భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్; పూర్తి వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఎంతగానో ఎదురుచూస్తున్న ఎ-క్లాస్ లిమోసిన్‌ను ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ ప్రారంభ ధర రూ. 39.90 లక్షలు (ఎక్స్-షోరూమ్,ఇండియా). ఎ-క్లాస్ లిమోసిన్ అనేది భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ ఆఫర్.

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బెంజ్ లిమోసిన్ సెడాన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఏ200, ఏ200డి మరియు AMG A 35 4MATIC వేరియంట్లు. A200d మరియు AMG A 35 4MATIC ధరలు వరుసగా రూ. 40.90 లక్షలు మరియు రూ. 56.24 లక్షల వరకు ఉంటాయి.

A-Class Price
200 ₹39.90 Lakhs
200d ₹40.90 Lakhs
AMG A 35 4Matic ₹56.24 Lakhs
భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

కొత్త ఎ-క్లాస్ సెడాన్ యొక్క కలర్ ఆప్సన్స్ విషయానికి వస్తే, ఇది పోలార్ వైట్, మోజావే సిల్వర్, మౌంటెన్ గ్రే, కాస్మోస్ బ్లాక్, డెనిమ్ బ్లూ, మరియు ఇరిడియం సిల్వర్ అనే కలర్స్ లో లభిస్తాయి. వీటితో పాటు AMG A 35 వేరియంట్ ని మాత్రం అదనపు ఖర్చుతో ప్రత్యేకమైన ఎల్లో కలర్ ఆప్సన్ తో అందిస్తున్నారు.

MOST READ:హైదరాబాద్‌ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

ఇంషులో ఉన్న ఇరిడియం సిల్వర్ పెయింట్ స్కీమ్ వేరియంట్ మినహా, మిగిలిన కలర్ వేరియంట్లు గోధుమరంగు ఇంటీరియర్స్ కలిగి ఉంటుంది. అయితే ఇరిడియం సిల్వర్ పెయింట్ స్కీమ్ లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ స్కీమ్ ఉంటుంది. అదేవిధంగా AMG మోడల్ సెడాన్ యొక్క స్టాండర్డ్ వేరియంట్ కంటే స్పోర్టియర్ థీమ్‌తో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది.

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

ఎ-క్లాస్ లిమోసిన్ వేరియంట్‌ను బట్టి మూడు పవర్‌ట్రైన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. మొదట A200 మోడల్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 1620 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి పవర్ మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డిసిటితో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

A200d వేరియంట్‌ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ కలిగి ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క సరికొత్తది. ఇది 1400 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి పవర్ మరియు 3200 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 8-స్పీడ్ DCT తో జతచేయబడుతుంది.

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

ఇక AMG A 35 4Matic మోడల్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 304 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిసిటి ట్రాన్స్మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపుతారు. ఈ కారు కేవలం 4.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

మెర్స్డ్స్ బెంజ్ యొక్క A 35 4MATIC దేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన రెండవ AMG మోడల్. A200 పెట్రోల్ వేరియంట్‌ యొక్క మైలేజ్ విషయానికి వస్తే ARAI రేటెడ్ ప్రకారం ఒక లీటరుకు 17.50 కిమీ పరిధిని, A200d వేరియంట్ ఒక లీటరుకు 21.35 కిమీ మైలేజ్ అందిస్తుంది.

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

ఎ-క్లాస్ లిమోసిన్ చాలా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెడాన్ యొక్క ఎక్స్టీరియర్ విషయానికి వస్తే, ఇది ఎల్‌ఈడీ లైటింగ్ ఆల్‌రౌండ్, 17-ఇంచ్ టూ-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెర్సిడెస్ బెంజ్ లోగోతో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ గ్రిల్ మరియు మధ్యలో బూట్-లిడ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

MOST READ:ఈ-చలాన్ విధించారని పోలీసుల క్యాప్ & ఎటిఎం లాక్కుని, బోరున ఏడ్చిన మహిళ [వీడియో]

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

ఎ-క్లాస్ లిమోసిన్ యొక్క ఇంటీరియర్ గమనించినట్లయితే, ఇందులో ఉన్న క్యాబిన్ చాలా విశాలవంతంగా ఉండటమే కాకుండా లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వంటింవి ఉన్నాయి. ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ కస్టమైజబుల్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎంబియుఎక్స్ వాయిస్ అసిస్ట్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వున్నాయి.

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

ఎ-క్లాస్ లిమోసిన్‌లో మంచి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, బ్లైండ్‌స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, హిల్-హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, పెరీమీటర్ / వాల్యూమెట్రిక్ అలారం, మెర్సిడెస్ మి బ్రేక్‌డౌన్ & క్రాష్ అసిస్ట్ మరియు ప్రీ-సేఫ్ హెడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

భారత్‌లో ఎ-క్లాస్ లిమోసిన్ విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్ ; పూర్తి వివరాలు

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 2-సిరీస్ గ్రాన్ కూపే మరియు రాబోయే ఆడి ఎ 3 సెడాన్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. మేము ఇటీవల మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ సెడాన్ ని గోవా వీధుల్లో డ్రైవ్ చేసాము. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mercedes Benz A-Class Limousine Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X