Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

ప్రముఖ వాహన తయారీ సంస్థ MG Motor India (ఎంజి మోటార్ ఇండియా) దేశీయ మార్కెట్లో MG Astor అనే కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కొత్త SUV అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కంపెనీ ఈ కొత్త Astor గురించి మరింత సమాచారాన్ని విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

ప్రముఖ వాహన తయారీ సంస్థ MG Motor India (ఎంజి మోటార్ ఇండియా) దేశీయ మార్కెట్లో MG Astor అనే కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కొత్త SUV అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకునన్నాం. ఇప్పుడు కంపెనీ ఈ కోట Astor గురించి మరింత సమాచారాన్ని విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

కంపెనీ ఇదివరకే ఈ ఈ కొత్త SUV లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి స్టాండర్డ్ గా అందించనుంది. కావున MG Astor యొక్క ప్రతి వేరియంట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

కంపెనీ ఈ కొత్త SUV లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్సీ అసిస్టెంట్ మరియు ఫస్ట్ అటానమస్ లెవల్-2 టెక్నాలజీ వంటి వాటిని మొదటిసారి ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ కారులో 10.25 ఇంచెస్ డిస్‌ప్లేని అందిస్తుంది. ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

MG Astor యొక్క ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో విషయానికి వస్తే, ఇది మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేయగలదు. అంతే కాకుండా ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఈ సిస్టం వల్ల డ్రైవర్ కారు స్టీరింగ్ వీల్‌పై చేతులు ఉంచి డ్రైవింగ్ చేస్తూ కూడా కారులోని అన్ని ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

కంపెనీ ఈ కొత్త SUV ని త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. కావున ఈ SUV ని ఇటీవల టెస్ట్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే MG Astor ఇటీవల పర్వత ప్రాంతాలలో టెస్ట్ చేస్తూ కనిపించింది. ఈ MG Astor SUV కంపెనీ యొక్క MG ZS EV ఆధారంగా రూపొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

టెస్టింగ్ సమయంలో బయటపడ్డ కొన్ని ఫొటోల ప్రకారం, దీని డిజైన్, ఇంటీరియర్ మొదలైనవి గుర్తించబడ్డాయి. ఈ కారు యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో MG బ్రాండ్ లోగో కవర్ చేయబడింది. అయితే ఈ కొత్త SUV యొక్క గ్రిల్ మరియు హెడ్‌లైట్ చూడవచ్చు చూడవచ్చు.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

MG Astor లో LED యూనిట్స్ ఉపయోగించబడ్డాయి. వాటి క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి. అంతే కాకుండా బంపర్‌పై లైన్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇది కారుకి మంచి దూకుడు రూపాన్ని అందిస్తుంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 5-స్పోక్ అల్లాయ్ వీల్ చూడవచ్చు, ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇండికేటర్‌తో పాటుగా ORVM లో చూడవచ్చు.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

MG Astor యొక్క డోర్ హ్యాండిల్ మరియు రూఫ్ రైల్ కూడా ఇక్కడ గమనించవచ్చు. ఈ కొత్త SUV యొక్క వెనుక భాగంలో టైల్ లైట్ మరియు MG లోగో వంటివి చూడవచ్చు. దీనికి ఎగువన స్టాప్ లైట్ మరియు దిగువన స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. దీనిలో ఎక్కువ భాగం కాన్సెప్ట్ మోడల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నాము.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

MG Astor యొక్క ఇంటీరియర్‌ చాలా సరళమైన డిజైన్ కలిగి ఉంటాయి. ఇందులో రెండు వైపులా రౌండ్ ఏసీ వెంట్‌లు ఉన్నాయి. డాష్‌బోర్డ్‌ కూడా చాలా కు చాలా సరళమైన డిజైన్ ఇవ్వబడింది మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో ఉంచబడింది మరియు గేర్‌బాక్స్ దాని దిగువన ఉంచబడింది.

Astor గురించి కొత్త న్యూస్ వెల్లడించిన MG Motor

MG Motor కంపెనీ ఈ కొత్త MG Astor SUV ని పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది. కావున ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు మాన్యువల్ ఆప్షన్‌తో అందించబడుతుంది. అయితే కంపెనీ దీని గురించి అధికారిక సమాచారం అందించలేదు.

Most Read Articles

English summary
Mg astor suv to get apple carplay and android auto as standard in all variants details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X