Just In
- 10 min ago
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
Don't Miss
- Movies
చావు కబురు చల్లగా.. ఓటీటీలో మరింత కొత్తగా..
- News
కరోనాతో ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి... మిగతా ఉద్యోగుల్లో భయాందోళన...
- Sports
రోహిత్ అండ్ టీమ్‌పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నెక్సాన్ ఈవీ మైలేజ్ విషయంలో రచ్చ; హైకోర్టు మెట్లెక్కిన టాటా మోటార్స్
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ సబ్సిడీ విషయంలో ఢిల్లీ సర్కారుకి మరియు టాటా మోటార్స్‌కి మధ్య ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. గతంలో నెక్సాన్ ఈవీని కొనుగోలు చేసిన ఓ కస్టమర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఢిల్లీ సర్కారు ఈ కారుపై అందించే రూ.3 లక్షల సబ్సిడీని రద్దు చేసింది.

దీంతో టాటా మోటార్స్ ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, టాటా మోటార్స్ ఢిల్లీ హైకోర్టులో వాజ్యం వేసింది. ఈ కేసును పరిశీలించిన ఢిల్లీ హైకోర్ట్ తమ నుండి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో "గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు మా రిట్ మీద నోటీసు జారీ చేసింది మరియు ఢిల్లీ ప్రభుత్వం యొక్క అర్హతగల వాహనాల జాబితా నుండి నెక్సాన్ ఈవీని తొలగించటానికి వ్యతిరేకంగా స్టే విధించడం ద్వారా మధ్యంతర ఉపశమనం కల్పించింది. ఈ విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి గౌరవనీయ హైకోర్టు, ఢిల్లీ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చింది" అని పేర్కొంది.

అసలు గొడవంతా టాటా నెక్సాన్ ఈవీ మైలేజ్ (రేంజ్) గురించే..
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు రేంజ్ (మైలేజ్) విషయంలో కంపెనీ తప్పుడు ప్రచారం చేసిందని, కంపెనీ పేర్కొన్న రేంజ్‌కి వాస్తవిక రేంజ్‌కి చాలా వ్యత్యాసం ఉందని ఓ కస్టమర్ చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని ఢిల్లీ సర్కారు నెక్సాన్ కారుపై ఆఫర్ చేసే రూ.3 లక్షల సబ్సిడీని తొలగిస్తూ, సబ్సిడీ వాహనాల జాబితా నుండి ఈ కారును డీలిస్ట్ చేసింది.

బ్రోచర్ ప్రకారం, ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన విధంగా టాటా నెక్సాన్ ఈవీ బ్యాటరీలు పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 312 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేయాల్సి ఉంది. కానీ ఇది పూర్తి చార్జ్‌పై 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించలేదని ఓ కస్టమర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వెంటనే వీటిని రాయితీ లిస్ట్ నుంచి తొలగిస్తున్నామని ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చ్ 1, 2021వ తేదీ నుండి ఢిల్లీలో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సబ్సిడీని కోల్పోయారు.

ఢిల్లీ ప్రభుత్వం ఈ ఎలక్ట్రిక్ కారును తమ సబ్సిడీ లిస్ట్ నుండి తొలగించిన కారణంగా, ఇప్పుడు ఢిల్లీలో నెక్సాన్ ఈవి బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.16.16 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అదే ఈ కారుపై రూ.3 లక్షల సబ్సిడీని అందించినట్లయితే, ఇది రూ.13.25 లక్షలకే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది.

ఈ వివాదంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించినప్పటికీ, కొత్తగా టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు తిరిగి ఎప్పుడు సబ్సిడీ పొందవచ్చనే దానిపై ఇటు టాటా మోటార్స్ కానీ అటు ఢిల్లీ సర్కారు కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయంలో టాటా మోటార్స్‌కి అనుకూలంగా నివేదిక వస్తే, ప్రభుత్వం తిరిగి ఈ వాహనాన్ని తమ అధికారిక జాబితాలో చేర్చే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇందులో 95 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్‌ను ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఇది 30.2 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్‌ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇది ఎక్స్ఎమ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో దీని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.