Just In
- 12 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 23 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 31 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- News
ఏపీ మండలిలో పెరిగిన వైసీపీ బలం, కానీ సీనియర్ల గుస్సా.. ఈ సారి కూడా దక్కని పదవీ
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Movies
సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డీలర్ల వద్దకు చేరుకుంటున్న సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; త్వరలోనే విడుదల
ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్, ఇటీవలే తమ సరికొత్త 'సి5 ఎయిర్‌క్రాస్'ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ అధికారికంగా మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ భారత్‌లో తమ మొట్టమొదటి మోడల్ అయిన సి5 ఎయిర్‌క్రాస్‌ను డీలర్‌షిప్‌లకు పంపిణీ చేయటం ప్రారంభించింది.

తాజాగా ఓ డీలర్‌షిప్‌లో ప్రదర్శనకు ఉంచిన సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించారు. ఈ కారుకి సంబంధించి పూర్తి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వివరాలను వెల్లడించే వీడియో కూడా బయటకు వచ్చింది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని పిఎస్‌ఏ ఈఎమ్‌పి2 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారు చేయనున్నారు. ఇది 4,500 మి.మీ పొడవును, 2,099 మి.మీ వెడల్పును, 1,710 మి.మీ ఎత్తును మరియు 2,730 మి.మీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:అరుదైన లగ్జరీ కార్లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

భారత మార్కెట్లో సిట్రోయెనో సి5 ఎయిర్‌క్రాస్‌ను ఫీల్ మరియు షైన్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ రెండు వేరియంట్లకు సంబంధించిన పూర్తి ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఈ ఎస్‌యూవీ నాలుగు మోనో టోన్, మూడు టూ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. సింగిల్ టోన్‌లో పార్లా నేరా బ్లాక్, టిజుకా బ్లూ, పెరల్ వైట్ మరియు కోలామస్ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, టిజుకా బ్లూ, పెరల్ వైట్ మరియు క్యుములస్ గ్రే కలర్ ఆప్షన్లలో డ్యూయల్ టోన్ విత్ బ్లాక్ రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ టాప్ ఎండ్ వేరియంట్లలో ఫుట్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ మొదలైన ఫీచర్లు లభిస్తాయి.

ఇంకా ఇందులో ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్ మరియు వెనుక వరుసలో 3 పర్సనల్ అండ్ రిక్లైనింగ్ అడ్జస్టబల్ మాడ్యులర్ సీట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. బూట్ స్థలాన్ని పెంచడానికి ఇందులోని వెనుక సీట్లను పూర్తిగా మడుచుకునే వీలు ఉంటుంది.
MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి
సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌లో హైడ్రాలిక్ కుషన్ అమర్చిన సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుందని, తద్వారా ఇది కఠినమైన భూభాగాలపై సైతం సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, టాప్-ఎండ్ వేరియంట్లలో పానరోమిక్ సన్‌రూఫ్, ప్రత్యేకమైన గ్రిప్ కంట్రోల్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ వంటి అధునాత ఫీచర్లు కూడా లభించనున్నాయి.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని పవర్‌ఫుల్ 2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో విక్రయించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మెరుగైన మైలేజీతో పాటు సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
MOST READ:ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

భారత మార్కెట్లో సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ ధర రూ.25 లక్షల నుండి ప్రారంభం కావచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ టూసాన్, స్కొడా కొడియాక్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్ వంటి మోడళ్లతో పోటీపడనుంది.

సిట్రోయెన్ ఇటీవలే అహ్మదాబాద్‌లో తమ మొట్టమొదటి షోరూమ్‌ని ప్రారంభించింది. రానున్న రోజుల్లో సిట్రోయెన్ తమ లా మైసన్ థీమ్‌తో కూడిన షోరూమ్‌లను ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ మరియు కొచ్చి నగరాలలో కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Image Courtesy: Dr.Amit Biswas