ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సిట్రోయెన్ అనేది ఫ్రెంచ్ కార్ బ్రాండ్. ఇది సాధారణంగా 1919 నుండి మార్కెట్లో ఉంది. ఆనాటి నుంచి దాదాపు ఈ బ్రాండ్ 100 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది ప్రపంచ మార్కెట్లలో తమకంటూ ఒక ప్రత్యేక పేరును సృష్టించగలిగింది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 2020 లో తమ మొదటి కారు అయిన సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని భారత్‌లో పరిచయం చేయడానికి సిద్దమైంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఇది వాయిదాపడింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు భారత మార్కెట్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

భారతమార్కెట్లోకి రానున్న ఈ కొత్త సిట్రోయన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క ఫీచర్స్ మరియు ఇది వాహనదారునికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, తెలుసుకోవడానికి మేము ఇటీవల సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ను డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

డిజైన్ అండ్ స్టైల్ :

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ అయిన సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ప్రత్యేకమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరినీ దృష్టిని ఆకర్షించేలా చాలా ఆక్షర్షణీయంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో మజిల్ బోనెట్‌ను కలిగి ఉంది. సి 5 ఎయిర్‌క్రాస్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ యూనిట్లతో వస్తుంది, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు పైన, ఎల్‌ఇడి విజన్ ప్రొజెక్టర్ యూనిట్లు దాని క్రింద ఉన్నాయి. ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్ క్రోమ్ స్ట్రిప్స్‌తో జతచేయబడతాయి. వీటి మధ్యలో సిట్రోయెన్ లోగో ఉంటుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ప్రొజెక్టర్ యూనిట్ సొగసైన గ్రిల్ కలిగి, త్రీ హారిజాంటల్ స్లేట్ తో, బ్లాక్ కలర్ లో పూర్తి చేయబడి ఉంటుంది. ఫ్రంట్ బంపర్లకు మరింత దిగువకు వెళ్ళినట్లైతే సి 5 ఎయిర్‌క్రాస్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ 'ఎయిర్‌బంప్' ప్రొటెక్టివ్ ప్యానెల్స్‌ను దాని మధ్యలో ఎయిర్ ఇంటెక్ ద్వారా ముందుకు తీసుకువెళుతుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఈ ఎస్‌యూవీలో ఎయిర్‌బంప్స్ పక్కన ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్ కూడా ఉన్నాయి, ఇది కార్నరింగ్ లాంప్స్‌గా కూడా పనిచేస్తుంది. దీనికి బ్లాక్-క్లాడింగ్ కూడా ఉంది. ఇది ఎస్‌యూవీకి అన్ని వైపులా ఉంటుంది. ఇది కొద్దిగా కఠినమైన రూపాన్ని ఇస్తుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క సైడ్ ప్రొఫైల్ కర్వ్డ్ ప్యానెల్స్‌తో కొనసాగిస్తుంది. ఎయిర్ బంప్ డోర్స్ క్రింద ఉన్న బ్లాక్-క్లాడింగ్ మీద కూడా చూడవచ్చు. ఈ ఎస్‌యూవీ స్టాండర్డ్ 18 ఇంచెస్ టూ-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఎస్‌యూవీ సైడ్స్ ఖచ్చితమైన సి టైప్ క్రోమ్ ఎలిమెంట్ కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలోని ఓఆర్‌విఎంలు కూడా బ్లాక్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్స్‌తో వస్తాయి.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సి 5 ఎయిర్‌క్రాస్ వెనుక భాగం కేవలం 3 డి ఎల్‌ఇడి టైల్ లైట్స్ కలిగి ఉంటుంది. ఎస్‌యూవీలో ఎల్‌ఈడీ స్టాప్ లాంప్‌తో రూప్ మౌంటెడ్ స్పాయిలర్ కూడా వస్తుంది. బూట్ లిడ్ టైల్ లైట్స్ మధ్య సిట్రోయెన్ లోగోను కలిగి ఉంటుంది. అయితే 'సి 5 ఎయిర్‌క్రాస్' బ్యాడ్జింగ్ క్రింద ఉంచబడింది. వెనుక బంపర్ కేవలం బ్లాక్ క్లాడింగ్ మరియు రిఫ్లెక్టర్లతో శుభ్రంగా ఉంటుంది. సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్‌ యొక్క ఈ డిజైన్ భారత మార్కెట్లో తన పోటీదారుల జాబితాలో సమానంగా నిలబడటానికి సహాయపడుతుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

