షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఇటీవల ఆవిష్కరించిన తమ ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) అమ్మకాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ ఈ కారులో అందించబోయే వేరియంట్‌ లకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడి చేసింది.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

తాజా సమాచారం ప్రకారం, Mahindra XUV700 మొత్తం 34 వేరియంట్లలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని వేరియంట్ల వివరాలు వెల్లడయ్యాయి. Mahindra XUV700 యొక్క ఈ వేరియంట్‌ లను వాటి ఇంజన్, సీటింగ్ మరియు ట్రిమ్ ఆప్షన్స్ ఆధారంగా విభజించబడ్డాయి.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

ప్రధానంగా చూస్తే, కొత్త Mahindra XUV700 MX3, AX3, AX5 మరియు AX7 అనే నాలుగు ట్రిమ్ లలో లభ్యమవుతుంది. ఇవి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ ల ఎంపికలో అందుబాటులో ఉంటుంది. కాగా, MX5 ట్రిమ్ కేవలం 3 వేరియంట్‌లకు పరిమితం చేయబడింది. ఇందులో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ మరియు డీజిల్ మాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 సీటర్ ఆప్షన్‌తో లభిస్తాయి.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

అలాగే, AX3 ట్రిమ్ ను 7 వేరియంట్‌ లుగా విభజించారు. వీటిలో పెట్రోల్ మాన్యువల్ 5 సీటర్, పెట్రోల్ మ్యాన్యువల్ 7 సీటర్, పెట్రోల్ ఆటోమేటిక్ 5 సీటర్, డీజిల్ మాన్యువల్ 5 సీటర్, డీజిల్ మాన్యువల్ 7 సీటర్, డీజిల్ ఆటోమేటిక్ 5 సీటర్ మరియు డీజిల్ ఆటోమేటిక్ 7 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. అదేవిధంగా, AX5 ట్రిమ్ ను కూడా 7 విభిన్న వేరియంట్లుగా విభజించారు.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

అలాగే, ఈ ఎస్‌యూవీ యొక్క AX7 ట్రిమ్ ను 17 వేరియంట్లుగా విభజించారు. ఇదే అత్యధిక వేరియంట్లు కలిగిన ట్రిమ్. ఇలా మొత్తంగా 34 వేరియంట్లతో Mahindra XUV700 ఎస్‌యూవీని అందించనున్నారు. ఇందులో సగం వేరియంట్లు ఈ టాప్-ఎండ్ మోడళ్లలో అందుబాటులో ఉంచబడ్డాయి. టాప్-ఎండ్ వేరియంట్లలో అత్యధిక ఫీచర్లు, పరికరాలు మరియు కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ లభిస్తాయి.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

ప్రస్తుతం Mahindra XUV700 ఎస్‌యూవీని 5 ఆకర్షణీయమైన రంగులలో తీసుకురాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త XUV700 యొక్క బేస్ వేరియంట్‌ ను MX లేదా MX సిరీస్ అనే పేరుతో పిలుస్తారు మరియు ఇది ఒకే ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

మహీంద్రా యొక్క లేటెస్ట్ అడ్రినాక్స్ సిరీస్ టెక్నాలజీతో మొత్తం మూడు ట్రిమ్‌లను అందుబాటులో ఉంచారు. అవి: AX3, AX5, AX7. మహీంద్రా ఎక్స్‌యూవీ700 బేస్ వేరియంట్ అయిన MX పెట్రోల్ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. అలాగే, ఇందులో AX5 పెట్రోల్ ట్రిమ్ ప్రారంభ ధర రూ. 14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

Mahindra XUV700 ఎస్‌యూవీని కంపెనీ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా, డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్‌లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 155 బిహెచ్‌పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

ఇకపోతే, రెండవది 182 బిహెచ్‌పి పవర్ మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్లన్నీ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి. ఇందులోని డీజిల్ వేరియంట్‌లో మాత్రమే డ్రైవ్ మోడ్‌ లు ఇవ్వబడ్డాయి. వీటిలో మొత్తం నాలుగు డ్రైవింగ్ మోడ్‌ లు ఉంటాయి. అవి: జిప్ (ఎకో), జాప్ (కంఫర్ట్), జూమ్ (స్పోర్ట్ / డైనమిక్) మరియు కస్టమ్.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

Mahindra XUV700 ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సౌండ్ సిస్టమ్ కోసం కోసం సోనీ బ్రాండ్ నుండి గ్రహించిన అధునాతన సౌండ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. దీనితో పాటుగా ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, ఇ-సిమ్ ఆధారిత కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, వాయిస్ అసిస్టెంట్, యాంబియంట్ లైటింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ మొదలైనవి ఉన్నాయి.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

అంతేకాకుండా, Mahindra XUV700 లో అనేక అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఖారులో 7 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హెడ్‌లైట్ బూస్టర్ ఉన్నాయి.

షాకింగ్.. 34 వేరియంట్లలో విడుదల కానున్న Mahindra XUV700..

ఇంకా ఇందులో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెడ్ సిస్టమ్ (ఏడిఏఎస్ లేదా అడాస్) ను కూడా కంపెనీ అందిస్తోంది. అంటే, ఇది లెవల్ వన్ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ అనేక రకాల సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఈ కారులో రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది మహీంద్రా నుండి ఇప్పటి వరకూ వచ్చిన ఎస్‌యూవీల కన్నా చాలా భిన్నంగా మరియు ఫీచర్-రిచ్ గా ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 to be available in 34 variants details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X