రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ Hyundai, భారత మార్కెట్లో తమ తొలి N-Line కారును విడుదల చేయనున్నట్లు ఇటీవల ధృవీకరించిన సంగతి తెలిసినదే. కాగా, తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు Hyundai i20 N-Line కారును రేపు (ఆగస్ట్ 23వ తేదీన) దేశీయ విపణిలో ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

ఈ కంపెనీ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ N-Line కార్లను విక్రయిస్తోంది. కాగా, భారత మార్కెట్లో తొలి Hyundai i20 N-Line కారు విడుదల ద్వారా కంపెనీ తమ N సిరీస్ కార్లను ఇక్కడి వినియోగదారులకు కూడా పరిచయం చేయనుంది. దీని తర్వాత కంపెనీ Hyundai Elantra, Tucson మరియు Grand i10 Nios వంటి ఇతర మోడళ్లలో కూడా N-Line వెర్షన్‌లను విడుదల చేయనుంది.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ Hyundai i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ తో పోల్చుకుంటే, ఈ కొత్త i20 N-Line చాలా స్పోర్టీగా ఉంటుంది. ఈ కారులో కనిపించే 5 ప్రత్యేక విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

1. స్పోర్టీ మేక్ఓవర్

Hyundai i20 N-Line కారును కంపెనీ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఈ కొత్త i20 N-Line "చెకర్డ్ ఫ్లాగ్" మెష్ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ముందు మరియు వెనుక భాగంలో మరింత స్పోర్టీ బంపర్‌లు ఉంటాయి. ఇవే కాకుండా, ఈ కారులో ప్రత్యేకమైన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ అండ్ రియర్ N-Line లోగో మరియు క్రోమ్ ట్విన్-ఎగ్సాస్ట్ మఫ్లర్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

2. క్యాబిన్‌లో మార్పులు

కొత్త Hyundai i20 N-Line ఎక్స్టీరియర్‌లలో మార్పులు ఉన్నట్లుగానే, ఇంటీరియర్‌లలో కూడా పలు మార్పులు ఉండనున్నాయి. ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, గేర్ నాబ్ మరియు స్టీరింగ్ వీల్‌పై రెడ్ కలర్ స్టిచింగ్, మెటల్ పెడల్స్, N-Line బ్యాడ్జింగ్ వంటి డీటేలింగ్స్‌ను ఇంటీరియర్‌లో చూడొచ్చు.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

అంతేకాకుండా, స్టాండర్డ్ i20 కారులో లభించే అన్ని ఇతర ఫీచర్లను ఈ కారులో కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది. వీటిలో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో), బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు ఏడు స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

3. ఇంజన్

కొత్త Hyundai i20 N-Line లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ప్రస్తుత మోడల్ లో ఉపయోగిస్తున్న అదే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌నే ఈ కొత్త కారులోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ స్పోర్టీ వేరియంట్‌లోని సస్పెన్షన్, ఇంజన్ రెస్పాన్స్, గేర్ రేషియో మరియు ఎగ్సాస్ట్ నోట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేయవచ్చని సమాచారం.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

4. వేరియంట్స్

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, Hyundai i20 N-Line మోడల్‌ని మార్కెట్లో N6 మరియు N8 అనే రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు వేరియంట్‌లు కూడా iMT గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందించబడతాయి. అయితే, N8 వేరియంట్ లో మాత్రం డిసిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

5. ధర మరియు పోటీ

ఈ విభాగంలో Hyundai i20 N-Line కు ప్రస్తుతం నేరుగా ఎలాంటి పోటీ లేదు. వచ్చే సెప్టెంబర్ 2021 నాటికి ఈ కారు భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇక దీని ధర విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ i20 యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ధర కంటే ఇది సుమారు రూ.50,000 ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. దీని ఆధారంగా చూస్తే, i20 N-Line ధర సుమారు రూ.11.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉండొచ్చని అంచనా.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

భారీగా పెరిగిన Hyundai Creta ధరలు:

ఇదిలా ఉంటే Hyundai దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ Cretaధరలను భారీగా పెంచింది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ మోడల్ ధరలు సుమారు రూ.19,600 వరకు పెరిగాయి. ఈ మోడల్‌లో కంపెనీ ఇటీవలే ఓ సరసమైన ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌ను కూడా విడుదల చేసింది. కాగా, ఇప్పుడు ఆ వేరియంట్ ధర కూడా పెరిగింది.

రేపే Hyundai i20 N-Line ఆవిష్కరణ: ధర, ఫీచర్లు వివరాలు

ధరల సవరణ అనంతరం మార్కెట్లో Hyundai Creta రూ.10.16 లక్షల నుండి రూ.17.87 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అమ్మడవుతోంది. కంపెనీ ఎస్‌యూవీని రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. వీటిలో 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఐవిటి మరియు 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తున్నాయి.

Most Read Articles

English summary
Hyundai i20 n line is all set for indian debut on 24th august details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X