Just In
- 2 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 5 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 6 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 7 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Sports
సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్.. ఐపీఎల్ 2021 నుంచి స్టార్ పేసర్ ఔట్! ఆందోళనలో ఫాన్స్!
- News
కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ
- Finance
Forbes 30 under 30 list: ఇద్దరు హైదరాబాదీలకు చోటు
- Movies
ఆయన ఊర మాస్.. ఆ అద్భుతమైన అనుభవానికి థ్యాంక్స్.. రకుల్ ప్రీత్ సింగ్ హాట్ కామెంట్స్
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మా కార్లు కావాలా? అయితే, మూడు నెలలు ఆగండి: ఎమ్‌జి మోటార్స్
చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎమ్‌జి మోటార్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కార్లకు భారీ డిమాండ్‌ను దక్కించుకుంటోంది. దీంతో, ఈ వాహనాలకు వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోతోంది. తమ కార్లు కావాలంటే, కస్టమర్లు 2-3 నెలలు ఆగాల్సిందేనని కంపెనీ తేల్చి చెప్పేస్తోంది.

తాజాగా, ఇందుకు సంబంధించి ఓ ప్రకటను కూడా విడుదల చేసింది. ఎమ్‌జి బ్రాండ్ పట్ల మరియు తమ కార్ల పట్ల చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, తమ కార్లకు లభిస్తున్న అనూహ్యమైన డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఎమ్‌జి కార్ల వెయిటింగ్ పీరియడ్ 2-3 నెలలుగా ఉంటోదని కంపెనీ ప్రకటించింది.

ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నాలుగు ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇందులో ఓ ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ అనే నాలుగు ఎస్‌యూవీలను కంపెనీ విక్రయిస్తోంది. కొత్త వెయిటింగ్ పీరియడ్ అన్ని మోడళ్లకు వర్తిస్తుంది.
MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు

కస్టమర్లు తమ ఎమ్‌జి కార్ల బుకింగ్స్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ కోసం తమ అధీకృత డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చని, ఈ విషయంలో తమను అర్థం చేసుకున్నందుకు మరియు కస్టమర్ల ఓర్పుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్‌జి మోటార్ ఇండియా తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

వాస్తవానికి ఎమ్‌జి మోటార్ ఇండియా తమ వాహనాల వెయిటింగ్ పీరియడ్ పెరగటానికి కారణం భారీగా ఉన్న డిమాండ్ అని చెప్పినప్పటికీ, అసలు విషయం వేరే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ సెమీ కండక్టర్ల కొరతను ఎదుర్కుంటోంది. ఈ కారణం చేతనే ఎమ్‌జి కూడా తమ కార్ల వెయిటింగ్ పీరియడ్‌ను పెంచినట్లుగా చెబుతున్నారు.
MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న 1300 మహీంద్రా వెహికల్స్, ఇవే

ఎమ్‌జి బ్రాండ్ విక్రయిస్తున్న హెక్టర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. గత 2019లో మార్కెట్లోకి విడుదలైన ఈ మోడల్ ఇప్పటి వరకూ 50,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ సగటున ప్రతినెలా 4000-4500 యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. గడచిన ఫిబ్రవరి 2020 అమ్మకాల నివేదిక ప్రకారం, కంపెనీ గత నెలలో మొత్తం 4,329 కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఫిబ్రవరి 2020)తో పోలిస్తే ఇది 215 శాతం ఎక్కువ.
MOST READ:అర్ధరాత్రి స్విగ్గీ డెలివరీ బాయ్‌కి కెటిఎమ్ బైక్ ఇచ్చిన వ్యక్తి, ఎందుకో తెలుసా?

ఫిబ్రవరి 2021లో కూడా ఎమ్‌జి మోటార్ ఇండియా రికార్డు స్థాయిలో అమ్మకాలను మరియు బుకింగ్‌లను నమోదు చేసింది. గతేడాది మార్కెట్లో విడుదలైన అత్యంత సరసమైన ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ ఎమ్‌జి గ్లోస్టర్ మరియు తాజాగా వచ్చిన లేటెస్ట్ వెర్షన్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ల వలన కంపెనీ అమ్మకాలు మరింత బలపడ్డాయి.

ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న హెక్టర్ మరియు గ్లోస్టర్ ఎస్‌యూవీలలో అప్‌డేటెడ్ వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా వీటిని భారత రోడ్లపై పరీక్షించడం మొదలుపెట్టింది. కంపెనీ యొక్క హలోల్ (గుజరాత్) ప్లాంట్ సమీపంలో వీటిని పరీక్షిస్తున్నారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:మీ టూవీలర్‌కి సైడ్ మిర్రర్ లేదా.. అయితే భారీ జరిమానా తప్పదు, జాగ్రత్త..!