కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

MG Motor (ఎంజి మోటార్) కంపెనీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. కంపెనీ ఇప్పటికే MG Hector, MG Gloster వంటివి లాంచ్ చేసి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా వాహనాలలో కూడా అధునాత ఫీచర్స్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. కావున MG Motor కంపెనీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

MG Motor తన కొత్త ఎస్‌యూవీ అయిన MG Astor ని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కొత్త ఎస్‌యూవీలో ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్‌తో సహా అనేక సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లను కంపెనీ ఇటీవల వెల్లడించింది. అయితే కంపెనీ ఇప్పుడు MG Astor ఎస్‌యూవీలోని ఇంటీరియర్ యొక్క కొన్ని ఇతర వివరాలు కూడా వెల్లడించింది.దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, MG Astor డ్యూయల్ టోన్ ఇంటీరియర్ స్కీమ్‌తో వస్తుంది. ఇందులో భాగంగానే ఈ కొత్త Astor బ్లాక్ అండ్ బ్రౌన్ స్కీమ్ పొందుతుంది. ఇది డాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లు మరియు సీట్లపై కూడా కనిపిస్తుంది. డాష్‌బోర్డ్, సెంట్రల్ టన్నెల్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ బ్రౌన్ సాఫ్ట్ లెదర్‌తో కప్పబడి ఉంటాయి.

ఇందులోని ఎయిర్-వెంట్స్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ చుట్టూ సిల్వర్ ఫినిష్ ఇవ్వబడింది. కంపెనీ ఇందులో ఇండ్యూజువల్ అసిస్టెంట్‌ను డాష్‌బోర్డ్ ఎగువన ఉంచింది. సెంట్రల్ కన్సోల్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. డీఐతో పాటు ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో వస్తుంది.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

కొత్త MG Astor లో ఏసీ వెంట్‌లు టచ్‌స్క్రీన్ పైన ఉంచబడ్డాయి. కంట్రోల్ స్విచ్‌లు స్క్రీన్ క్రింద ఉంచబడ్డాయి. MG Astor లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇవ్వబడింది, ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త ఎస్‌యూవీకి లెదర్ చుట్టిన మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటివి కూడా లభిస్తాయి.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎస్‌యూవీకి కంపెనీ ఆడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ అనేది ఒక రాడార్ టెక్నాలజీ. ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. కంపెనీ ఇదివరకే ఈ టెక్నాలజీని Gloster ఎస్‌యూవీలో ఉపయోగిస్తుంది.

ఆడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీతో, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, కొలీషియన్ వార్ణింగ్, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, రియర్ డ్రైవ్ అసిస్ట్, లేన్ ఫంక్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ వంటి అనేక అధునాతన ఫీచర్లు కారులో అందించబడ్డాయి.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

MG Motor కంపెనీ 'Astor' పేరుతో MG ZS పెట్రోల్ మోడల్‌ని విడుదల చేసింది. MG ZS ఎస్‌యూవీ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడవుతోంది. పెట్రోల్ ఎస్‌యూవీలో తిన్ బంపర్‌లు, హానీ కూంబ్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

ఈ కొత్త ఎస్‌యూవీలో పనోరమిక్ సన్‌రూఫ్, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ విడుదల చేయనున్న కొత్త MG Astor యొక్క ఇంజిన్‌ స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం అందించలేదు. కానీ ఇందులో కేవలం 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఇవ్వబడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ ఇంజిన్ 163 బిహెచ్‌పి పవర్ మరియు 230 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి అందిస్తుంది. ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ తో అందుబాటులో ఉంటుంది.

కొత్త MG Astor ఇంటీరియర్ & కీ ఫీచర్స్ ఇవే.. చూసారా!!

కంపెనీ నివేదికల ప్రకారం కొత్త MG Astor 2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీని ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 11 లక్షల నుంచి 17 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో ఇది లాంచ్ అయిన తర్వాత Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq మరియు Volkswagen Taigun వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తానికి ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన అద్భుతమైన ఎస్‌యూవీ.

Most Read Articles

English summary
Mg astor interior details revealed price expectation launch and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X