Mercedes Benz AMG A45 S టీజర్ వచ్చేసింది.. ఇక లాంచ్ ఎప్పుడో

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో త్వరలో లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ అయిన మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి ఏ45 ఎస్ (Mercedes AMG A45 S) ని విడుదల చేయాడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే దీనికంటే ముందు కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క టీజర్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన ఈ హ్యాచ్‌బ్యాక్ టీజర్ లో విడుదలకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ త్వరలో విడుదలచేయనుంది. Mercedes-Benz ఈ టీజర్‌లో భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన మరియు అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్‌లో ఆడ్రినలిన్ యొక్క తక్షణ రష్‌ని ఆస్వాదించండి, మరింత తెలుసుకోవడానికి వేచి ఉండండి అని తెలిపింది. ఇది భారత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ కాబోతోందని కంపెనీ పేర్కొంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4-సిలిండర్ సిరీస్ ప్రొడక్షన్ ఇంజన్ మెర్సిడెస్ AMG A45 S లో ఉపయోగించబడింది అని కంపెనీ తెలిపింది. Mercedes-AMG A45 S లో అద్భుతమైన ఫీచర్, దాని శక్తివంతమైన ఇంజన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కావున ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

Mercedes-AMG A45 S హ్యాచ్‌బ్యాక్‌లో 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 421 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ ఇంజన్‌తో AMG A45 S భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే కంపెనీ విక్రయిస్తున్న అత్యంత శక్తివంతమైన 4-సిలిండర్ హ్యాచ్‌బ్యాక్‌ కానుంది. కావున ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ ఎక్కువ మంది వాహన ప్రియులను ఆకర్షిస్తుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

ప్రస్తుతం కంపెనీ యొక్క A45 AMG అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించబడుతోంది. ఇది 387 బిహెచ్‌పి పవర్ లో స్పెక్ స్టాండర్డ్ మోడల్‌లో కూడా అందుబాటులో ఉంది. అయితే మెర్సిడెస్ AMG A35 సెడాన్ నుండి ఒక ముఖ్యమైన దశగా పూర్తి స్థాయి S మోడల్‌ను భారతదేశంలో పరిచయం చేస్తుంది. దీని ఇంజిన్ యొక్క శక్తి 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పంపబడుతుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

ఈ ఇంజన్ పవర్ సహాయంతో, కొత్త Mercedes-AMG A45 S కేవలం 3.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా ఈ కారు యొక్క గరిష్ఠ వేగం 270 కిమీ/గం. AMG A45 S లో 4 మ్యాటిక్ ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌కు మల్టీ-ప్లేట్ క్లచ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది AMGకి టార్క్ కంట్రోల్ ఫంక్షన్‌ని పొందడంలో సహాయపడుతుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

Mercedes-AMG A45 S కారులో 360 మి.మీ ఫ్రంట్ డిస్క్ మరియు 330 మి.మీ రియర్ డిస్క్ కలిగి ఉంటుంది. కావున అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందించడంలో ఇది చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రయాణానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

Mercedes-AMG A45 S అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కారు స్టైలింగ్ పరంగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న AMG A35 కంటే మంచి బాడీ స్టైల్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది దాని ముందుపతి మోడల్స్ కంటే కూడా చాలా దూకుడుగా కనిపిస్తుంది. A45 S యొక్క ముందు భాగంలో పనామెరికానా గ్రిల్, మరింత స్పష్టమైన ఏరో ఎలిమెంట్స్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో కూడిన కొత్త బంపర్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ స్ప్లిటర్‌ అంటి వాటిని పొందుతుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

అంతే కాకుండా ఈ లగ్జరీ మోడల్ రూఫ్-మౌంటెడ్ రియర్ వింగ్, డ్యూయల్ ట్విన్-ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ మరియు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, కావున చాలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఎక్స్టీరియర్ డిజైన్ చూపరులను ఒక్కరికే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

AMG A45 S టీజర్ విడుదల చేసిన Mercedes Benz

ఇక ఇంటీరియర్ డిజైన్‌ విషయానికి వస్తే, దీని క్యాబిన్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో అదే ట్విన్ 10.25 ఇంచెస్ డిస్‌ప్లే కనిపిస్తుంది. ముందు భాగంలో స్పోర్ట్ సీట్లు చాలా అద్బుతంగా ఉన్నాయి. ఇందులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుని రక్షణను నిర్దారిస్తుంది.

Most Read Articles

English summary
Mercedes benz released teaser for new amg a45 s hatchback details
Story first published: Monday, November 15, 2021, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X