ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

హ్యుందాయ్ అల్కజార్ పేరు గుర్తుందా..? క్రెటా ఎస్‌యూవీ ఆధారంగా కంపెనీ తయారు చేస్తున్న 7-సీటర్ ఎస్‌యూవీని 'అల్కజార్' (Alcazar) అనే పేరుతో ప్రవేశపెట్టనున్నారు. తాజాగా, ఈ కారుకి సంబంధించిన మొట్టమొదటి అఫీషియల్ స్కెచ్ చిత్రాలను కంపెనీ వెల్లడి చేసింది.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీని భారతదేశంతో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కంపెనీ విడుదల చేయనుంది. ఏప్రిల్ 6, 2021వ తేదీన కంపెనీ ఈ కారుని ప్రపంచానికి పరిచయం చేయనుంది. ప్రపంచ ఆవిష్కరణకు ముందే, హ్యుందాయ్ తమ కొత్త ఎస్‌యూవీ యొక్క సైడ్ మరియు ఇంటీరియర్ డిటేల్స్‌ను వెల్లడించే అఫీషియల్ స్కెచ్‌లను విడుదల చేసింది.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

గతేడాది హ్యుందాయ్ విడుదల చేసిన సెకండ్ జనరేషన్ క్రెటా ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ 7-సీటర్ వెర్షన్ అల్కజార్ ఎస్‌యూవీని తయారు చేయనుంది. హ్యుందాయ్ అల్కజార్ క్రెటా మోడల్ ఆధారంగా తయారవుతున్నప్పటికీ, ఈ రెండు మోడళ్ల మధ్యలో పలు డిజైన్ వ్యత్యాసాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

హ్యుందాయ్ రిలీజ్ చేసిన అల్కజార్ సైడ్ స్కెచ్‌ను గమనించినట్లయితే, ఇది చాలా పొడవుగా కనిపిస్తుంది. అలాగే, క్రెటాలో కనిపించిన గుండ్రని ఆకారంతో పోలిస్తే, అల్కజార్ మరింత ఫ్లాట్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని హ్యుందాయ్ యొక్క గ్లోబల్ డిజైన్ ఐడెంటిటీ ఆఫ్ సెన్సస్ స్పోర్టినెస్‌పై అభివృద్ధి చేశారు. ఈ డిజైన్ లాంగ్వేజ్‌ను మనం ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ మోడళ్లలో చూశాం.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

హ్యుందాయ్ అల్కాజార్‌లో వెనుక డోర్ పరిమాణాన్ని పెంచినట్లుగా కనిపిస్తుంది. ప్రయాణీకులు మూడవ వరుసలోనికి సులువుగా ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు వీలుగా ఈ మార్పు చేశారు. క్రెటాతో పోలిస్తే, అల్కజార్‌లో పెరిగిన కొలతల కారణంగా దీని వెనుక డిజైన్ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది.

MOST READ:200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

క్రెటాలో వెనుక వైపు రూఫ్ వాలుగా ఉంటుంది, అదే అల్కజార్‌లో అయితే చదునుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రూఫ్‌తో పాటుగా అమర్చిన రియర్ స్పాయిలర్, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, విశిష్టమైన డిజైన్‌తో కూడిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు వ్రాప్అరౌండ్ టెయిల్ ల్యాంప్స్ వంటి డిజైన్ ఫీచర్లను ఈ చిత్రాలలో చూడొచ్చు.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

హ్యుందాయ్ అల్కజార్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఇది చూడటానికి ఇంచు మించు ప్రస్తుత తరం క్రెటా మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ గ్రిల్‌లో పెద్ద మార్పు ఉండొచ్చు. పెరిగిన కొలతల కారణంగా, క్రెటాతో పోలిస్తే అల్కజార్ యొక్క వీల్‌బేస్ 20 మి.మీ మరియు పొడవు 30 మి.మీ ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

ఇంటీరియర్ ఫీచర్లలో 5-సీటర్ క్రెటాలో కనిపించిన దాని కన్నా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అల్కజార్‌లో ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, 360 డిగ్రీ కెమెరా, లెదర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

సీటింగ్ ఆప్షన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ అల్కాజార్ 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కావచ్చని తెలుస్తోంది. 6-సీటర్ వెర్షన్‌లో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తుండగా, 7-సీటర్ వెర్షన్‌లో రెండవ వరుసలో 60:40 స్ప్లిట్ ఫంక్షన్‌తో కూడిన బెంచ్-టైప్ సీట్ లభ్యం కానుంది.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

ప్రస్తుత తరం క్రెటాలో ఉపయోగిస్తున్న ఇంజన్లనే కొత్త హ్యుందాయ్ అల్కజార్‌లోనూ ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇది రెండు ఇంజన్ ఆప్షన్లలో రావచ్చని తెలుస్తోంది. అందులో ఒకటి 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరొకటి 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

ఇందులోని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 5-సీటర్ క్రెటాలో కనిపించిన 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను అల్కజార్‌లో ఆఫర్ చేయకపోవచ్చని తెలుస్తోంది.

ఇదే హ్యుందాయ్ 7-సీటర్ ఎస్‌యూవీ; 'అల్కజార్' ఫస్ట్ అఫీషియల్ పిక్చర్స్

ఇక గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్, సిక్స్-స్పీడ్ డిసిటి మరియు సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో కొత్త టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యూవీ500, ఎమ్‌జి హెక్టర్ ప్లస్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Hyundai Alcazar 7-Seater SUV First Official Sketches Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X