ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ భారత మార్కెట్లో ఎట్టకేలకు తన సి 5 ఎయిర్‌క్రాస్‌ను విడుదల చేసింది. కొత్త సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ధర దేశీయ మార్కెట్లో రూ. 29.90 లక్షలు. ఈ ఎస్‌యూవీ ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. సి 5 ఎయిర్‌క్రాస్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే, కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క ఫీల్ డ్యూయల్ టోన్ ధర రూ. 30.40 లక్షలు కాగా, టాప్ వేరియంట్ అయినా షైన్ సింగిల్ అండ్ టోన్ ధర రూ. 31.90 లక్షల వరకు ఉంది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ కొనుగోలు చేయాలనే కస్టమర్లు రూ. 50 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

అయితే కంపెనీ ప్రీ-లాంచ్ బుకింగ్‌లు చేసిన వినియోగదారులకు 5 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ ప్యాకేజ్ అందిస్తుంది. అది కూడా ఏప్రిల్ 6 వరకు బుక్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

MOST READ:ఓటువేయడానికి సైకిల్‌పై వచ్చిన ఇలయదలపతి విజయ్.. కారణం ఏమిటంటే?

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ సంస్థ యొక్క పిఎస్‌ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. సిట్రాన్ సి 5 ఎయిర్‌క్రాస్ క్రాస్ఓవర్ డిజైన్‌ను కలిగి ఉండేలా రూపొందించబడింది. ఇందులో డ్యూయల్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ట్విన్ స్లాట్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, స్ప్లిట్ టెయిల్ లాంప్‌ కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

కొత్త సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.

MOST READ:మీకు తెలుసా.. ప్రపంచంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫైర్ ట్రక్, ఇదే

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

ఈ సి 5 ఎయిర్‌క్రాస్ లో పనోరమిక్ సన్‌రూఫ్, స్ప్లిట్ ఎసి వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, మూడ్ లైటింగ్, ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్, 3 పర్సనల్, రిక్లైనింగ్, అడ్జస్టబుల్ అండ్ మాడ్యులర్ రియర్ సీట్లు ఇవ్వబడ్డాయి. బూట్ స్పేస్ మరింత అవసరమైనప్పుడు వాటిని ఫోల్డ్ చేయవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ విత్ ఇబిడి, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్ కెమెరా, 5 మోడ్ ఆప్షన్లతో గ్రిప్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ దీనికి అనేక యాక్ససరీస్ ఆప్సన్స్ కూడా అందుబాటలోకి తీసుకురానుంది.

MOST READ:నట్టింట్లో వైరల్; తిరుమలలో కనిపించిన ఆవు పేడ పూసిన కార్

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

సిట్రాన్ సి 5 ఎయిర్‌క్రాస్‌లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 174 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 18.60 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

ఈ ఎస్‌యూవీని నాలుగు మోనో టోన్, మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచారు. సిట్రోయెన్ తన మొదటి కారుని లాంచ్ చేయడానికి ముందే దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు గురుగ్రామ్‌లలో వంటి ప్రాంతాలలో 10 షోరూమ్‌లను ఓపెన్ చేసింది.

MOST READ:సైకిల్‌ ప్రయాణంలో గిన్నిస్ బుక్ రికార్డ్; కేవలం 8 రోజుల్లో కాశ్మీర్ To కన్యాకుమారి చేరిన యువకుడు

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

భారత మార్కెట్లో ఎట్టకేలకు విడుదలైన ఈ కారుకి వినియోగదారుల నుండి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాలి. ఇటీవల మేము సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ కూడా నిరాఘాటంగా పూర్తి చేసాము. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Citroen C5 Aircross Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X