మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG Motor India (ఎంజి మోటార్ ఇండియా) దేశీయ మార్కెట్లో MG Astor అనే కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ కొత్త SUV అనేక అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుందని మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కంపెనీ ఈ కొత్త Astor గురించి రోజు రోజుకి కొత్త కొత్త అప్డేట్స్ అందిస్తోంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

కొత్త MG Astor 2021 సెప్టెంబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడుతుంది. ఈ కొత్త MG Astor SUV లో పాటలు మరియు వీడియోల కోసం ఇప్పుడు JioSaavn యాప్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త SUV లో ఇప్పటికే 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందించినట్లు తెలుసుకున్నాం. అంతే కాకూండా ఇది ఐ- స్మార్ట్ హబ్ సహాయంతో నిర్వహించబడుతుంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

దేశీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీతో తీసుకువచ్చే మొదటి కారు ఈ MG Astor అవుతుంది. దీని సహాయంతో మీ వాయిస్ కమాండ్స్ ద్వారా అనేక పనులను నిర్వహించవచ్చు. అంటే కారులో వాయిస్ కమాండ్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయడం మరియు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం వంటివి చేయవచ్చు.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత దీపా మాలిక్ వాయిస్ ఈ ఎస్‌యూవీలో ఉపయోగించబడింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ ఇటీవల వెల్లడించింది. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి కూడా MG Astor యొక్క అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG Astor యొక్క ఇంటీరియర్‌ చాలా సరళమైన డిజైన్ కలిగి ఉంటాయి. ఇందులో రెండు వైపులా రౌండ్ ఏసీ వెంట్‌లు ఉన్నాయి. డాష్‌బోర్డ్‌ కూడా చాలా కు చాలా సరళమైన డిజైన్ ఇవ్వబడింది మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మధ్యలో ఉంచబడింది మరియు గేర్‌బాక్స్ దాని దిగువన ఉంచబడింది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG Astor SUV లో అటానమస్ లెవల్ -2 సిస్టమ్‌ తీసుకురాబడుతుంది. కంపెనీ రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది, దీని కోసం ఈ-సిమ్ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ కోసం ఒక చిన్న రోబోట్ ఉంటుంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG Astor అటానమస్ లెవల్-2 కింద, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ ఇవ్వబడుతుంది. ఇది కారు డ్రైవ్‌ను మెరుగ్గా మరియు సురక్షితంగా చేయడానికి పని చేస్తుంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG Astor కు ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ అందించబడుతుంది, ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త SUV దేశీయ మార్కెట్లో విడుదలైతే అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్న మొదటి SUV కానుంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

కొత్త MG Astor SUV కేవలం పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కావచ్చు. దీనిని 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు మాన్యువల్ ఆప్షన్‌తో అందించవచ్చు.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG మోటార్ కొత్త Astor SUV ని ఇప్పటికే అనేక ప్రాంతాల్లో టెస్ట్ చేస్తోంది. MG Astor అనేది MG ZS EV యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ఆధారపడిన పెట్రోల్ SUV. ఇది మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో తీసుకురానున్న కంపెనీ యొక్క నాల్గవ SUV. MG ఆస్టర్ దేశంలో అత్యంత ఆధునిక సాంకేతిక కారు, కంపెనీ దాని ఫీచర్లు మరియు పరికరాల గురించి మొత్తం సమాచారాన్ని సెప్టెంబర్ 15 న అందిస్తుంది.

మ్యూజిక్ & వీడియోల కోసం MG Astor లో కొత్త యాప్; అదేంటో తెలుసా..!!

MG మోటార్ కంపెనీ ప్రవేశపెట్టనున్న కొత్త MG Astor ఆటో ప్రపంచంలోనే అధునాతన ఫీచర్స్ కలిగిన SUV గా అవతరించనుంది. ఇది కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. MG Astor పండుగ సీజన్‌లో లాంచ్ చేయబడే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు MG Astor పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. కానీ కంపెనీ దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని త్వరలో అందిస్తుంది.

Most Read Articles

English summary
Mg astor to get jiosaavn app for music streaming details
Story first published: Monday, September 13, 2021, 16:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X