కాక్‌పిట్ & ఇంటీరియర్స్ :

కొత్త సిట్రోయన్ సి 5 ఎయిర్‌క్రాస్ లోపలికి అడుగు పెట్టగానే ప్రీమియం క్యాబిన్ మరియు చక్కగా అమర్చిన డాష్‌బోర్డ్‌తో స్వాగతిస్తుంది. ఈ ఎస్‌యూవీ ప్రీమియం అప్పీల్‌కు తోడ్పడే 'మెట్రోపాలిటన్ గ్రే' కలర్ స్కీమ్‌లో పూర్తయింది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్క్రోల్ చేయడానికి ఆడియో, కాల్ అలర్ట్స్ మరియు అదర్ స్విచ్‌ల కోసం మౌంట్ కంట్రోల్స్ తో స్టీరింగ్ వీల్ స్వాగతం పలుకుతుంది. ఇది 12.3 ఇంచెస్ టిఎఫ్‌టి స్క్రీన్‌తో రూపొందించబడింది, కానీ ఎంచుకున్న డ్రైవింగ్ మోడ్‌ల ప్రకారం అనుకూలీకరించవచ్చు.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

స్టీరింగ్ వీల్ మరియు క్రింద ఉన్న పెడల్స్ కూడా సిల్వర్ ఫినిష్డ్ యాక్సెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి లోపల ఇన్సైడ్ నెస్‌ను పెంచుతాయి. అవసరమైనప్పుడు సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించే ప్యాడీల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

కాక్‌పిట్ నుండి మరియు సెంటర్ కన్సోల్ ముందు సీట్లపైకి కదులుతుంది. సి 5 ఎయిర్‌క్రాస్ 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లేకి ఇరువైపులా మరియు డాష్‌బోర్డ్ యొక్క ఇరువైపులా నిలువుగా ఉంచబడిన డ్యూయల్ స్కోయర్ షేప్ AC వెంట్స్ కలిగి ఉంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. సిట్రోయెన్ స్క్రీన్‌కు దిగువన కొన్ని క్విక్ యాక్సిస్ టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటాయి. ఫిజికల్ బటన్ల ద్వారా వచ్చే డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్స్ దీనికి క్రింద ఉన్నాయి. దాని క్రింద మొబైల్ ఫోన్‌లను ఉంచడానికి తగిన స్థలాన్ని అందిస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు 12 వి సాకెట్‌ను కూడా ఉంటుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

మెయిన్ సెంట్రల్ కన్సోల్‌కు, ముందు సీట్ల మధ్య, సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ మల్టిపుల్ పి, ఎన్, ఆర్ మరియు డి మోడ్‌ల ద్వారా టోగుల్ చేయడానికి గేర్ లివర్‌ను కలిగి ఉంది. ముందు పేర్కొన్న పాడిల్ షిఫ్టర్లను ఉపయోగించి మాన్యువల్ గేర్ షిఫ్టుల కోసం 'ఎమ్' మోడ్ కూడా ఉంది.

సెంట్రల్ కన్సోల్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ స్విచ్, ఎకో అండ్ స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్‌ల బటన్లతో పాటు ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్, స్నో, సాండ్, ఆల్-టెర్రైన్ మరియు ట్రాక్షన్-కంట్రోల్ ఆఫ్ ఉన్న 'గ్రిప్ కంట్రోల్స్' మధ్య టోగుల్ చేయడానికి రోటరీ నాబ్ కూడా ఉంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్ :

సి 5 ఎయిర్‌క్రాస్‌లోని సీట్లు స్కోయర్ నమూనాతో లెదర్ మరియు ఫాబ్రిక్ అపోల్స్ట్రే మిశ్రమంలో అప్హోల్స్టర్ చేయబడ్డాయి. ఎస్‌యూవీలో డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ అడ్జస్ట్ వస్తుంది, ముందు ప్యాసింజర్ సీటులో 6 వే మాన్యువల్ అడ్జస్టబుల్ ఉంటుంది. డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్లు రెండూ కూడా లంబర్ సపోర్ట్ తో వస్తాయి, ఇది మళ్ళీ మ్యాన్యువల్ అడ్జస్టబుల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ముందు సీట్లు అద్భుతమైన కుషనింగ్‌ను అందిస్తాయి మరియు చాలా సౌకర్యంగా ఉంటాయి. ముందు ప్రయాణీకులకు మంచి హెడ్‌రూమ్ మరియు లెగ్‌రూమ్ కూడా ఉంది.

