భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

జపాన్‌ రాజధాని నగరమైన టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లోని టేబుల్ టెన్నిస్ విభాగంలో 'భావినా పటేల్‌' భారతదేశానికి రజత పతకాన్ని తీసుకువచ్చింది. ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన భావినా పటేల్‌ను దేశం మొత్తం ఎంతగానో కొనియాడుతోంది. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన MG Motor ఒక అద్భుతమైన గిఫ్ట్ ప్రకటించింది. దీనిని MG Motor India ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ Rajiv Chaba తెలిపారు.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

టోక్యోలో జరిగిన పారాలింపిక్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా క్రీడాకారిణితో ఓడిన భావినా పటేల్‌ చివరికి రజత పతకం కైవసం చేసుకుంది. రజత పతకం సాధించిన భావినా పటేల్‌ విజయాన్ని దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. అయితే భావినా పటేల్‌ కి MG Motors ఏ కారును గిఫ్ట్ గా ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

MG Motor కంపెనీ త్వరలో దేశీయ మార్కెట్లో కొత్త కారును విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న కొత్త కారు MG Aster. MG Astor ఈ కొత్త SUV ని పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలుస్తుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త SUV లో అధునాతన ఫీచర్లను అందిస్తున్నట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో MG Astor పైన అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. MG Motor కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో హెక్టర్, హెక్టర్ ప్లస్, జెడ్ఎస్ ఎలక్ట్రిక్ మరియు గ్లోస్టర్ వంటి వాటిని విక్రయిస్తోంది. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క SUV మోడల్ కార్లు. ఇప్పుడు కొత్త MG Astor కూడా ఈ వరుసలో చేరింది.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

దేశీయ మార్కెట్‌లో రోజురోజుకి ఎస్‌యూవీలకు పెరిగిపోతున్న డిమాండ్ కారణంగా, ఎంజి మోటార్ పెద్ద సంఖ్యలో ఎస్‌యూవీలను విడుదల చేస్తోంది. ఇవన్నీ కూడా దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ కారణంగానే కంపెనీ ఇప్పుడు మరో కొత్త SUV ని విడుదల్ చేయడానికి సిద్ధమవుతోంది.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

MG Motor ఇటీవల కొత్త MG Astor యొక్క కొన్ని వివరాలను అధికారికంగా వెల్లడించింది. కంపెనీ అందించిన అధికారిక సమాచారం ప్రకారం, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎస్‌యూవీకి కంపెనీ ఆడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఆడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ టెక్నాలజీ అనేది ఒక రాడార్ టెక్నాలజీ. ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

MG Motor కంపెనీ ఈ కొత్త MG Astor SUV ని పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉంది. కావున ఇందులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు మాన్యువల్ ఆప్షన్‌తో అందించబడుతుంది. అయితే కంపెనీ దీని గురించి అధికారిక సమాచారం అందించలేదు.

MG Astor దేశీయ మార్కెట్లో త్వరలో విడుదల కానుంది. ఈ SUV భారత మార్కెట్లో విడుదలైన తర్వాత Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq మరియు Volkswagen Taigun వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తానికి ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన అద్భుతమైన ఎస్‌యూవీ.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

టోక్యోలో ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో అనేక మంది భారత క్రీడాకారులు గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ మొత్తం 7 పతకాలను సాధించారు. ఇందులో మీరాబాయి చాను, లవ్లినా బోర్గోహైన్, రవికుమార్ దహియా మరియు బజరంగ్ పునియా వంటి వారికీ రెనాల్ట్ కంపెనీ కిగర్ కారుని లిఫ్ట్ గా అందించారు.

భవినా పటేల్‌కు MG Astor ప్రకటించిన MG Motor: వివరాలు

అదేవిధంగా ఒలంపిక్ గేమ్స్ లో జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు Mahindra and Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) చైర్మన్ Anand Mahindra కొత్త XUV 700 కారును గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకూండా ఒలంపిక్ గేమ్స్ లో పరాజయం పాలైన క్రీడాకారులకు Tata Motors కంపెనీ Tata Altroz కారుని గిఫ్ట్ గా అందించింది.ఒలంపిక్ గేమ్స్ లో దేశ ప్రగతిని నలుదిక్కులా చాటిన క్రీడాకారులు నిజంగా ప్రశంసనీయులు, ఇక ముందు ముందు రానున్న ఒలంపిక్ గేమ్స్ లో మరింత ప్రతిభ కనపరచాలని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Mg motor india to honor paralympics silver medalist with new car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X