ ప్యాకేజీ క్రింద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ప్రత్యేక సర్వీస్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ మూడు మోడళ్లపై కేవలం నగదు తగ్గింపులు, వివిధ ప్రయోజనాలనే కాకుండా, వీటిపై ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ కార్లను రెనో ఫైనాన్స్ ఆప్షన్లను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు 3.99 శాతం తక్కువ వడ్డీ రేటుకే ఇవి లభిస్తాయి. పైన పేర్కొన్న అన్ని డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు ఆఫర్లు అక్టోబర్ 1, 2020వ తేదీ నుండి అక్టోబర్ 31, 2020వ తేదీ వరకు చెల్లుబాటులో ఉంటాయి.
MOST READ:మహీంద్రా లాంచ్ చేసిన 210 అనివెర్సరీ స్పెషల్ ఎడిషన్ : ప్యూజో 125 స్కూటర్

రెనో పండుగ సీజన్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారతదేశంలో పండుగ సీజన్ పూర్తిస్థాయిలో ప్రారంభం కానుండటంతో, అనేక ఇతర వాహన తయారీదారుల మాదిరిగానే రెనో ఇండియా కూడా తమ వాహనాలపై అదనపు ప్రయోజనాలు మరియు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. క్విడ్, డస్టర్ మోడళ్లపై అత్యధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి.