జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఇండియా వచ్చే జులై 2020 నుండి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న వెల్‌పైర్ (Vellfire) మరియు క్యామ్రీ హైబ్రిడ్ (Camry Hybrid) మోడళ్ల ధరలు జులై నుంచి పెరుగుతాయని టొయోటా ఇండియా ప్రకటించింది.

జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

అయితే, ఈ ధరలు ఎంత మేర పెరుగుతాయనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. జూన్ నెలాఖరు వరకూ ప్రస్తుతం అమలులో ఉన్న ధరలే ఉంటాయని, జులైలో కొత్త ధరలను ప్రకటిస్తామని టొయోటా తెలిపింది. ఎక్సేంజ్ రేట్లలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ మోడళ్ల రేట్లు పెంచాల్సి వస్తోందని టొయోటా వివరించింది. ఈ రెండు మోడళ్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలు అధికంగా ఉండటం వలన వీటి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.

జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

ఇందులో టొయోటా వెల్‌ఫైర్ కంపెనీ ఇటీవలే విడుదల లేటెస్ట్ ప్రోడక్ట్. ఆల్ట్రా ప్రీమీయం లగ్జరీ ఎమ్‌పివి విభాగంలో ప్రవేశపెట్టిన ఈ మోడల్ ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌తో పోటీ పడుతుంది. భారత్‌లో టొయోటా అందిస్తున్న వైల్‌ఫైర్ ఎమ్‌పివి ధర రూ.79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

MOST READ: 2021 టొయోటా ఫేస్‌లిఫ్ట్ ఫార్చ్యూనర్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత్‌లో విడుదల!

జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

ఇక టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ విషయానికి వస్తే.. కంపెనీ ఇటీవలే ఇందులో బిఎస్6 కాలుష్య నిబంధనలకు తగినట్లుగా అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. భారత్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ బిఎస్6 ప్రారంభ ధర రూ.37.88 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

క్యామ్రీ హైబ్రిడ్, వైల్‌ఫైర్ ధరల పెంపు విషయం అటుంచితే, టొయోటా ఇప్పటికే తమ పాపులర్ మోడళ్లయిన ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మోడళ్ల ధరలను కూడా పెంచిన సంగతి తెలిసినదే. దీంతో టొయోటా ఫార్చ్యూనర్ ధరలు రూ.48,000 వరకూ పెరగగా, ఇన్నోవా క్రిస్టా ధరలు రూ.60,000 వరకూ పెరిగాయి.

MOST READ: పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు

జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

టొయోటా ఇటీవలే తమ సరికొత్త '2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్' మోడల్‌ను థాయ్‌లాండ్ మార్కెట్లో ఆవిష్కరించింది. అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కొత్త మోడల్‌ను అతి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 టొయోటా ఫార్చ్యూనర్‌లో మునుపటి వెర్షన్ల కన్నా మెరుగైన ఫీచర్లను జోడించారు. అలాగే డిజైన్ పరంగా కూడా అనేక మార్పులు చేర్పులు చేశారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

జులై 2020 నుండి పెరగనున్న టొయోటా కార్ల ధరలు

టొయోటా వెల్‌ఫైర్, క్యామ్రీ హైబ్రిడ్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లోని ప్రీమియం సెగ్మెంట్లో టొయోటా వెల్‌ఫైర్ మరియు క్యామ్రీ హైబ్రిడ్ వాహనాలు మంచి పాపులారిటీని సంపాధించుకున్నాయి. ప్రత్యేకించి టొయోటా వెల్‌ఫైర్ ఎమ్‌పివి అయితే, దాని ఆల్ట్రా లగ్జరీ ఫీచర్లతో కొనుగోలుదారులను తొలిచూపులోనే కట్టి పడేస్తోంది. ఇద ఈ సెగ్మెంట్లోని మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ మోడల్‌తో పోటీ పడుతుండగా, క్యామ్రీ హైబ్రిడ్ ఈ సెగ్మెంట్లోని స్కొడా సూపర్బ్ మోడల్‌తో పోటీ పడుతుంది.

Most Read Articles

English summary
Toyota Kirloskar Motors India has announced that they will be increasing the prices of their Vellfire and Camry hybrid models in the Indian market. The price hike for both the hybrid models will come into effect from the starting of July 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X