భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

ఇటలీకి చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ మాసేరటి తమ అధునాతన 'లెవాంటే' హైబ్రిడ్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి మాసేరటి లెవాంటే హైబ్రిడ్ కారు దేశీయ విపణిలో విడుదల కానుంది.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

లెవాంటే మాసేరటి బ్రాండ్ యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ మరియు రెండవ హైబ్రిడ్ మోడల్. ఇది బ్రాండ్ యొక్క లైనప్‌లో హైబ్రిడ్ వ్యవస్థతో పాక్షికంగా విద్యుదీకరించబడిన రెండవ వాహనం. ఈ లైనప్‌లో మొదటిది మాసేరటి ఘిబ్లి హైబ్రిడ్.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

మాసేరటి లెవాంటే దాని విలక్షణమైన ఇటాలియన్ డిజైన్‌తో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి ఈ ఎస్‌యూవీ కొద్దిగా కాంపాక్ట్‌గా కనిపించినప్పటికీ, కారు లోపల చాలా విశాలమైన క్యాబిన్ మరియు బూట్ స్పేస్ ఉంటుంది. మొదటి చూపులోనే ఇది కస్టమర్లను ఆకట్టుకునే శైలిని కలిగి ఉంది.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

ఈ మాసేరటి లెవాంటే హైబ్రిడ్ వెర్షన్ కావడంతో, ఈ కారు డిజైనర్లు దీని హైబ్రిడ్ వ్యవస్థను హైలైట్ చేసేందుకు దాని ఎక్స్టీరియర్ డిజైన్‌లో కొన్ని బ్లూ యాక్సెంట్స్‌ను కూడా జతచేశారు. స్టాండర్డ్ లెవాంటే ఎస్‌యూవీకి మరియు ఈ హైబ్రిడ్ వెర్షన్ లెవాంటేకి కొద్దిపాటి డిజైన్ మార్పులు ఉన్నాయి.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

మాసేరటి లెవాంటే హైబ్రిడ్ కారు యొక్క ఎక్స్టీరియర్ డిజైన్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఇందులో రీడిజై చేయబడిన హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, ఫ్రంట్, గ్రిల్, బ్లూ కలర్ బ్రేక్ రోటర్లు మరియు సరికొత్త 21 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్‌ను ప్రత్యేకమైన ‘అజ్జురో ఆస్ట్రో' అనే కలర్‌లో పెయింట్ చేశారు.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

మాసేరటి లెవాంటే హైబ్రిడ్ కారు ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఈ కారులో ప్రీమియం లెథర్ అప్‌‍హోలెస్ట్రీ, సీట్లు మరియు డోర్ ట్రిమ్స్‌పై బ్లూ కలర్ స్టిచింగ్, పెద్ద 8.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటుగా లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

అయినప్పటికీ, ఈ కారులోని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మాత్రం ఓల్డ్ స్కూల్ డిజైన్‌లానే అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణంగా, మాసేరటి లెవాంటే హైబ్రిడ్ కారులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌కి బదులుగా ట్రెడిషనల్ అనలాగ్ డయల్‌లను కలిగి ఉంటుంది.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

ఇక ఇంజన్ విషయానికి వస్తే, మాసేరటి లెవాంటే హైబ్రిడ్ కారులో2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 330 బిహెచ్‌పి శక్తిని మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్ మాసేరటి లెవాంటే హైబ్రిడ్‌ను మరింత శక్తివంతంగా మరియు మరింత సమర్థవంతంగా మారుస్తుంది.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

మాసేరటి రేసింగ్ వారసత్వాన్ని ప్రతిధ్వనించే బ్రాండ్ కాబట్టి, ఈ సరికొత్త లెవాంటే హైబ్రిడ్ కారులో నిర్మాణంలో బరువు పంపిణీని సమర్థవంతంగా నిర్వించేందుకు గాను, కంపెనీ ఇంజనీర్లు ఈ కారులో బ్యాటరీ ప్యాక్‌ని వెనుక భాగంలో అమర్చారు.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీ కేవలం ఆరు సెకన్లలోపే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 240 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది ఈ విభాఘంలో పోర్ష్ కయూన్, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు ఆడి క్యూ7 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

భారత్‌లో మాసేరటి లెవాంటే హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు విడుదల వివరాలు వెల్లడి

ఇదిలా ఉంటే, మాసేరటి తమ సరికొత్త ఎమ్‌సి20 సూపర్ స్పోర్ట్స్ కారును కూడా భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మిడ్-ఇంజన్ స్పీడ్‌స్టర్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. - ఈ కారుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Maserati To Launch Levante Hybrid Supercar In India: Timeline Details Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X