గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

టాటా మోటార్స్ అందిస్తున్న మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారు 'టాటా నెక్సాన్ ఈవి' కోసం కంపెనీ గడచిన ఆగస్ట్ 2020 నెలలో చందా (సబ్‌స్క్రిప్షన్) ప్లాన్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. అప్పట్లో ఈ చందా ప్లాన్ చాలా ఖరీదైనదిగా ఉండేది, దీని కోసం ప్రతినెలా రూ.41,900ల నుండి ప్లాన్‌లు ప్రారంభమయ్యేవి (36 నెలల కాల వ్యవధి కోసం, ఢిల్లీ ప్రాంతంలో).

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

అయితే, టాటా మోటార్స్ ఇప్పుడు తమ నెక్సాన్ ఈవి కోసం చందా ప్లాన్ మరోసారి భారీగా తగ్గించింది. ఇకపై ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కేవలం నెలకు 29,500ల నుండి మాత్రమే చందా ప్లాన్‌లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది (36 నెలల కాల వ్యవధి కోసం, ఢిల్లీ ప్రాంతంలో). టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరి నెలలో తమ ఎలక్ట్రిక్ వెర్షన్ నెక్సా ఈవి కారును మార్కెట్లో విడుదల చేసింది.

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు కోసం చందా ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, వాటి ధరలను తగ్గించడం వరుసగా ఇది రెండవసారి. గడచిన సెప్టెంబర్ 2020 నెలలో లిమిటెడ్ టైమ్ ఆఫర్‌గా 'ఎలక్ట్రిఫైయింగ్ సబ్‌స్క్రిప్షన్' పేరుతో టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలను కంపెనీ మొదటిసారి తగ్గించింది. మొదటి తగ్గింపు తర్వాత, ఈ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ధర ప్రతినెలా రూ.34,900ల నుండి ప్రారంభమయ్యేవి (36 నెలల కాల వ్యవధి కోసం, ఢిల్లీ ప్రాంతంలో).

MOST READ:మీకు తెలుసా.. ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు.. ఇంకెలా పనిచేస్తుందో వీడియోలో చూడండి

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

టాటా మోటార్స్ బెంగుళూరు, హైదరాబాద్, పూనే, ముంబై మరియు ఢిల్లీ నగరాల్లో నెక్సాన్ ఈవి కోసం చందా సేవలను అందిస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఈ చందా సేవలు మారుతూ ఉంటాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు చందా కాలపరిమితిని కనీసం 12 నెలల నుండి ప్రారంభమై 24 మరియు 36 నెలల వరకు పెంచుకోవచ్చు.

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

టాటా నెక్సాన్ ఈవి కోసం బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో 36 నెలల కాల వ్యవధి కోసం చందా ధరలు నెలకు రూ.34,700గా ఉన్నాయి. అదేవిధంగా, ముంబై మరియు పూణే నగరాల్లో 36 నెలల కాల వ్యవధి కోసం చందా ధరలు నెలకు రూ.31,400గా ఉన్నాయి.

MOST READ:టాటా అల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా !

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

ఒకవేళ 12 లేదా 24 నెలల కాలవ్యవధి కోసం చందా ప్లాన్‌ను గమనించినట్లయితే, బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో వరుసగా నెలకు రూ.37,200 మరియు రూ.40,400గా ఉన్నాయి. అలాగే, ముంబై మరియు పూణే నగరాల్లో 12 నెలల చందా ప్లాన్ కోసం నెలకు రూ.36,700 మరియు 24 చందా ప్లాన్ కోసం నెలలకు రూ.33,700గా ఉంది.

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

ఈ చందా మొత్తంలో అన్ని రకాల సేవలు కలిసి ఉంటాయి. ఇందులో సమగ్ర బీమా కవరేజ్, ఆన్-కాల్ 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఉచిత మెయింటినెన్స్, సమయానుకూల సర్వీసింగ్ మరియు డోర్‌స్టెప్ డెలివరీ సేవలు కలిసి ఉంటాయి.

MOST READ:భయంకరమైన ప్రమాదంలో మరణాన్ని తప్పించిన మారుతి వితారా బ్రెజా.. ఎలాగో తెలుసా ?

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

వీటికి అదనంగా, కస్టమర్లు వారి సౌలభ్యం ప్రకారం వారి ఇంటి వద్ద కానీ లేదా కార్యాలయంలో ఏర్పాటు చేయగల కాంప్లిమెంటరీ పర్సనల్ ఈవీ ఛార్జర్‌ను కూడా పొందవచ్చు. కస్టమర్లు ఎంచుకున్న చందా ప్లాన్ పదవీకాలానికి ముగిసే సయానికి ఒక నెల ముందుగా వారు కంపెనీకి నోటీసు ఇవ్వడం మరియు ముందస్తు ముగింపు ఛార్జీలను చెల్లించడం ఈ చందా ప్లాన్‌ను ముగించవచ్చు.

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

ఇక టాటా నెక్సాన్ ఈవి విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. టాటా నెక్సాన్ ఈ.వి. భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

టాటా నెక్సాన్ ఈవి కారు 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది.

MOST READ:ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా నెక్సాన్ ఈ.వి కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన టాటా నెక్సాన్ ఈవి చందా ప్లాన్ ధరలు

టాటా నెక్సాన్ ఈ.వి. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రేట్ల తగ్గింపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఈ తరహా ప్రకృతి సాన్నిహిత్యమైన వాహనాలను ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ కోసం చందా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కాగా, ఇప్పుడు ఈ ప్లాన్‌ను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాటి ధరలను భారీగా తగ్గించింది.

Most Read Articles

English summary
Tata Nexon EV Subscription Prices Reduced, Now Starts From Rs 29,500. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X