మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

టాటా మోటార్స్ అందిస్తున్న ఆల్ట్రోజ్ కారులో టర్బో వేరియంట్ గురించి ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసినదే. ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వస్తున్న టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ వచ్చే ఏడాది జనవరి నెలలో మార్కెట్లో విడుదలు కానుంది.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

తాజా సమాచారం ప్రకారం, టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ జనవరి 13, 2021వ తేదీ మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ టర్బో వేరియంట్ కొత్త స్టైలిష్ మరీనా బ్లూ కలర్‌లో లభ్యం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఆల్ట్రోజ్ కారులో ఆ కలర్ ఆప్షన్ అందుబాటులో లేదు.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

టాటా మోటార్స్ భారత రోడ్లపై పరీక్షిస్తోన్న ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్‌ను మనం ఇదివరకటి స్పై చిత్రాల్లో గమనించాం. తాజాగా, టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ చిత్రాన్ని గమనిస్తే, ఇందులో కొత్త కలర్ ఆప్షన్ మినహా వేరే ఏ ఇతర మార్పులు కనిపించడం లేదు.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

అయితే, ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ విడుదల సమయంలో టాటా మోటార్స్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. టర్బో వేరియంట్ ఎక్స్టీరియర్స్‌లో చేయబోయే మార్పుల్లో బ్లాక్-అవుట్ ట్రిమ్స్, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్ వంటి స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. స్టాండర్డ్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

టర్బో వేరియంట్ ఇంటీరియర్స్ కూడా స్టాండర్డ్ ఆల్ట్రోజ్ మాదిరిగానే ఉండనున్నాయి. అయితే, ఇందులో బ్లాక్-అవుట్ థీమ్‌ను ఇంటీరియర్స్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఇంకా ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో వేరియంట్‌లో పవర్‌ఫుల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్‌ను మరియు 140 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

టర్బో వేరియంట్‌ను అటుంచితే, టాటా మోటార్స్ ప్రస్తుతం ఆల్ట్రోజ్‌ను రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. ఇందులో మొదటిది 1.2-లీటర్, త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ ఇది. గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

ఇకపోతే రెండవది 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

మరీనా బ్లూ కలర్‌లో టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్; వచ్చే నెలలో విడుదల!

ప్రస్తుతం, మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ.5.45 లక్షల నుండి రూ.9.00 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. టర్బో వేరియంట్ ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. టాటా ఆల్ట్రోజ్ టర్బో వేరియంట్ ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ పోలో టిఎస్ఐ మరియు రాబోయే నెక్స్ట్-జెన్ హ్యుందాయ్ ఐ 20 వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Tata Altroz Turbo To Get New Marina Blue Colour Option. Read in Telugu.
Story first published: Saturday, December 26, 2020, 14:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X