ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్.. వచ్చేస్తుందోచ్

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి అత్యంత ప్రాచుర్యం పొందిన కంపెనీలలో ఒకటి MG Motors. ఈ MG Motors సంస్థ ఇప్పుడు దేశీయ మార్కెట్లో తన MG ZS EV ఎలక్ట్రిక్ SUV యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

MG Motors యొక్క MG ZS EV ఎలక్ట్రిక్ SUV యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ కొత్త డిజైన్ పొందటమే కాకుండా, అనే అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలియు ఉంటుంది. 2018 లో అంతర్జాతీయ మార్కెట్‌లో మొట్టమొదటి సారిగా విడుదల చేయబడిన ఈ MG ZS EV ఇప్పుడు గణనీయమైన అప్‌డేట్‌లను పొందింది.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

MG Motors యొక్క MG ZS EV ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ అప్‌డేట్ చేయబడిన కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇది మెరుగైన పనితీరుని అందించడానికి పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కూడా పొందింది.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

MG ZS EV ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఈ కారు యొక్క ముందు భాగం ఎక్కువ అప్డేట్ చేయబడింది. ఇది కొత్త షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు ZS SUV యొక్క పెట్రోల్ మోడల్ వంటి టెయిల్‌లైట్‌లను పొందుతుంది. ముందు భాగంలో, దాని పాత మోడల్ యొక్క డిజైన్ గ్రిల్ తీసి కవర్ ప్లేట్‌గా మార్చబడింది. దీనిని మీరు ఇక్కడ గమనించవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

ఫ్రంట్ బంపర్ కూడా అప్‌డేట్ చేయబడింది, అంతే కాకుండా దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రస్తుత ZS EV మోడల్ కంటే కొత్త మోడల్ డిజైన్ మరింత ఆధునికమైనది మరియు ఏరోడైనమిక్. ఇది చూడటానికి చాలా ఆకర్శణీయంగా ఉంటుంది. ఈ కొత్త మోడల్ యొక్క రియర్ ప్రొఫైల్‌లో కూడా కొంత అప్డేట్ గమనించవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

ZS EV ఫేస్‌లిఫ్ట్ కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది, ఇది విజువల్ అప్పీల్‌ను మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త MG ZS EV ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను చాలా ఆధునికంగా కనిపించే విధంగా చేస్తాయి.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

ZS EV ఫేస్‌లిఫ్ట్ యొక్క క్యాబిన్ కూడా చాలా అప్డేట్స్ పొందుతుంది. ఇది కొత్త MG iSMART ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో 10.1-ఇంచెస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిమోట్ కంట్రోల్ ఫంక్షన్లు మరియు కనెక్టివిటీ కోసం మరిన్ని ఆప్షన్లను పొందుతుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

MG ZS EV ఫేస్‌లిఫ్ట్ యొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ విషయానికి వస్తే, ఇది మునుపటికంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. ఇప్పుడు ఇందులో 72 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ ఒక ఫుల్ చార్జ్ తో ఏకంగా 439 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ పరిధి దాని సాధారణ మోడల్ కంటే చాలా ఎక్కువ. 318 కిమీ రేంజ్‌ని అందించే 51 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 2022 లో అందుబాటులోకి వస్తుందని కూడా కంపెనీ తెలిపింది.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

అప్డేటెడ్ MG ZS EV ఫేస్‌లిఫ్ట్ ఛార్జింగ్ పోర్ట్ లోపల ఫోర్ స్టేజి ఇండికేటర్ ఎల్ఈడీ యూనిట్స్ ఉంటాయి. ఇది ఛార్జింగ్ స్థితిని చూపుతుంది. ఈ కారు టైప్ 2 మరియు సిసిఎస్ ఛార్జర్‌తో పాటు బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయగల సామర్థ్యం కలిగిన ఆన్ బోర్డు ఎసి ఛార్జర్‌ని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా మునుపటి మోడల్ కంటే చాలా అధునాతనంగా ఉంటాయి.

ఒక్క ఛార్జ్‌తో 439 కిమీ పరిధి అందించే MG ZS EV ఫేస్‌లిఫ్ట్: వచ్చేస్తుందోచ్

MG Motors భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్న అధునాతన SUV కొత్త MG Astor. ఈ కొత్త MG Astor దేశీయ మార్కెట్లో 2021 అక్టోబర్ 11 న అధికారికంగా విడుదల కానుంది. ఇది భారతదేశంలో MG మోటార్స్ యొక్క అత్యంత ఆధునిక మరియు పర్సనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్ కలిగిన దేశంలోనే మొదటి SUV కానుంది.ఎంజి ఆస్టర్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Mg zs ev facelift unveiled range 439 km features updates details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X