భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. తాజాగా, భారతదేశంలో నాన్ ఫంగబుల్ టోకెన్ (NFT) ని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో, భారతదేశంలో NFT ని ప్రారంభించిన మొదటి బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ గా ఎమ్‌జి మోటార్ అవతరించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, NFT ద్వారా సేకరించిన నిధులను సమాజ సేవ కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

భారతదేశంలో ఎమ్‌జి మోటార్ ఇండియా డిసెంబర్ 28, 2021 వ తేదీ నుండి NFT టోకెన్లను విక్రయించనుంది. ఈ లాంచ్ కలెక్షన్‌లో భాగంగా కార్‌మేకర్ 1,111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్‌ను పరిచయం చేస్తుంది. కార్‌మేకర్ తన మొదటి NFT ని KoineArt యొక్క NgageN ప్లాట్‌ఫారమ్‌లో పరిచయం చేస్తుంది, ఇది MG లావాదేవీల కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడిన క్రిప్టో కరెన్సీ ప్రోగ్రామ్.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

NFT అంటే ఏమిటి?

NFT అంటే నాన్ ఫంగబుల్ టోకెన్. NFT అనేది బిట్‌కాయిన్ లేదా ఇతర క్రిప్టోకరెన్సీలకు సమానమైన క్రిప్టో టోకెన్. NFT అనేది విలువను ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన డిజిటల్ టైప్ ఆస్తి రకం అని చెప్పవచ్చు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు బిట్‌కాయిన్‌లను కలిగి ఉంటే, వారు వాటిని మార్పిడి చేసుకోవచ్చు. డిజిటల్ ఆర్ట్, మ్యూజిక్, ఫిల్మ్‌లు, గేమ్‌లు లేదా ఏదైనా సేకరణ వంటి డిజిటల్ ఆస్తులలో NFT లను కనుగొనవచ్చు.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

ఇవి ప్రత్యేకమైన కళాఖండాలు మరియు ప్రతి టోకెన్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి, వాటిని మార్పిడి చేయడం సాధ్యం కాదు. ఈ డిజిటల్ టోకెన్ యాజమాన్యం యొక్క చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్‌ను పొందుతుంది. ఎవరి ఆర్ట్ ఈ వర్గంలోకి వస్తుంది, అతని ఆర్ట్ యాజమాన్యం యొక్క సర్టిఫికేట్ పొందుతుంది. ఈ డిజిటల్ సర్టిఫికేట్ నకిలీ చేయబడదని నిర్ధారించబడుతుంది మరియు సదరు ఆర్ట్ యజమానికి కాపీరైట్ హక్కును ఇస్తుంది.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

NFT ఎలా పని చేస్తుంది?

నాన్ ఫంగబుల్ టోకెన్‌లను డిజిటల్ ఆస్తులు లేదా ఒకదానికొకటి వేరు చేయలేని వస్తువుల కోసం ఉపయోగించవచ్చు. ఇది వారి విలువ మరియు ప్రత్యేకతను రుజువు చేస్తుంది. ఇవి వర్చువల్ గేమ్‌ల నుండి ఆర్ట్‌వర్క్ వరకు ప్రతిదానికీ ఆమోదాన్ని అందించగలవు. NFTలు ప్రామాణిక మరియు సాంప్రదాయ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేయబడవు. వీటిని డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

క్షీణిస్తున్న ఎమ్‌జి మోటార్ అమ్మకాలు

ఇదిలా ఉంటే, గ్లోబల్ సెమీ కండక్టర్ చిప్ షార్టేజ్ కారణంగా ఎమ్‌జి మోటార్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ కొరత కారణంగా, కంపెనీ డిమాండ్ కి తగినట్లుగా వాహనాలను ఉత్పత్తి చేయలేకపోతోంది. దీంతో కస్టమర్లు ఇతర బ్రాండ్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా, ఎమ్‌జి బ్రాండ్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ కంపెనీ గడచిన నవంబర్ 2021 నెలలో కేవలం 2,481 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు మాత్రమే విక్రయించింది.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

ఇవి నవంబర్ 2020లో విక్రయించబడిన 4,163 యూనిట్ల కంటే 40.4 శాతం తక్కువగా ఉన్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాలలో 1,210 యూనిట్లు ఎమ్‌జి హెక్టర్ నుండి మాత్రమే రాగా, 1,018 యూనిట్లు ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ ద్వారా వచ్చాయి. ఎమ్‌జి మోటార్ ఇండియా తాజాగా దేశీయ విపణిలో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆస్టర్ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. కంపెనీ ఈ ఏడాది ముగిసేలోపుగా దాదాపు 5,000 మంది కస్టమర్లకు ఆస్టర్ వాహనాలను డెలివరీ చేస్తామని వాగ్ధానం చేసింది.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

అయితే, సెమీకండక్టర్ కొరత కారణంగా కంపెనీ కార్ల ఉత్పత్తి మరియు వాహనాల డెలివరీలు దెబ్బతిన్నాయని సమాచారం. ప్రస్తుత పరిస్థితి మెరుగుపడకపోతే, కంపెనీ ఆస్టర్ డెలివరీలను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే, కంపెనీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీని మొదటి బ్యాచ్‌లో బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ కంపెనీ పరిచయ ప్రారంభ ధరకే ఈ కారును విక్రయించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసినదే.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

ఎమ్‌జి మోటార్ ఇండియా ఆస్టర్ ఎస్‌యూవీ కోసం అక్టోబర్ 21, 2021వ తేదీన అధికారికంగా బుకింగ్ లను ప్రారంభించింది. అయితే, ఈ మోడల్ కోసం బుకింగ్ లు ప్రారభమైన కొన్ని గంటల్లోనే మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. ఎమ్‌జి ఆస్టర్ కోసం బుకింగ్ లు ప్రారంభమైన కొన్ని గంటల్లో, ఇది ఈ ఏడాది కోసం పూర్తిగా విక్రయించబడింది. ఆ తర్వాత కొత్తగా ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకునే కస్టమర్లకు 2021 లో డెలివరీ కాదు, పైగా వీరికి పెరిగిన కొత్త ధరలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

భారతదేశంలో తొలి NFT (నాన్ ఫంగబుల్ టోకెన్) ని ప్రారంభించనున్న MG Motor; అదేంటంటే..?

ప్రస్తుతం, మార్కెట్లో ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ప్రారంభ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. అయితే, వీటి తర్వాత కొత్త ధరలు ఏంటనే విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ ఈ విభాగంలోని ఇతర మోడళ్ల కన్నా భిన్నంగా ఉంటుంది మరియు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్-కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్ మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి లెవల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Mg motor india to launch non fungible token nft soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X