సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ సిట్రోయెన్ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనున్న సి5 ఎయిర్‌క్రాస్ కోసం అధికారిక యాక్ససరీస్ జాబితాను కంపెనీ వెల్లడి చేసింది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఒకే ఇంజన్ ఆప్షన్‌తో కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులోకి రానుంది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

ఈ రెండు వేరియంట్లు ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభ్యం కానున్నప్పటికీ, కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా దీనిని మార్చుకునేందుకు కంపెనీ అదనపు యాక్ససరీలను అందిస్తోంది. ఈ యాక్ససరీలతో సాయంతో వినియోగదారులు తమ సి5 ఎయిర్‌క్రాస్‌ను మరింత అందంగా ముస్తాబు చేసుకోవచ్చు.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

ఎక్స్టీరియర్ యాక్ససరీలు

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కోసం కంపెనీ అందిస్తున్న ఎక్స్టీరియర్ యాక్ససరీలలో ఫ్రంట్ అండ్ రియర్ మడ్ ఫ్లాప్స్, కొత్త 18 ఇంచ్ స్విర్ల్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్, అల్లాయ్ వీల్స్ యాంటీ-థెఫ్ట్ బోల్ట్ కిట్, అల్లాయ్ వీల్ హబ్ క్యాప్ కోసం నాలుగు రంగులలో సిట్రోయెన్ హబ్‌క్యాప్, విండ్ డిఫ్లెక్టర్ మరియు కార్ కవర్లు ఉన్నాయి.

MOST READ:ఇలాంటి రోల్స్ రాయిస్ కారును ఎప్పుడైనా చూశారా? ఇది ఏ సెలబ్రిటీదో తెలుసా?

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

ఇంటీరియర్ యాక్ససరీలు

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కోసం కంపెనీ అందిస్తున్న ఇంటీరియర్ యాక్ససరీలలో సైడ్ సన్‌షేడ్ సెట్, రియర్ విండో సన్‌షేడ్, రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్, నీడ్లెడ్ కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్, వెల్వెట్ కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్, సీట్ కవర్స్, బంపర్ ప్రొటెక్టర్ మ్యాట్, ట్రంక్ నెట్ మరియు ధృడమైన ట్రంక్ ట్రే మొదలైనవి ఉన్నాయి.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

సిట్రోయెన్ బ్రాండ్‌కు సి5 ఎయిర్‌క్రాస్ భారత మార్కెట్లో మొట్టమొదటి మోడల్ కానుంది. ఈ మోడల్ విడుదల తర్వాత దేశంలో ప్రతి ఏటా ఓ కొత్త కారును విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరు, పూణే, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ మరియు కొచ్చి నగరాలలో సిట్రోయెన్ తమ షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

MOST READ:అరుదైన లగ్జరీ కార్‌లో కనిపించిన బాలీవుడ్ బాద్షా "షారుఖ్ ఖాన్" [వీడియో]

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 174 బిహెచ్‌పి పవర్‌ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ గేర్‌బాక్స్ మెరుగైన మైలేజీని అందించడంతో పాటుగా సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభూతిని కూడా కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీలో కంపెనీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో కాలి సంజ్ఞల ద్వారా ఆపరేట్ చేయగలిగే ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం 12.3 ఇంచ్ డిజిటల్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో పాటుగా ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:కార్లను ఇలా మోడిఫై చేస్తే ఇల్లీగల్ కాదు.. టాప్ 5 లీగల్ కార్ మోడిఫికేషన్స్!

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

అంతేకాకుండా, ఈ కారులోని వెనుక వరుసలో 3 పర్సనల్ అండ్ రిక్లైనింగ్ అడ్జస్టబల్ మాడ్యులర్ సీట్స్ ఉంటాయి. ఈ మూడు సీట్లను యూజర్లు తమ అవసరానికి అనుగుణంగా రిక్లైన్ చేసి, సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఒకవేళ కారు వెనుక అదనపు బూట్ స్థలం అవసరమైతే, ఈ మూడు సీట్లను పూర్తిగా మడుచుకునే వీలు కూడా ఉంటుంది.

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌లో హైడ్రాలిక్ కుషన్ అమర్చిన సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది, దీని ఫలితంగా కఠినమైన భూభాగాలపై సైతం సున్నితమైన డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, టాప్-ఎండ్ వేరియంట్లలో పానరోమిక్ సన్‌రూఫ్, ప్రత్యేకమైన గ్రిప్ కంట్రోల్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ వంటి అధునాత ఫీచర్లు కూడా లభించనున్నాయి.

MOST READ:డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కారు కోసం యాక్ససరీస్ లిస్ట్ వెల్లడి

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీని నాలుగు మోనో టోన్, మూడు టూ టోన్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుంది. సింగిల్ టోన్‌లో పార్లా నేరా బ్లాక్, టిజుకా బ్లూ, పెరల్ వైట్ మరియు కోలామస్ గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కాగా, టిజుకా బ్లూ, పెరల్ వైట్ మరియు క్యుములస్ గ్రే కలర్ ఆప్షన్లలో డ్యూయల్ టోన్ విత్ బ్లాక్ రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Citroen Reveals C5 Aircross Accessories List; Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X