2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

టాటా మోటార్స్ 'హెచ్‌బిఎక్స్' అనే సరికొత్త ఎస్‌యువిని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. టాటా హెచ్‌బిఎక్స్ 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో ప్రారంభించనుంది. ఇప్పుడు ప్రారంభించటానికి ముందు పరీక్షలకు గురిచేసింది. కొత్త టాటా హెచ్‌బిఎక్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్టింగ్ వీడియోని గమనించినట్లైతే ఇందులో స్ట్రాప్-ఆన్ హెడ్‌లైట్లు ఉన్నాయి. రాబోయే టాటా హెచ్‌బిఎక్స్ యొక్క డిజైన్ గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ ఈ వాహనం యొక్క ఫ్రంట్ గ్రిల్ మరియు ఫంకీ అల్లాయ్ వీల్ డిజైన్‌ను చూడవచ్చు.

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

టాటా మోటార్స్ 2018 ఆటో ఎక్స్‌పోలో మొదటి హెచ్‌బిఎక్స్ మినీ-ఎస్‌యువిని హెచ్ 2 ఎక్స్ కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. కానీ ఎట్టకేలకు 2020 ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో హెచ్‌బిఎక్స్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ని విడుదల చేసింది.

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

టాటా మోటార్స్ నుండి వచ్చిన మినీ ఎస్‌యువి బ్రాండ్ యొక్క ఆల్ఫా ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది మరియు ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఆధారంగా రూపొందించబడింది. ఇది పొడవైన-రైడింగ్ డిజైన్ ని కలిగి ఉంటుంది. ఈ వాహనంలో డిఆర్ఎల్ లతో డ్యూయల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ సెటప్‌ ఉంటుంది, అంతే కాకుండా ప్రధాన హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్ దిగువ భాగంలో అమర్చబడి ఉంటుంది.

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

కొత్త టాటా హెచ్‌బిఎక్స్ ఎస్‌యువిలో పెద్ద వీల్ ఆర్చెస్, బోల్డ్ క్రీజ్ లైన్లు మరియు ఫ్లోటింగ్-రూఫ్ డిజైన్‌తో కఠినమైన మరియు ఆధునిక రూపాలను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. డైమండ్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ తో పెద్ద చంకీ వీల్స్ కూడా ఇందులో ఉంటాయని భావిస్తున్నారు.

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

టాటా హెచ్‌బిఎక్స్ లో రెండు ఇంజిన్లు ఉంటాయి. అవి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 85 బిహెచ్‌పి మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజిన్ అయిన 1.5 లీటర్ డీజిల్ యూనిట్ 89 బిహెచ్‌పి మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 5 ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జత చేయబడతాయి.

టాటా హెచ్‌బిఎక్స్ లోని ఎక్కువ భాగాలను ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ ని పోలి ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి కూడా ఉన్నాయి.

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

టాటా హెచ్‌బిఎక్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినా తరువాత మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ మరియు రాబోయే 2020 డాట్సన్ రెడి-జిఓలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

2020 టాటా హెచ్‌బిఎక్స్ యొక్క స్పైడ్ టెస్ట్, లాంచ్ ఎప్పుడంటే.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా హెచ్‌బిఎక్స్ ఈ ఏడాది చివరినాటికల్లా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చితే లోపలి భాగంలో కొంచెం ఎక్కువ స్థలంకలిగి ఉంఫ్డ్ అవకాశం ఉంటుంది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఎక్కువ ప్రత్యర్థులను ఎదుర్కోవలసి వస్తుంది.

Image Courtesy: Area of Interest/YouTube

Most Read Articles

English summary
Tata HBX Production Spec Spied Testing Ahead Of Launch: Spy Pics & Details. Read in Telugu.
Story first published: Saturday, March 14, 2020, 16:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X