కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సోనెట్ ఎస్‌యూవీ విడుదలకు ముహుర్తం ఖరారైంది. కియా సోనెట్ కారుని సెప్టెంబర్ 18, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కియా సోనెట్ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కొత్త సోనెట్ ఎస్‌యూవీ కోసం ఆగస్టు 20న బుకింగ్స్‌ను ప్రారంభించారు. ఈ మోడల్ కోసం మొదటి 24 గంటల్లో 6,500 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు రూ.25,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి ఈ కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కియా సోనెట్ రెండు వెర్షన్లలో (టెక్-లైన్ మరియు జిటి-లైన్) లభ్యం కానుంది. కియా సోనెట్‌లోని అన్ని వేరియంట్‌లు మరియు వెర్షన్లు అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు మరియు పరికరాలతో నిండి ఉంటాయి. ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో కొన్ని కీలక ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:ఢిల్లీలో సమ్మె ప్రారంభించిన క్యాబ్ డ్రైవర్లు , ఎందుకో తెలుసా !

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

ఇంకా, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు కియా బ్రాండ్ యొక్క యువో కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్ ఇలా మరెన్నో ఆసక్తికరమైన ఫీచర్లతో కియా సోనెట్ లభ్యం కానుంది.

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కియా సోనెట్‌లోని 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కియా మోటార్స్‌కు భారత మార్కెట్లో సెల్టోస్ మరియు కార్నివాల్ తరువాత కియా సోనెట్ మూడవ మోడల్‌గా నిలుస్తుంది. ఈ కారును ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. కియాకు ఇది రెండవ ‘మేడ్-ఇన్-ఇండియా' మోడల్. భారత్ నుంచే ఈ మోడల్‌ను పలు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు.

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కియా సోనెట్ భారత మార్కెట్లో అత్యంత పోటీ కలిగిన సబ్-4 మీటర్ల కాంపాక్ట్-ఎస్‌యూవీ విభాగంలో విడుదల కానుంది. కియా మోటార్స్‌కు ఇది ఎంట్రీ లెవల్ మోడల్ అవుతుంది. భారత మార్కెట్లో దీని ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

MOST READ:మతిపోగుడుతున్న మాడిఫైడ్ మహీంద్రా ఇన్వాడర్

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కియా సోనెట్‌ను రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనున్నారు. ఇందులో పెట్రోల్ ఇంజన్లు డిస్‌ప్లేస్‌మెంట్స్‌లో (ఇంజన్ సీసీ) మారుతాయి. వీటిలో ఒకటి 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ మరొకటి 1.0-లీటర్ టర్బో-ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

ముందుగా 1.2-లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 84 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇకపోతే టాప్-ఎండ్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 119 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం కానుంది.

MOST READ:హైస్పీడ్ వాహనాలను గుర్తించే హై-స్పీడ్ కెమెరాలు.. వచ్చేస్తున్నాయ్

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

అయితే, డీజిల్ ఇంజన్ క్యూబిక్ సామర్థ్యాలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కానీ, ఇవి వేర్వేరు పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేసేలా కంపెనీ వీటిని ట్యూన్ చేసింది. ముందుగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేస్ట్-గేట్ టర్బో (డబ్ల్యుజిటి) ఇది 99 బిహెచ్‍‌పి శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

ఇకపోతే, రెండవ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

కియా సోనెట్ లాంచ్ డేట్ ఖరారు; సెప్టెంబర్ 18న మార్కెట్లో విడుదల

కియా సోనెట్ లాంచ్ డేట్‌పై డ్రైవ్‌ప్పార్క్ అభిప్రాయం.

కియా మోటార్స్ మొట్టమొదటి సారిగా సోనెట్ కాన్సెప్ట్‌ను 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. అప్పటి నుండి, ఈ ఎస్‌యూవీపై భారత మార్కెట్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి సెల్టోస్ మంచి విజయం సాధించిన తర్వాత, సోనెట్ ఎస్‌యూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోనెట్ ఈ విభాగంలో హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, టొయోటా అర్బన్ క్రూయిజర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి ఇతర మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kia Motors India have announced the launch date for their much-awaited Sonet SUV in the market. The company has revealed that the Kia Sonet will go on sale in the Indian market from the 18th of September 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X