టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) భారతదేశంలో సి5 (C5) ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసిన తర్వాత ఇప్పుడు, ఇందులో చిన్న సైజు కాంపాక్ట్ ఎస్‌యూవీ సి3 (C3) ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, తాజాగా సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. టెస్టింగ్ దశంలో ఉండగా, సి3 డ్రైవ్‌స్పార్క్ కెమెరాకి చిక్కింది. ఇది పూర్తిగా క్యామోఫ్లేజ్ చేయబడి ఉన్నప్పటికీ, ఇందులో ప్రొడక్షన్ మోడల్ ఉండబోయే అనేక వివరాలు కూడా వెల్లడయ్యాయి.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

ఈ స్పై చిత్రాలలో చూసినట్లుగా, సిట్రోయెన్ సి3 ముందు భాగంలో దాని క్లాసిక్ లోగోను చూడవచ్చు. కంపెనీ ఇందులో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ గ్రిల్ ను దాని ముందు భాగంలో జోడించింది మరియు ఇరువైపులా డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌లైట్సను ఉపయోగించింది. ఫ్రంట్ గ్రిల్ లో అప్పర్ గ్రిల్ మరియు లోవర్ గ్రిల్ కి మధ్యలో నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఈ చిత్రాలలో బానెట్ పై మజిక్యులర్ బాడీ లైన్స్ కూడా చూడొచ్చు. దీని సైడ్ మిర్రర్స్ మరియు రూఫ్ ట్రాక్స్ ను చూస్తుంటే, ఈ మోడల్ బేస్ వేరియంట్ కావచ్చని తెలుస్తోంది.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

ఇందులో స్టీల్ వీల్స్ కూడా ఇది బేస్ వేరియంట్ అని నిర్ధారిస్తాయి. అదే సమయంలో, ఈ కారు వెనుక భాగంలో సన్నని టెయిల్ లైట్లు మధ్యలో ఎగువ భాగంలో స్టాప్ లైట్ ఇవ్వబడింది. సిట్రోయెన్ సి3 ముందు వైపు 1 లీటర్ గ్లోవ్ బాక్స్ మరియు వెనుక భాగంలో రెండు 2 లీటర్ల డోర్ పాకెట్‌లను కలిగి ఉంటుంది. దీనితో పాటు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్, వెనుక భాగంలో ఉండే రెండు కప్ హోల్డర్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

ఈ కారులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, యూఎస్‌బి చార్జింగ్ సాకెట్, స్టీరింగ్‌ వీల్ పై మౌంటెడ్ కంట్రోల్ బటన్లు, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన వాటిని ఆశించవచ్చు. ఈ చిన్న ఎస్‌యూవీలో 315 లీటర్ల బూట్ స్పేస్ మరియు 653 మిమీ లెగ్‌రూమ్‌ లభిస్తుంది. ఇది దాని విభాగంలో అతిపెద్దదిగా ఉండే అవకాశం ఉంది.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

అంతేకాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 991 మిమీ హెడ్‌రూమ్, 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉంటుంది. అలాగే, ఇది ఐస్ వైట్, ప్లాటినం గ్రే, ఆర్టెన్స్ గ్రే, జెస్టీ ఆరెంజ్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. సిట్రోయెన్ ఇంకా ఈ చిన్న ఎస్‌యూవీ యొక్క ఇంజన్ వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని 1.2-లీటర్ టర్బో-ఛార్జ్డ్ ఇంజన్‌తో తీసుకురావచ్చని అంచనా వేస్తున్నాము.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

ఈ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 205 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. సిట్రోయెన్ సి3 కారును ఈ ఫ్రెంచ్ కార్ బ్రాండ్ యొక్క సాధారణ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించారు. ఇందులో సిట్రోయెన్ మరియు ప్యూజో యొక్క అనేక ఉత్పత్తులు తయారు చేయబడుతుంటాయి.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

ఈ ప్లాట్‌ఫారమ్ భారీగా స్థానికీకరించబడింది మరియు దీని ద్వారా రాబోయే మోడళ్లను పెట్రోల్ ఇంజన్‌కు మాత్రమే పరిమితం చేస్తామని కంపెనీ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఈ చిన్న కారును ఫ్లెక్స్ ఇంజన్ ఆప్షన్‌తో తీసుకురావచ్చని తెలుస్తోంది. సి3 ఎస్‌యూవీ 4 మీటర్ల కంటే తక్కువ సైజు కలిగిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఈ విభాగంలోని కార్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న సంగతి మీకు తెలిసనదే.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

సిట్రోయెన్ సి3 భారతదేశపు మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారుగా రానుంది. అంటే, ఇది ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్ ను కలిగి ఉంటుందన్నమాట. పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా పూర్తిగా 100 శాతం బయో-ఇథనాల్ (జీవ ఇంధన)తో నడిచే ఇంజన్‌ను ఫ్లెక్-ఫ్యూయెల్ ఇంజన్ అంటారు. అంటే, ఇది పూర్తిగా పెట్రోల్‌తో అయినా పనిచేస్తుంది లేదా పూర్తిగా జీవ ఇంధనంతోనైనా పనిచేస్తుంది.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలో సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, కస్టమర్లు అత్యంతగా ఇష్టపడే ఎస్‌యూవీ సెగ్మెంట్‌గా మారింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగం హ్యాచ్‌బ్యాక్ కంటే పెద్దది మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ కంటే చిన్నదిగా ఉంటుంది. ఈ రోజుల్లో కార్ల తయారీదారులు ఇలాంటి చిన్న కార్లలో పెద్ద ఎస్‌యూవీలలో అందిస్తున్న అనేక ఫీచర్లను అందిస్తున్నారు. వాటి ధర కూడా హ్యాచ్‌బ్యాక్‌తో సమానం, కాబట్టి కస్టమర్‌లు ఈ కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఇటీవల ఈ విభాగంలో తమ సరికొత్త కారు టాటా పంచ్‌ను విడుదల చేసింది. సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీని ముందుగా ఆసియా మార్కెట్లలో విడుదల కానుంది. సాధారణంగా, యూరోపియన్ కార్ కంపెనీలు మొదట తమ కొత్త మోడళ్లను యూరప్ లేదా అమెరికా మార్కెట్లలో విడుదల చేస్తాయి. ఆ తర్వాత వాటిని ఆసియా మార్కెట్‌లలో ప్రవేశపెడుతాయి.

టెస్టింగ్ లో కెమెరాకి చిక్కిన Citroen C3 కాంపాక్ట్ ఎస్‌యూవీ, త్వరలో విడుదల

మార్కెట్ అంచనా ప్రకారం, సిట్రోయెన్ ఈ ఎస్‌యూవీని భారతదేశంలో రూ. 5.50 లక్షల నుంచి 8.50 లక్షల మధ్య విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఈ ధర పరిధిలో, ఇది టాటా పంచ్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సొనెట్, రెనో కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Citroen c3 spotted testing in india design features engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X