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ వెనుక వైపు మూడు ఇండ్యుజువల్ ఫుల్ సైజ్ సీట్స్ ఉంటాయి. మూడు సీట్లను స్లైడ్ మరియు రెక్లైన్ ఫంక్షనాలిటీలతో స్వతంత్రంగా అడ్జస్ట్ చేయవచ్చు. విస్తరించిన లగేజ్ స్పేస్ అందించడానికి మూడు ఇండ్యూజువల్ సీట్లను వివిధ కాన్ఫిగరేషన్లలో పూర్తిగా మడవవచ్చు.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

వెనుకవైపు ఉన్న మూడు ఇండ్యూజువల్ సీట్లు, వాస్తవానికి అందించే దానికంటే పెద్ద స్థలాన్ని ఇస్తాయి. వెనుక సీట్లు ముందు భాగంలో అదే సౌకర్యాన్ని అందిస్తాయి. వెనుకవైపు హెడ్‌రూమ్ మరియు లెగ్‌రూమ్ కూడా మంచి మొత్తంలో ఉన్నాయి. ఏదేమైనా, వెనుక ఉన్న ముగ్గురు వ్యక్తులు కొంచెం స్క్వీజ్ చేసినట్లు అనిపిస్తుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఏది ఏమైనప్పటికీ స్టాండర్డ్ ఆఫర్‌లో ఉన్న పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, కొంచెం స్లైట్లీ మెట్రోపాలిటన్ గ్రే క్యాబిన్ పెద్ద విడోస్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌తో భర్తీ చేయబడుతుంది. ఇవన్నీ ఈ ఎస్‌యూవీకి విశాలమైన అనుభూతిని ఇస్తాయి.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క క్యాబిన్ అనేక క్యూబి స్పేసేస్, స్టోరేజ్ ఏరియాస్ మరియు డోర్ బాక్స్ కూడా అందిస్తుంది. గ్లోవ్ బాక్స్ మంచి స్టోరేజ్ స్పేస్ కూడా అందిస్తుంది, ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ క్రింద అదనపు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కూడా ఉంది, దీనిలో ఎల్‌ఇడి లైట్ కూడా ఉంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఈ ఎస్‌యూవీలో 580 లీటర్ల స్పేస్ ఉంటుంది. ముందు చెప్పినట్లుగా, సీట్లను ఒక్కొక్కటిగా మడవవచ్చు. మూడు సీట్లు మడవడంతో, బూట్ స్పేస్ గరిష్టంగా 1630 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

Dimensions Citroen C5 Aircross
Length 4500mm
Width 2099mm
Height 1710mm
Wheelbase 2730mm
Min. Turning Radius 5.35m
Boot Space 580-Litres
ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఇంజిన్ పెర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్ :

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ సింగిల్ ఇంజన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఇందులో ఉన్న 2.0 లీటర్ డీజిల్ యూనిట్ 3750 ఆర్‌పిఎమ్ వద్ద 175 బిహెచ్‌పి మరియు 2000 ఆర్‌పిఎమ్ వద్ద 400 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్సన్ లేకుండా, స్టాండర్డ్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ఫోర్-వీల్ డ్రైవ్ యొక్క ఆప్సన్ లేకుండా పవర్ అన్ని ముందు చక్రాలకు పంపబడుతుంది. ఇది ఈ ఎస్‌యూవీకి కొంత కష్టతరంగా అనిపిస్తుంది. ఏదైనా నిజమైన ఆఫ్ రోడింగ్ ట్రయల్స్‌లో సి 5 ఎయిర్‌క్రాస్ తీసుకోవాలని మేము మీకు సిఫార్సు చేయము. సి 5 ఎయిర్‌క్రాస్‌లోని ఇంజిన్ చాలా మృదువైనదిగా అనిపిస్తుంది, మరియు తక్కువ ఆర్‌పిఎమ్‌ల వద్ద కూడా ఎస్‌యూవీని బాగా లాగుతుంది. యాక్సిలరేటర్ పెడల్ యొక్క చిన్న ట్యాప్ వద్ద పవర్ మరియు టార్క్ పుష్కలంగా లభిస్తుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

