ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి (మోరిస్ గ్యారేజ్) మోటార్ కంపెనీ, భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి మంచి కస్టమర్ స్పందనను పొందుతోంది. ప్రస్తుతం ఈ బ్రాండ్ దేశీయ మార్కెట్లో నాలుగు ఉత్పత్తులను విక్రయిస్తోంది. అవి: హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ.

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

ఎమ్‌జి మోటార్స్ గడచిన 2019లో తమ హెక్టర్ ఎస్‌యూవీని విడుదల చేయటం ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. విశిష్టమైన ఫీచర్లు మరియు సరసమైన ధరతో మార్కెట్లోకి వచ్చిన ఎమ్‌జి హెక్టర్ కొద్ది సమయంలోనే పెద్ద విజయాన్ని సాధించింది. ఎమ్‌జి హెక్టర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో వివిధ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

ఎమ్‌జి హెక్టర్ మోడల్‌కి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఇటీవలే (2021లో) ఇందులో 7-సీటర్ వెర్షన్ హెక్టర్ ప్లస్ మోడల్‌ని మార్కెట్లో విడుదల చేసింది. అంతకు ముందు సంవత్సరంలో (2020లో) కంపెనీ టొయోటా ల్యాండ్ క్రూయిజర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి పెద్ద కార్లకు పోటీగా గ్లోస్టర్ అనే ప్రీమియం ఎస్‌యూవీని కూడా ఎమ్‌జి మోటార్స్ విడుదల చేసింది.

MOST READ:ఫిబ్రవరి 2021 కెటిఎమ్ బైక్స్ సేల్స్ రిపోర్ట్, ఇదే.. చూసారా..!

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

సరే ఇదంతా అటుంచితే, ప్రస్తుతం ఎమ్‌జి మోటార్స్ తమ హెక్టర్ మరియు గ్లోస్టర్ ఎస్‌యూవీలను తాజాగా భారత రోడ్లపై పరీక్షించడం మొదలుపెట్టింది. కొత్త 2021 హెక్టర్ మరియు గ్లోస్టర్ మోడళ్లను కంపెనీ హలోల్ (గుజరాత్) ప్లాంట్ సమీపంలో టెస్టింగ్ మోడ్‌లో గుర్తించబడ్డాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్లకు ఇవి అప్‌గ్రేడెడ్ మోడళ్లుగా విడుదల కావచ్చని సమాచారం.

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

ఈ రెండు మోడళ్లను కంపెనీ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా పరీక్షిస్తోంది. కొత్త హెక్టర్ మరియు గ్లోస్టర్ ఎస్‌యూవీలు రెండూ కూడా చిన్నపాటి డిజైన్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ రావచ్చని అంచనా. మరికొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

ఎమ్‌జి హెక్టర్ ఆధారంగా కంపెనీ ప్రవేశపెట్టిన 7-సీటర్ వెర్షన్ ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌కు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి, హెక్టర్ ప్లస్ ఉత్పత్తిని వేగవంతం చేయడంపై దృష్టి కేంద్రీకరించామని కంపెనీ తెలిపింది.

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

కాగా, ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ హెక్టర్, ఇటీవలే దేశంలో 50,000 యూనిట్ల మైలురాయిని దాటింది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్లో కంపెనీ 50,000 యూనిట్లకు పైగా హెక్టర్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేసింది. ఈ 50,000వ ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీని పూర్తిగా ప్లాంట్‌లోని మహిళా ఉద్యోగులే రూపొందించారు. ఎమ్‌జి హెక్టర్ ప్రస్తుతం ఈ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా ఉంది.

MOST READ:ఇండియన్ ఆర్మీలో చేరనున్న కళ్యాణి ఎమ్4 వాహనాలు, పూర్తి వివరాలు

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

ఇక, ఎమ్‌జి మోటార్ ఇండియా విక్రయిస్తున్న పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్‌ఎస్ విషయానికి వస్తే, కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త 2021 మోడల్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఇది పూర్తి ఛార్జ్‌పై 419 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో ఈ కారు ధర రూ.20.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

ఎమ్‌జి హెక్టర్ మరియు ఎమ్‌జి గ్లోస్టర్‌లలో అప్‌డేటెడ్ మోడళ్లు వస్తున్నాయ్!

కాగా, ఈ జెడ్ఎస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ పెట్రోల్ వెర్షన్ ఎస్‌యూవీని కూడా అభివృద్ధి చేస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పెట్రోల్ వెర్షన్ జెడ్ఎస్ మోడల్‌ను 'ఆస్టర్' (Astar) అని పిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. - పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:కారు డ్యాష్‌బోర్డుపై వార్నింగ్ లైట్స్ వచ్చాయా? కంగారుపడకండి, అవేంటో తెలుసుకోండి!

Source: Rushlane

Most Read Articles

English summary
New MG Hector And Gloster Models Spied Testing Near Halol Plant, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X