డీజిల్ ఇంజిన్ 8 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కిక్‌డౌన్ చేయడానికి కొంత సమయం పడుతుంది, అయినప్పటికీ, కారు వెళుతున్న తర్వాత, గేర్‌బాక్స్ మరింత ప్రతిస్పందిస్తుంది మరియు క్విక్ గేర్ షిఫ్ట్‌లతో మెరుగైన పని చేస్తుంది. కొంచెం స్పోర్టిగా ఉన్నప్పటికీ, ఎస్‌యూవీ పాడిల్-షిఫ్టర్స్‌తో కూడా వస్తుంది. ఇది అందుబాటులో ఉన్న పవర్ కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సి 5 ఎయిర్‌క్రాస్ రెండు డ్రైవింగ్ మోడ్‌లతో అందించబడుతుంది. అవి ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్. 'ఎకో' మోడ్ సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుంది. 'స్పోర్ట్' మోడ్ ఒక రకమైన నిరాశకు గురిచేస్తుంది. ఇది ఎస్‌యూవీ స్పీకర్ల నుండి వచ్చే ఇంజిన్ శబ్దాన్ని అందిస్తుంది. అయితే సి 5 ఎయిర్‌క్రాస్ డ్రైవింగ్ ఫీచర్స్ గణనీయమైన మార్పు లేకుండా ముందుకు కొనసాగుతుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

ట్రాఫిక్ మరియు ఇతర నగర పరిస్థితుల ద్వారా సులభంగా నావిగేట్ చేసేటప్పుడు SUV తేలికపాటి స్టీరింగ్ సహాయపడుతుంది. ఇది హైవే మరియు ట్విస్ట్ రోడ్లపై ప్రత్యేకంగా గుర్తించదగినది, తేలికపాటి స్టీరింగ్ కారును కారుని సులభంగా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సి 5 ఎయిర్‌క్రాస్‌లో బాడీ రోల్ చాలా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇది స్మూత్ గా నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. సి 5 ఎయిర్‌క్రాస్‌లోని ఎన్‌విహెచ్ స్థాయిలు చాలా ఆకట్టుకుంటాయి. దీనిలోకి బయటి నుండి శబ్దం రాదు. ఇంజిన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మరియు అధిక వేగంతో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడికి గురికాదు. ఇది మంచి దృశ్యమానతను కలిగి ఉంటుంది. అయితే వెనుక వైపు ఉన్న దృశ్యమానత అంత ఉత్తమమైనది కాదు.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సిట్రోయన్ సి 5 ఎయిర్‌క్రాస్ మా వద్ద తక్కువ సమయం మాత్రమే ఉండటం వల్ల, మేము ఖచ్చితమైన మైలేజ్ టెస్ట్ చేయలేకపోయాము. అయితే ఇది ఒక లీటరుకు 18.6 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సి 5 ఎయిర్‌క్రాస్‌ యొక్క సస్పెన్షన్ చాలా మృదువుగా ఏర్పాటు చేయబడింది. సిట్రోయెన్ 'ప్రోగ్రెసివ్ హైడ్రాలిక్ కుషన్స్' అనే టెక్నాలజీని జతచేసింది. దేశీయ రోడ్లపైన పెద్ద గుంతలు మరియు స్పీడ్ బ్రేకర్లతో ఉన్నప్పటికీ, సి 5 ఎయిర్‌క్రాస్ సజావుగా ముందుకు సాగుతుంది.

సస్పెన్షన్ చాలా మృదువుగా ఉంది. ఇందులోని బ్రేకింగ్ సిస్టం చాలా షార్ప్ గా ఉండటం వల్ల ఈ పెద్ద ఎస్‌యూవీని కూడా సులభంగా నిలిపివేయడానికి అనుమతిస్తుంది.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

వేరియంట్స్, కలర్స్ మరియు ప్రైస్ :

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తాయి. ఈ రెండు వేరియంట్లు అనేక ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇందులో నాలుగు సింగిల్-టోన్ పెయింట్ స్కీమ్స్ మరియు మూడు డ్యూయెల్ టోన్ ఆప్సన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సింగిల్ టోన్ పెయింట్ స్కీమ్ లో పెర్ల్ వైట్, క్యుములస్ గ్రే, టిజుకా బ్లూ మరియు పెర్లా నెరా బ్లాక్ ఉన్నాయి. పెర్లా నేరా బ్లాక్ కాకుండా పైన పేర్కొన్న అన్ని కలర్ స్కీమ్స్ కూడా బ్లాక్‌లో పూర్తి చేసిన విరుద్ధమైన పైకప్పుతో వస్తాయి.

సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ ధర ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది లాంచ్ అయ్యే ఆసమయంలో ధర నిర్ణయించబడుతుంది. ఈ ఎస్‌యూవీ 2021 మార్చిలో విడుదలవుతుంది. ఈ ఎస్‌యూవీ ప్రీమియం మిడ్-సైజ్ విభాగంలో దీని ధర రూ. 27 నుంచి రూ. 30 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము.

ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

సేఫ్టీ ఫీచర్స్ మరియు కీ ఫీచర్స్:

సి 5 ఎయిర్‌క్రాస్ లోని ఫీల్ మరియు షైన్ వేరియంట్లు అనేక ఫీచర్స్, పరికరాలు మరియు టెక్నాలజీతో నిండి ఉన్నాయి. ఇందులో

  • చుట్టూ ఎల్ఇడి లైటింగ్ (హెడ్‌ల్యాంప్‌లు, డిఆర్ఎల్ లు, టైల్ లైట్స్ మరియు టర్న్ సిగ్నల్స్)
  • 18-ఇంచ్ 'స్విర్ల్' డ్యూయెల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
  • హ్యాండ్స్ ఫ్రీ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్
  • ప్రీమియం 'మెట్రోపాలిటన్ గ్రే' లెదర్ అపోల్స్ట్రే
  • 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • 12.3-ఇంచెస్ కస్టమైజబుల్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
  • ఎల్ఇడి మూడ్ లైటింగ్
  • మేజిక్ వాష్
  • ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
  • మ్యాన్యువల్ అడ్జస్టబుల్ పుల్ సైజ రియర్ సీట్లు
  • డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్స్
  • కీలెస్ ఎంట్రీ
  • పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్
  • పనోరమిక్ సన్‌రూఫ్
  • ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

    సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో

    • 6 ఎయిర్‌బ్యాగులు
    • బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
    • హిల్-హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
    • ఇబిడి విత్ ఏబీఎస్
    • కాఫీ బ్రేక్ అలెర్ట్
    • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
    • ఐసో ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు
    • రివర్స్ పార్కింగ్ కెమెరా
    • పెరిమీటర్ / వాల్యూమెట్రిక్ అలారం
    • ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

      వారంటీ ఆఫర్ :

      సిట్రోయెన్ తన వినియోగదారులందరికీ 3 సంవత్సరాల లేదా 1 లక్ష కిలోమీటర్ల స్టాండర్డ్ వెహికల్ వారంటీతో అందించనుంది. ఆఫర్‌లో ఎక్స్టెండ్ వారంటీ మరియు మెయింటెనెన్స్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. కంపెనీ 24x7 రోడ్‌సైడ్ అసిస్ట్ అందిస్తుంది, అంతే కాకుండా ఇది తన సర్వీస్ ని అందించడానికి విస్తృత డీలర్‌షిప్‌ల నెట్‌వర్క్‌లను అందించనుంది.

      ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

      కాంపిటీషన్ మరియు ఫ్యాక్ట్ చెక్

      సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ భారత మార్కెట్లో హ్యుందాయ్ టక్సన్ మరియు 2021 జీప్ కంపాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

      Specifications Citroen C5 Aircross Hyundai Tucson 2021 Jeep Compass
      Engine 2.0-Litre Diesel 2.0-Litre Diesel 2.0-Litre Diesel
      Power 176bhp 183bhp 168bhp
      Torque 400Nm 400Nm 350Nm
      Transmission 8-Speed Automatic 8-Speed Automatic 9-Speed Automatic
      Starting Price* TBA ₹22.55 Lakh ₹16.99 Lakh
      ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

      సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్ అద్భుతమైన డిజైన్, మంచి పనితీరు మరియు అన్నిటికంటే ఉత్తమమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది వాహనదారునికి చాలా సౌకర్యంగా అనిపిస్తుంది.

Most Read Articles

English summary
Citroen C5 Aircross First Drive Review. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X